Global Summit: 44 దేశాల డెలిగేట్స్‌తో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..విజన్ డాక్యుమెంట్ ఖరారు

Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు ఘనంగా ప్రారంభం అవుతుంది.

Global Summit

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోగతిని, భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Global Summit)కు ఫ్యూచర్ సిటీలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ ఎకనామిక్ సమ్మిట్‌కు సంబంధించిన వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా వెల్లడించారు.

ఈ గ్లోబల్ సమ్మిట్(Global Summit) ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చడమే. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక కచ్చితమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ అంతా కలిసి కూర్చుని, నీతి ఆయోగ్ , ఐఎస్బీ (ISB) వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థల సలహాలు, సూచనలతో ఈ కీలకమైన విజన్ డాక్యుమెంట్‌ను ఖరారు చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ సమ్మిట్‌లో కీలక అంశంగా చర్చకు రానుంది.

Global Summit

ఈ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు ఘనంగా ప్రారంభం అవుతుంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌ను లాంచ్ చేయనున్నారు. ప్రారంభ సెషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వంటి ప్రముఖులు ప్రసంగాలు చేస్తారు. ప్రపంచంలోని గొప్ప గొప్ప ఎకానమిస్టులు ఈ సెషన్లలో పాల్గొని, తెలంగాణ ఆర్థిక ప్రణాళికలకు తమ సలహాలు, సూచనలు అందించనున్నారు.

9వ తేదీన కూడా అనేక డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన సెషన్స్ కొనసాగుతాయి. ఈ సెషన్లను ఆయా డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన మంత్రులు చూసుకుంటారు. అనేకమంది రంగ నిపుణులు (ఎక్స్‌పర్ట్స్) ఈ చర్చల్లో పాల్గొని, వివిధ రంగాల్లో తెలంగాణ వృద్ధికి సంబంధించిన లోతైన విశ్లేషణలు అందించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ క్లోజింగ్ సెరిమనీ ఉంటుంది. ఇందులో పాల్గొనే అతిథుల వివరాలను త్వరలో తెలియజేయనున్నారు.

Global Summit

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ యొక్క అంతర్జాతీయ ప్రాధాన్యతను నిరూపిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల నుంచి ఏకంగా 154 మంది డెలిగేట్స్ హాజరవుతున్నారు. ఈ డెలిగేట్స్‌లో ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు రావడం ఈ సమ్మిట్ పట్ల అంతర్జాతీయ సమాజంలో ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నామని, స్వయంగా అధికారులు వెళ్లి ఆఫీషియల్‌గా ఆహ్వానాలు అందిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version