Kavitha
రాజకీయాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తేనే సక్సెస్ అవుతారు. హడావుడిగా, గందరగోళ పరిస్థితులతో దూకుడుగా వెళితే మాత్రం మనకి నష్టమే కాదు ప్రత్యర్థులకే ఎక్కువ లాభం జరుగుతుంది. ప్రస్తుతం కవిత (Kavitha) ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. తండ్రి, అన్నతో విభేదించి పార్టీకి గుడ్ బై చెప్పిన కవిత.. వచ్చీ రావడంతోనే కేసీఆర్ ను తప్ప గులాబీ పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావులనే టార్గెట్ చేసింది.
మొదట్లో బీఆర్ఎస్ శ్రేణులు కవిత(Kavitha) తీరుపై షాక్ తిన్నా తర్వాత పుంజుకున్నారు. ఆమె విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో కేటీఆర్, హరీశ్ రావు మరింత దగ్గరయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే బావా , బావమరిదిలను కవితే ఏకం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ తర్వాత పార్టీలో కేటీఆర్, హరీశ్ రావే కీలకం.
వీరిద్దరికి తమ తమ బలగాలు బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు పార్టీ స్వీయరక్షణ కోసం కేటీఆర్, హరీశ్ రావు కలిసిపోయి కవితను ఉమ్మడిగా ఎదుర్కొంటున్నారు. గతంలో సోషల్ మీడియాలో తనపై రాతలు రాయించేది కేటీఆర్ అని కవిత(Kavitha) పరోక్షంగా విమర్శించారు. అలాగే ఈ కార్ రేస్, ఫోన్ టాపింగ్ వ్యవహారాల్లోనూ కేటీఆర్ పై కవిత సెటైర్లు వేశారు. రాజకీయంగా అనుభవంతో ఆలోచించిన కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ కవితని ఉమ్మడిగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు.
తామిద్దరూ బలంగా నిలబడితే , పార్టీకి ఉత్సాహం వస్తుందని, కార్యకర్తలు కలిసికట్టిగా పనిచేస్తారని నమ్మడం కలిసొచ్చింది. వ్యక్తిగత అజెండాలు, స్వార్ధాలు, గ్రూపులు పక్కనపెట్టి తామిద్దరూ ఒక్కటేనని నిరూపిస్తున్నారు. , కవిత చేసే ఆరోపణలు జనం నమ్మకుండా ఉండాలి అంటే, తామంతా ఒక్కటిగా ఉండాలని.. పార్టీ బలంగా ఉంది, ఐకమత్యంగా ఉంది మా మధ్య ఎటువంటి గ్యాప్ లేదు అనే విషయం జనంలోకి తీసుకు వెళ్లాలని కేటీఆర్ హరీష్ రావులు నిర్ణయించుకున్నట్లు ఉంది.
అందుకే పర్సనల్ జెండాలు పక్కన పెట్టారు. ప్రతి సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి చెలరేగిపోతున్నారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. కవిత కాంగ్రెస్ ను పెద్దగా విమర్శించకపోవడం చాలా మందికి కొన్ని అనుమానాలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పై వస్తున్న ఆరోపణలపై స్పందించకపోవడంతో కవిత టార్గెట్ తామేనని కేటీఆర్, హరీశ్ లకు అర్థమైంది. దీంతో వ్యూహాత్మకంగా ఆలోచించడమే కాదు తాము ఇద్దరం కలిసున్నామనే గట్టి సంకేతాన్ని అటు పార్టీ శ్రేణులకు పంపించారు.
IND vs NZ 3rd T20 : హ్యాట్రిక్ కొట్టాలి సిరీస్ పట్టాలి.. కివీస్ తో మూడో టీ20
