Godavari Pushkaralu Logo Contest : గోదావరి పుష్కరాల లోగో క్రియేట్ చేయండి.. గెలిస్తే రూ.లక్ష ప్రైజ్ మనీ..

Godavari Pushkaralu Logo Contest : 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. పుష్కరాల తేదీలు, ఘాట్ల అభివృద్ధి, లోగో పోటీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Godavari Pushkaralu Logo Contest

2027లో రాబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి తెలంగాణ దేవాదాయ శాఖ కీలకమైన అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా పుష్కరాల ఇంపార్టెన్స్, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా లోగో అండ్ ట్యాగ్‌లైన్ రూపొందించడానికి పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది.

ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు తెలుగు, ఇంగ్లీష్‌లో కానీ లేదంటే రెండు భాషల్లో కానీ కలిపి లోగో, ట్యాగ్‌లైన్(Godavari Pushkaralu Logo Contest) డిజైన్ చేసి పంపొచ్చు. దీనిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ. లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తారు. అంతేకాకుండా వీరితో పాటు టాప్ 100 మంది పార్టిసిపేట్స్‌కు సర్టిఫికెట్లు ఇస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం endowments.ts.nic.in వెబ్‌సైట్‌ను చూడొచ్చని అధికారులు తెలిపారు.

మరోవైపు పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తమ కార్యాచరణను వివరించారు. గోదావరి పుష్కరాలకు సుమారు 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు సీఎస్‌కు తెలిపారు.

2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు జరగబోతునున్నాయి. భక్తుల రాకపోకలతో పాటు వారి సౌకర్యాల కల్పన కోసం మొత్తం 67 ప్రాంతాలను తాము గుర్తించినట్లు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ వెల్లడించారు. రద్దీ, ప్రాధాన్యత ఆధారంగా ఈ ప్రాంతాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాల పనులను టైమ్‌ పూర్తి చేయాలని సీఎస్ సంజయ్ జాజూ అధికారులను ఆదేశించారు.

కాగా మరోవైపు తెలంగాణలో గోదావరి ప్రవహించే కొన్ని చోట్ల కొత్త ఘాట్ల నిర్మాణం జరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఘాట్లను పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నారు. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. ఇంత భారీ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో.. ముందస్తు పనులతో పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ యంత్రాంగం సిద్ధమవుతోంది.

Lava Smart 4 Pro : పవర్ ఫుల్ బ్యాటరీ, ఐఫోన్ లుక్..రూ.10,999 కే అదిరిపోయే ఫీచర్లు..

↑
Exit mobile version