Dubai:దుబాయ్‌ను కూడా వణికిస్తున్న యుద్ధ జ్వాలలు..బుర్జ్ ఖలీఫానే టార్గెట్‌

Dubai: అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ సైన్యం ఆ ప్రాంతంలోని అమెరికన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుని.. క్షిపణుల వర్షాన్ని కురిపించింది.

Dubai

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం అలాగే దుబాయ్(Dubai)కి ఎంతో గర్వకారణమైన బుర్జ్ ఖలీఫా దగ్గరలో భారీ పేలుడు సంభవించడంతో..ఈ ఘటన ఒక్కసారిగా గల్ఫ్ దేశాలను వణికించింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ సైన్యం ఆ ప్రాంతంలోని అమెరికన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుని.. క్షిపణుల వర్షాన్ని కురిపించింది.

ఈ సమయంలోనే దుబాయ్‌(Dubai)లోని ప్రతిష్టాత్మకమైన బుర్జ్ ఖలీఫా దగ్గరలో ఒక శక్తివంతమైన పేలుడు జరిగింది. ఈ దాడి జరిగాక.. ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

సుమారు 828 మీటర్ల ఎత్తుతో ఉన్న బుర్జ్ ఖలీఫా మహా కట్టడమే లక్ష్యంగా ..ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే అదృష్టవశాత్తూ ఆ క్షిపణి నేరుగా భవనాన్ని ఢీకొట్టకుండా దానికి అతి దగ్గరలో పడటంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది.

అయితే ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన దుబాయ్ అధికారులు..ముందు జాగ్రత్త చర్యగా అప్పటికే బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించడంతో పెద్ద ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. కేవలం బుర్జ్ ఖలీఫా మాత్రమే కాకుండా, దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన పామ్ జుమేరా ప్రాంతంలోనూ పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రాంతంలో జరిగిన దాడి వల్ల ఓ పెద్ద భవనంలో మంటలు చెలరేగగా, కొంతమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

జనసాంద్రత ఎక్కువగా ఉన్న రెండు భవనాల మధ్య ఇరాన్ ప్రయోగించిన షాహెద్ డ్రోన్ ఒకటి కూలిపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా యుద్ధ భూమిని తలపిస్తోంది. ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ఇతర గల్ఫ్ దేశాలకు కూడా పాకుతూ ఉండటం వల్ల అక్కడ నివసిస్తున్న వేలాది మంది భారతీయుల్లో ఆందోళనలు నెలకొన్నాయి.

Dubai

మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణ వార్త తెలియడంతో.. ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కొన్నిచోట్ల కనిపిస్తున్నాయి. అయితే అదేసమయంలో మరోవైపు ఐఆర్‌జీసీ బలగాలు మాత్రం ..ఈ ప్రతీకార దాడులను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.

ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు , క్షిపణుల వల్ల దుబాయ్ గగనతలంపై పొగ మేఘాలు కమ్ముకున్నాయి. విమాన ప్రయాణాలను పూర్తిగా నిలిపివేయడమే కాకుండా, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని దుబాయ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అత్యంత భద్రత ఉండే దుబాయ్‌లో ఇలాంటి దాడులు జరగడం బట్టి.. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఎంత దారుణంగా మారాయో అర్థం అవుతుంది. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు లక్షలాది మంది సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తం అవడం గ్యారంటీ అని తెలుస్తోంది.

 

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version