Salman Khan: బాలీవుడ్ బాద్‌షా చూపు హైదరాబాద్ వైపు.. మొన్న అజయ్ దేవగణ్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ భారీ పెట్టుబడులు..

Salman Khan: బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా హైదరాబాద్‌లో స్టూడియోలు, నిర్మాణాలు చేపట్టాలని ఆసక్తి చూపారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ రూ. 10 వేల కోట్ల పెట్టుబడితో రావడం, బాలీవుడ్ దృష్టి దక్షిణం వైపు మళ్లిందేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Salman Khan

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతున్న సమయంలో, బాలీవుడ్ అగ్రశ్రేణి హీరో సల్మాన్ ఖాన్ నేతృత్వంలోని సల్మాన్ ఖాన్(Salman Khan) వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SKVPL) తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు వద్ద జరుగుతున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ తొలిరోజు ఈ కీలక ప్రకటన వెలువడింది. ఈ సమ్మిట్‌లో సుమారు 35కు పైగా ఎంఓయూలు కుదరగా, మొత్తం రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అందులో సల్మాన్ ఖాన్(Salman Khan) కంపెనీ వాటా ఏకంగా రూ. 10,000 కోట్లు కావడం హాట్ టాపిక్‌గా మారింది!

రూ. 10,000 కోట్ల ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్.. SKVPL సంస్థ తెలంగాణలో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ , ఒక అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వినోద వసతులు, లగ్జరీ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

టౌన్‌షిప్, స్టూడియో ప్రత్యేకతలు:

టౌన్‌షిప్.. ఛాంపియన్‌షిప్ గోల్ఫ్ కోర్సు,రేస్ కోర్సు,ప్రీమియం రెసిడెన్షియల్ స్థలాలు, హై-ఎండ్ విశ్రాంతి సౌకర్యాలు, క్యూరేటెడ్ నేచర్ ట్రైల్స్ ఉంటాయి.

ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్..పెద్ద ఫార్మాట్ ప్రొడక్షన్‌లు, ఓటీటీ కంటెంట్ నిర్మాణానికి ప్రత్యేక సదుపాయాలు.పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు ,టాలెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లకు మద్దతు ఇచ్చేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ స్టూడియో నిర్మించబడుతుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భారీ పెట్టుబడులను హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో అనేక ఉద్యోగాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, చలనచిత్ర నిర్మాణం, వినోదం, లగ్జరీ పర్యాటకానికి తెలంగాణను ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, కనెక్టివిటీ, పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సృజనాత్మకత, ఆర్థిక వృద్ధికి బలమైన పునాది పడుతుందని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Salman Khan

బాలీవుడ్ దృష్టి హైదరాబాద్‌పై ఎందుకు?

ఇటీవల,బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా హైదరాబాద్‌లో స్టూడియోలు, నిర్మాణాలు చేపట్టాలని ఆసక్తి చూపారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్(Salman Khan) రూ. 10 వేల కోట్ల పెట్టుబడితో రావడం, బాలీవుడ్ దృష్టి దక్షిణం వైపు మళ్లిందేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి..

దీనికి ప్రధాన కారణాలు అద్భుతమైన మౌలిక సదుపాయాలు.. ఇప్పటికే హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ వంటి అతిపెద్ద స్టూడియోలు ఉన్నాయి, ఇది కొత్త నిర్మాతలకు నమ్మకాన్ని ఇస్తుంది.

అనుకూల ప్రభుత్వ విధానాలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా అనుమతులు ఇస్తామని హామీ ఇవ్వడం.

టెక్నాలజీ హబ్.. హైదరాబాద్ సాంకేతిక రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం, ఇది అత్యాధునిక పోస్ట్ ప్రొడక్షన్ అవసరాలకు అనుకూలం.

ప్యాన్-ఇండియా మార్కెట్.. హైదరాబాద్ కేంద్రంగా నిర్మాణం చేపడితే, అది టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ మార్కెట్‌ను కూడా సులభంగా చేరుకునే అవకాశం.

ఈ పెట్టుబడులు కేవలం సినిమా రంగానికే కాకుండా, లగ్జరీ టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో కూడా తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version