Telangana: సీఎం ఢిల్లీ టూర్ చుట్టూనే బీఆర్ఎస్ రాజకీయాలు.. ఎందుకిలా?

Telangana: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పాలనపై గట్టిగా ప్రశ్నించిన ఆయన, రేవంత్ 50 సార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్రానికి ఏమి లాభం లేదని వ్యాఖ్యానించారు.

Telangana

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల పైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 50 సార్లు ఢిల్లీకి వెళ్లారంటూ ఎక్స్ వేదికగా ఆరోపించారు. ‘హస్తిన యాత్రలో రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కేటీఆర్ తన పోస్ట్‌లో, రాష్ట్రంలో పాలన ఫైల్స్‌తో కాకుండా ఫ్లైట్ టికెట్లతో నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత Telangana రేవంత్ రెడ్డి చేసిన మూడు పనులు:

Telangana

ముఖ్యమంత్రి పదే పదే ఢిల్లీకి వెళ్లడం వల్ల రాష్ట్రానికి ఏమీ ఒరిగిందేమీ లేదని, ఎలాంటి ప్రాజెక్టులు, నిధులు, ప్యాకేజీలు తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణకు కావలసింది రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి తప్ప, ఢిల్లీకి యాత్రలు చేసే ‘టూరిస్ట్ సీఎం’ కాదని ఘాటుగా విమర్శించారు.

కేటీఆర్ ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కూడా ప్రస్తావించారు.రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర లేదని, పొలాలకు యూరియా లభించడం లేదని, సాగునీరు, తాగునీరు సమస్యలు ఉన్నాయని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ పనులు జరగకుండా అడ్డుకుని తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, అలాగే బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Kaleshwaram

అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, రుణమాఫీ, రైతు భరోసా, రూ.4,000 పింఛన్, తులం బంగారం వంటి హామీల ఊసే లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. గురుకుల విద్యార్థుల సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై విమర్శలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా బీఆర్‌ఎస్ నాయకులు ఇదే తరహాలో విమర్శలు చేశారు.

అయితే, ఈ ఆరోపణలకు రేవంత్ రెడ్డి గతంలోనే గట్టిగా బదులిచ్చారు. Telangana ముఖ్యమంత్రిగా తాను రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నానని, కేంద్ర మంత్రులు, అధికారులతో సమావేశాలు జరిపి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడానికి కృషి చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు.

అలాగే, రాష్ట్రంలోని సమస్యల గురించి కేంద్ర పెద్దలకు వివరించడం తన బాధ్యత అని ఆయన గతంలో పేర్కొన్నారు. తాజాగా కేటీఆర్ చేసిన ‘అర్ధశతకం’ ఆరోపణలపై మాత్రం రేవంత్ రెడ్డి ఇంకా స్పందించలేదు.

మొత్తంగా, Telangana CM రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలను బీఆర్‌ఎస్ ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై పట్టు కోల్పోయిందని, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయిందని ప్రజల్లో ఒక భావన కలుగజేయాలని చూస్తోంది. దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో దీనిని ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుని, తమ పార్టీకి తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావాలనేది బీఆర్‌ఎస్ వ్యూహంగా కనిపిస్తోందని భావిస్తున్నారు.

Also Read: High Heels :కాలం మార్చిన ఫ్యాషన్ కథ .. హైహీల్స్‌ వెనుక రహస్యం !

 

Exit mobile version