Revanth Government
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో(Revanth Government) తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ ప్రభుత్వ కార్యాలయం లేదా యూనివర్సిటీ భవనం ప్రైవేట్ బిల్డింగుల్లో నడవకూడదని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం చాలా ప్రభుత్వ శాఖలు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భవనాల్లో ఉంటూ నెలకు లక్షల రూపాయల అద్దె చెల్లిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై అనవసరమైన భారం పడుతోందని భావించిన సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే జనవరి 1 నుంచే ఈ కొత్త నిబంధనలు(Revanth Government) అమల్లోకి రానున్నాయి. డిసెంబర్ 31వ తేదీ లోపు ప్రైవేట్ భవనాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ ఆఫీసులను ప్రభుత్వానికి చెందిన సొంత భవనాల్లోకి మార్చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఏ శాఖ అయినా ఈ గడువు లోపు మారకపోతే ఫిబ్రవరి 1 నుంచి ఆ భవనాలకు అద్దె చెల్లించడం నిలిపివేస్తారు.
గడువు దాటిన తర్వాత కూడా ప్రైవేట్ భవనాల్లోనే కొనసాగితే ఆ అద్దెను సంబంధిత శాఖ అధికారులే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వం దగ్గర ఖాళీగా ఉన్న భవనాల వివరాలను సేకరించి వెంటనే కేటాయింపులు చేయాలని అధికారులకు సూచించారు.
దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Government)మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న వ్యవసాయ సహకార సంఘాల (డీసీసీబీ) పాలకవర్గాలను రద్దు చేశారు.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రధాన జిల్లాల పాలకవర్గాలు ఇందులో ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనలో పారదర్శకత తీసుకురావడానికి, ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
అయితే ఈ నిర్ణయం అమలు చేయడం అంత సులభమైన పని కాదు. దీని వెనుక అనేక సవాళ్లు పొంచి ఉన్నాయి. మొదటి సవాలు ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఆఫీసులు ప్రైవేట్ భవనాల్లో ఉన్నాయి. వీటన్నింటికీ సరిపడా ప్రభుత్వ భవనాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయా అన్నది ప్రధాన ప్రశ్న. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రభుత్వ భవనాలు చాలా వరకు ఇప్పటికే నిండిపోయి ఉన్నాయి.
కొత్తగా వచ్చే ఆఫీసులకు కావాల్సిన పార్కింగ్ సౌకర్యం, ఇంటర్నెట్ కనెక్టివిటీ , ఉద్యోగులకు కావాల్సిన కనీస వసతులు ప్రభుత్వ భవనాల్లో కల్పించడం అధికారులకు పెద్ద టాస్క్ కాబోతోంది. అలాగే రికార్డులను .ఫర్నీచర్‌ను తక్కువ సమయంలో తరలించడం వల్ల పాలనలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.
మరో కీలకమైన అంశం ఏమిటంటే ప్రభుత్వ ఆఫీసులు ఇప్పుడు ఉన్న చోటు నుంచి మారితే ప్రజలకు ఇబ్బందులు కలగొచ్చు. ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న ఆఫీసు హఠాత్తుగా మారితే ప్రజలు కొత్త అడ్రస్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది.
అలాగే ప్రైవేట్ భవనాల యజమానులతో ప్రభుత్వానికి ఉన్న లీజు ఒప్పందాలు ఒక్కసారిగా రద్దయితే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం కూడా ఉంది. కొన్ని భవనాలకు ప్రభుత్వం అడ్వాన్స్ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ఉంటుంది. వాటిని వెనక్కి తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తొచ్చు.
దీంతో ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. ఖాళీగా ఉన్న పాత సచివాలయ భవనాలు, జిల్లా కలెక్టరేట్లలోని అదనపు గదులు , ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఖాళీ స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. సాఫ్ట్‌వేర్, టెక్నాలజీని ఉపయోగించి ఏ ఆఫీసు ఎక్కడికి మారాలి అనే దానిపై ఒక మ్యాపింగ్ కూడా సిద్ధం చేస్తోంది.
ఒకే చోట ఎక్కువ ఆఫీసులను చేర్చడం ద్వారా ప్రజలకు కూడా సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఒకే గొడుగు కింద పది రకాల పనులు అయ్యేలా కాంప్లెక్స్ తరహాలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. అద్దె రూపంలో ఆదా అయ్యే కోట్లాది రూపాయలను ఆ భవనాల ఆధునీకరణకు వాడాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Government) మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రధాన జిల్లాల పాలకవర్గాలు ఇందులో ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ జోక్యం తగ్గించి రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చడమే దీని ప్రధాన ఉద్దేశం.
