Sheep Scam: గొర్రెలకు డూప్లికేట్ ట్యాగ్‌లు..స్కామ్‌లోనూ క్రియేటివిటీ

Sheep Scam: తెలంగాణలో గొర్రెల పథకం పేరుతో భారీ కుంభకోణం! ఈడీ దాడుల్లో రూ.1000 కోట్లకు పైగా అవినీతి బయటపడింది. తలసాని సహా పలువురిపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

Sheep Scam

తెలంగాణ (telangana) లో ఇప్పటివరకు ఎన్నో కుంభకోణాలు బయటపడినా..జనం విని ఆశ్చర్యపోయినా.. ఈసారి మాత్రం దాని అవతారమే వేరేలా ఉంది. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలని పట్టుదలగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం.. ఇప్పుడు స్కాం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇది గొర్రెల సంగతే గానీ… లోపల కుర్చీ గుట్టులు బయటపడుతున్నాయి.

2025 జులై 30: ఈడీ బలగాలు హైదరాబాద్ సహా ఎనిమిది ప్రాంతాల్లో దాడులు జరిపాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) కార్యాలయం, ఆయనకు సన్నిహితుల ఇళ్లు, పథకం లబ్ధిదారుల ఇళ్లల్లో సోదాలు జరిగాయి. వాళ్లు ఏమి దొరుకుతుందోనని చూడగా.., చేతుల్లో పడ్డది మాత్రం కోట్లు కోట్ల వ్యవహారం. చెక్ బుక్‌లు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, సిమ్ కార్డులు, డెబిట్ కార్డులు, ఫోన్‌లు ఇలా అన్నీ గుట్టల కొద్దీ. అంతేకాదు, పక్కా ప్రూఫ్‌లతోనే గుట్టు విప్పేశారు.

sheep-scam

సి.ఏ.జి (CAG) నివేదికలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కేవలం 7 జిల్లాల్లోనే రూ.254 కోట్లు ల్యాప్ అయ్యాయి. అంటే మొత్తం 33 జిల్లాలు కౌంట్ చేస్తే, స్కామ్ రూ.1000 కోట్లు దాటి పోయిందని అంచనా.

డూప్లికేట్ ట్యాగ్‌ల(Duplicate tags)తో గొర్రెల పేర్లు ఫేక్‌గా ఎంటర్ చేయడంతో పాటు మృతుల పేర్లకే యూనిట్లు పంపిణీ చేశారు. రవాణా ఇన్‌వాయిసులు నకిలీ వాహనాలతో ..పక్క రాష్ట్రాల్లో గొర్రెలు కొనకపోయినా కొనగలిగినట్టుగా బిల్లు వేశారు అంతేకాదు ఫేక్ లబ్ధిదారులతో గిరిజనుల పేరును వాడుకున్నారట!

ఇది గొర్రెల కథ కాదు… ఇది ప్రభుత్వ నిధులను పుల్లలుగా తినే అవినీతి మాఫియాల స్కెచ్. పథకం పేరుతో పాలిపోయిన వేల కోట్లు… ఇప్పుడు కేంద్ర సంస్థల కన్ను పడడంతో వదిలిపెట్టే పరిస్థితి లేదనిపిస్తుంది.

ప్రజల డబ్బుతో గొర్రెల పేరుతో జోలె తిప్పిన రాజకీయాలు… ఈడీ రిపోర్టుతో బయటపడుతున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ (talsani srinivas yadav)పేరు టార్గెట్ అయినా, ఇది ఒకరితో ముగిసే వ్యవహారంగా కనిపించడం లేదు. మరిన్ని పేర్లు బయటకు రావడం ఖాయం. ఇది గొర్రెల స్కాం (Sheep Scam) కాదు.. ఇది ప్రభుత్వ వ్యవస్థను గొర్రెలుగా మోసం చేసిన స్కామ్ (Sheep Scam)అంటే కరెక్టుగా సరిపోతుందేమో.

Exit mobile version