Karma : ఇన్‌స్టంట్ కర్మ..చేసిన తప్పుకి అక్కడే, అప్పుడే లెక్క తేల్చేస్తాది..

Karma : కర్మను బూమరాంగ్‌తో పోల్చొచ్చు. ఎందుకంటే మనం ఇతరులకు ఇచ్చేది ఏదైనా సరే అది మంచైనా, చెడైనా చాలా ఫాస్ట్‌గా తిరిగి మన దగ్గరికే రిటర్న్ వచ్చేస్తుంది

Karma

మనం చిన్నప్పటి నుంచి పెద్దవాళ్లు కర్మ గురించి చెబుతుంటే వింటూనే పెరిగాం. ఈ జన్మలో తప్పు చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తారని, ఆ పాపం ఊరికే పోదు అని అనేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది.

ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో, కర్మ(Karma)రియాక్షన్ కూడా అంతే స్పీడ్‌గా ఉంటోందా అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు నిదానంగా అనుభవించే కర్మ ఫలితం.. ఇప్పుడు లైవ్ ప్రసారం లాగా ఎప్పటికప్పుడు అక్కడికక్కడే లెక్క సరిచేసేస్తోందా అన్నట్లు ఉంది.దీనినే ఈ కాలం యూత్ చాలా క్రేజీగా ఇన్‌స్టంట్ కర్మ అని చెప్పుకుంటున్నారు.

నిజానికి మన లేచింది మొదలు మన డైలీ లైఫ్‌లో ఇలాంటి ఇన్‌స్టంట్ కర్మలు చాలానే చూస్తుంటాం. ఆఫీస్‌లో వర్క్ క్రెడిట్ మొత్తం కొట్టేసి, తోటి కొలీగ్‌ని ఇబ్బంది పెట్టాలని చూసినవారికి.. సరిగ్గా నెక్స్ట్ వీక్ బాస్ అంతకంటే పెద్ద టాస్క్ ఇచ్చి మైండ్ బ్లాంక్ చేసేస్తాడు.

అలాగే రోడ్డు మీద వెళ్తూ తెలియనివారితో అనవసరంగా రూడ్‌గా ప్రవర్తించి అదేదో ఘనకార్యం చేసినట్లుగా నవ్వుకుంటే, కాసేపటికే మన బైక్ పంక్చర్ అవ్వడం, ట్రాఫిక్ పోలీస్ భారీగా చలాన్ వేయడం వంటివి జరుగుతాయి.

చూసేవాళ్లకు, చివరకు అనుభవించిన వాళ్లకు కూడా ఇదంతా యాదృచ్ఛికంగా అనిపించవచ్చు కానీ, నిజానికి అక్కడ ప్రకృతి లేదా కర్మ ఇన్‌స్టంట్‌గా లెక్క సెటిల్ చేస్తోందన్నమాట. మనం సొసైటీలోకి ఎలాంటి ఎనర్జీని పంపుతామో, అదే ఎనర్జీ డబుల్ స్పీడ్‌తో మన వైపు దూసుకొస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనో, ఎక్స్ లోనో ఎవరైనా ఒక ప్రాంక్ వీడియో చేస్తూ వేరేవాళ్లను ఇబ్బంది పెట్టాలని చూస్తే, అదే వీడియోలో వాళ్లే అనుకోకుండా కిందపడటమో లేక వాళ్లకే రివర్స్ అవ్వడమో చూస్తూనే ఉన్నాం.

Karma

ఒకప్పుడు కర్మ(Karma) అనేది చాలా సైలెంట్‌గా ఉండేది. కానీ ఇప్పుడు వెంటనే రిజల్ట్ చూపిస్తుంది. అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, లేదా ఒకరి గురించి చెడుగా ఆలోచించేటప్పుడు కాస్త అలర్ట్‌గా ఉండాలని పెద్దలు అంటారు. ఎందుకంటే మనం చేసే ప్రతి చిన్న తప్పును కూడా కర్మ సీక్రెట్‌గా గమనిస్తూనే ఉంటుంది.

కర్మను బూమరాంగ్‌తో పోల్చొచ్చు. ఎందుకంటే మనం ఇతరులకు ఇచ్చేది ఏదైనా సరే అది మంచైనా, చెడైనా చాలా ఫాస్ట్‌గా తిరిగి మన దగ్గరికే రిటర్న్ వచ్చేస్తుంది. నెక్స్ట్ టైమ్ ఎవరికైనా హాని చేయాలని అనుకున్నప్పుడు .. బ్యాక్ గ్రౌండ్‌లో ఇన్‌స్టంట్ కర్మ తన 5G స్పీడ్‌తో రెడీగా ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ, చెడు చేయకుండా ఉండటమనే అలవాటును నేర్చుకోవాలి.

Pod Taxi : గాల్లో తేలుతూ వెళ్లే పాడ్ ట్యాక్సీలు.. ఇండియాలోనే ఫస్ట్ టైమ్..

Exit mobile version