Real Boom
ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిన పరిస్థితులు గత పదేళ్ళలో అయితే లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో కూల్చివేతలు మొదలుపెట్టడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. కొనుగోళ్లు తగ్గిపోయాయి. డిమాండ్ పడిపోయింది. కొత్త ఫ్లాట్లు కొనేందుకు సామాన్యులు అసలే ముందుకు రాకపోగా.. అంతకంటే పై వర్గం వాళ్లు కూడా ఆలోచిస్తున్నారు.ఇదే సమయంలో కోకాపేట భూముల వేలం అందరి దృష్టిలో పడింది. నిన్న మొన్నటి వరకూ కామ్‌గా ఉన్న రియల్ బూమ్ ఒక్కసారికి ఆకాశానికి ఎగిరిందేంటని షాక్ అయ్యారు.
అయితే ఇదంతా హైదరాబాదులో ఆర్టిఫిషియల్ రియల్ బూమ్ (Real Boom)సృష్టించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ద ఎత్తున చేసిన కసరత్తే కారణమన్న టాక్ బీభత్సంగా వినిపిస్తోంది. దానిలో భాగంగానే కోకాపేట్ లో ఎకరం 151 కోట్లు …. ఎకరం 148 కోట్ల రూపాయలు పలికించిందని వార్తలు గుప్పుమంటున్నాయి.
రియల్ ఎస్టేట్ (Real Boom)చరిత్రలోనే కోకాపేటకు వచ్చిన అత్యధిక రికార్డు ధర ఇది. రెండేళ్ల క్రితం కెసిఆర్ హయాంలో ఇదే చోట ఎకరం 100 కోట్లు పలికింది. అప్పట్లో కేటీఆర్… మై హోమ్, రాజ్ పుష్ప తో పాటు మరికొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కలిసి హైదరాబాదులో ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ భూమ్ (Real Boom)సృష్టించడానికి… క్విడ్ ప్రోకో కింద… ఇలా ఎకరం 100 కోట్లకు అమ్మించి ఆ తర్వాత అది వర్కౌట్ కాకపోవడంతో చేతులెత్తేశారని ఆరోపణలున్నాయి. అప్పుడు కేసీఆర్ , కేటీఆర్ ని ఇదే విషయంపై విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తన ప్రభుత్వ హయాంలోనూ అదే పని చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ సంస్థల మెడపై కత్తి పెట్టి మరి కోకాపేట, నీయోపోలీస్ ఏరియాలో ఎకరం 148 నుంచి 151 కోట్లకు కొనిపిస్తున్నారు. అసలు ఎకరం 151 కోట్లకు కొంటే ఎవరికి లాభం..అపార్ట్ మెంట్లు కట్టిన తర్వాత ఏ రేంజ్ లో ధరలు డిసైడ్ చేసినా కొనేవాళ్లు రాకుంటే మళ్లీ రియల్ ఎస్టేట్ ఢమాల్ అంటుంది.
ఆ తర్వాత ఆ భూములకు చుట్టూ ఉన్న మిగిలిన ప్రైవేట్ భూములకు కూడా రేట్లు ఆటోమేటిగ్గా పెంచేశారు. రియల్టర్లు ఎగబడి కొనేశారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి కూడా అదే టెక్నిక్ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. అప్పుడు భూములు వేలంపాడిన మై హోమ్, రాజ్ పుష్ప ఇప్పుడెందుకు వేలంలో పాల్గొన లేదో ఎవ్వరికి అర్థం కావటం లేదు. ఇప్పుడు కోకాపేట నియో పోలీస్ ప్రాంతాల్లో తాజా వేలంలో ఎమ్మెస్సాన్ అర్చన వెంచర్స్, గోద్రెజ్ సంస్థలు ఎకరం భూమి 148…151 కోట్లకి దక్కించుకున్నాయి.
నిజానికి ఇలా ఎకరం 151 కోట్లకు కొని అక్కడ ఏ రకంగానూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేరని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ప్రభుత్వం కొంతమంది ప్రైవేట్ రియల్ ఎస్టేట్ బిల్డర్లు కలిసి చేస్తున్న మాయాజాలంగా అభివర్ణిస్తున్నారు.ప్రభుత్వ భూమి ఎకరం 150 కోట్లకు అమ్మితే ఇక చుట్టుపక్కల భూములన్నీ రేట్లు ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి.
ప్రభుత్వం దగ్గర ఎకరం 151 కోట్లకు అధిక రేటు ఇచ్చి కొన్న…. రియల్ ఎస్టేట్ సంస్థలకు వేరే మార్గంలో వేరే వ్యాపారాల్లో వాళ్లకు లాభం చేకూరుస్తున్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారం భూములు రేట్లు పెంచడానికి అప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు రేవంత్ అండ్ టీమ్ చేస్తున్న ఆర్టిఫిషియల్ రియల్ భూమ్ బిజినెస్ అంటూ కొంతమంది బాహాటంగానే విమర్శిస్తున్నారు.
