Mega family:అల్లు కుటుంబానికి తోడుగా మెగా ఫ్యామిలీ.. పుకార్లకు చెక్

Mega family: విశాఖపట్నంలో జనసేన బహిరంగ సభ ముగిసిన తర్వాత, రాత్రికి రాత్రి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న పవన్.. నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.

Mega family

నిన్న అంటే ఆగస్ట్ 30న అల్లు అరవింద్ తల్లి, అల్లు కనకరత్నమ్మ మరణం అల్లు, మెగా కుటుంబాల(Mega family)ను తీవ్ర శోకంలో ముంచేసింది. అయితే, ఈ విషాద సందర్భంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని మరోసారి నిరూపించింది. మెగాస్టార్ చిరంజీవి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి, ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించి, అల్లు అరవింద్, బన్నీలను ఓదార్చారు.

Mega family

అయితే,అదే కాకుండా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరామర్శ. నిన్న విశాఖపట్నంలో జనసేన బహిరంగ సభ ముగిసిన తర్వాత, రాత్రికి రాత్రి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న పవన్.. నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అక్కడ అల్లు కనకరత్నమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించి, అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ బన్నీతో మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి.

Mega family

ఈ ఫోటోలు ఇప్పుడు ఎందుకు ఇంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయంటే… గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ ఒకానొక సందర్భంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడికి మద్దతు ఇవ్వడంతో, పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు బన్నీపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్నుంచి మెగా, అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ వద్దన్నా కూడా నడుస్తూనే ఉన్నాయి. ఈ సంఘటనల వల్ల మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని అనేక పుకార్లు షికార్లు చేశాయి.

Mega family

కానీ, ఈ విషాద సందర్భంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అల్లు కుటుంబాని(Mega family)కి అండగా నిలబడటం ద్వారా, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారి బంధం ఎంత బలమైనదో మరోసారి రుజువైంది. ఇటు రాజకీయాలు వేరు, కుటుంబ బంధాలు వేరు అని పవన్ పరామర్శ ద్వారా స్పష్టమైన సందేశం అందింది. ఈ ఫోటోలతోనైనా అభిమానులు వారి మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, అందరూ ఒకటే అని అర్థం చేసుకుంటారని ఆశిద్దాం.

Pulses: పప్పులు ఇలా తింటేనే సంపూర్ణ ఆరోగ్యమట..

Exit mobile version