Meerpet Madhavi
తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన మీర్‌పేట మాధవి (Meerpet Madhavi)హత్య కేసు దర్యాప్తులో ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక మాజీ ఆర్మీ జవాన్ తన భార్యను ఎంత క్రూరంగా అంతం చేశాడనేది వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవడం ఖాయం అనేలా ఈ కేసు సాగుతోంది.
అయితే భర్త గురుమూర్తి తన సొంత మరదలితో ఉన్న వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. భార్య మాధవి(Meerpet Madhavi) అడ్డు తొలగించుకోవాలనే పక్కా పథకంతో ఆమెను చంపి, ఆ తర్వాత చేసిన పనులు రాక్షసత్వాన్ని తలపిస్తున్నాయి.
జనవరి 14 (సంక్రాంతి) రోజున మాధవి(Meerpet Madhavi) అదృశ్యమైందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త గురుమూర్తి కూడా ఏమీ తెలియనట్టు పోలీసులతో కలిసి గాలింపులో పాల్గొన్నాడు. కానీ, అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.
గురుమూర్తికి తన సొంత మరదలితో ఉన్న అక్రమ సంబంధం కారణంగా భార్యతో గొడవలు మొదలయ్యాయి. ఆ అడ్డు తొలగించుకోవడానికి సంక్రాంతి మరుసటి రోజున (జనవరి 15) మాధవిని గొంతు పిసికి చంపేశాడు.
గురుమూర్తి సైనిక శిక్షణలో నేర్చుకున్న టెక్నిక్స్‌ను సాక్ష్యాలను మాయం చేయడానికి వాడాడు. మాధవి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి, వాటర్ హీటర్ ద్వారా బకెట్లో ఉడికించాడు. ఎముకలను ఇనుప రాడ్‌తో దంచి పొడి చేసి జిల్లేలగూడ చెరువులో కలిపేశాడు. కొన్ని శరీర భాగాలను స్టవ్ పై కాల్చి బూడిద చేసి బాత్రూంలో ఫ్లష్ చేశాడు. పోలీసులకు కనీసం ఆమె గోరు కూడా దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. కానీ, ఇంట్లో దొరికిన చిన్న రక్తపు చుక్కల ఆధారంగా ఫోరెన్సిక్ టీమ్ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి నిందితుడిని పట్టుకుంది.
ప్రస్తుతం రంగారెడ్డి కోర్టులో ఈ కేసు విచారణ స్పీడ్ గా జరుగుతోంది. పోలీసులు 36 మంది సాక్ష్యులను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. మరదలితో ఉన్న అక్రమ సంబంధమే ఈ ఘోరానికి కారణమని శాస్త్రీయంగా నిరూపించారు. సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉండటంతో గురుమూర్తికి కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.
