Ajna Chakra vs Brahmarandhra
ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయగానే నుదుట ఎర్రటి కుంకుమో, తిలకమూ, స్టిక్కరో పెట్టుకుంటారు. మహిళలు రోజూ అలంకారంగా పెట్టుకుంటే, పురుషులు మాత్రం పూజలు , శుభకార్యాల సమయంలో బొట్టు ధరించడం మన సంస్కృతిలో భాగంగా వస్తుంది. అయితే, చాలామంది దీన్ని కేవలం ఒక సంప్రదాయంగానో లేక ఫేస్‌కు అందాన్నిచ్చే అలంకారంగానో మాత్రమే చూస్తుంటారు.
కానీ ఈ అలవాటు వెనుక ఒక అద్భుతమైన ఆయుర్వేద, యోగ , శాస్త్రీయ రహస్యం ఉందని చాలామందికి తెలీదు. ముఖ్యంగా మనిషి శరీరంలోని రెండు అత్యంత ముఖ్యమైన శక్తి కేంద్రాలైన ఆజ్ఞా చక్రం, బ్రహ్మరంధ్రంల(Ajna Chakra vs Brahmarandhra) మధ్య ఉన్న తేడా అలాగే వాటి ప్రాధాన్యత గురించి కనీస అవగాహన కూడా ఉండదు. ఇది తెలుసుకుంటే బొట్టు పెట్టడం వెనుక అందమే కాదు ఆరోగ్యం కూడా ఉందన్న విషయం అర్ధం అవుతుంది.
రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకునే బొట్టు స్థానాన్ని యోగశాస్త్రంలో ఆజ్ఞా చక్రం లేదా థర్డ్ ఐ (మూడో కన్ను) అని పిలుస్తారు. బాడీలో జ్ఞానానికి, ఆలోచనలకు ఇది మెయిన్ కేంద్రం. సైంటిఫిక్‌గా చెప్పాలంటే ఈ ప్లేస్ వెనుకే మన నిద్రను, మూడ్‌ను, ఏకాగ్రతను కంట్రోల్ చేసే పీనియల్ గ్రంథి ఉంటుంది.
ప్రతిరోజూ ఇక్కడ వేలితో తాకుతూ బొట్టు పెట్టడం వల్ల,అక్కడ బొట్టు ఉండటం వల్ల జరిగే తేలికైన ప్రెషర్ వల్ల ఆ భాగంలో రక్తప్రసరణ వేగవంతమై మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. కుంకుమలో ఉండే పసుపు, సున్నం బాడీలోని ఎక్కువ వేడిని తగ్గించి మానసిక ఒత్తిడిని, కోపాన్ని అదుపులో ఉంచుతాయి.
అంతేకాకుండా, ఇక్కడి నరాలకు కళ్లతో కనెక్షన్ ఉండటం వల్ల కళ్ల అలసట, మైగ్రేన్ తలనొప్పులు తగ్గుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా అత్యంత సెన్సిటివ్ అయిన ఈ చక్రం వద్ద బొట్టు పెట్టడం వల్ల చుట్టూ ఉండే ప్రతికూల శక్తులు (నెగెటివ్ వైబ్స్) బాడీలోకి ప్రవేశించకుండా ఒక రక్షణ కవచంలా పని చేస్తుందని శాస్త్రాలు చెబుతాయి.
ప్రాచీన కాలంలో పసుపు, సున్నం, కొద్దిగా నిమ్మరసం కలిపి కుంకుమను తయారుచేసేవారు. పసుపులోని యాంటీసెప్టిక్ గుణాలు స్కిన్ డిసీజెస్ రాకుండా చూస్తే, సున్నం బాడీలోని వేడిని లాగేసి చల్లదనాన్ని ఇస్తుందని పూర్వీకులు చెప్పేవారు. అయితే అప్పటి కుంకుమ ఒక నేచురల్ మెడిసిన్‌లా పని చేసేది. కానీ ఇప్పుడున్న కెమికల్ కుంకుమల వల్ల అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, ఆర్గానిక్ కుంకుమను మాత్రమే వాడాలి.
ఇక రెండోది బ్రహ్మరంధ్రం. చాలామందికి ఆజ్ఞా చక్రానికి, బ్రహ్మరంధ్రానికి(Ajna Chakra vs Brahmarandhra) తేడా సరిగ్గా తెలీదు. ఆజ్ఞా చక్రం నుదుటిపై బొట్టు పెట్టుకునే స్థానంలో ఉంటే, బ్రహ్మరంధ్రం అనేది తల పైభాగంలో అంటే నడుమడి అంటే జుట్టు సుడి తిరిగే చోట ఉంటుంది. యోగాలో దీనినే సహస్రార చక్రం లేదా క్రౌన్ చక్రం అంటారు.
ఇది విశ్వంలో ఉన్న శక్తిని మనిషి బాడీలోకి గ్రహించే మెయిన్ ఎంట్రన్స్‌గా చెబుతారు . పూజలు, యజ్ఞాలు చేసే సమయంలో పురుషులు ఈ ప్రాంతంలో కుంకుమ లేదా చందనం పెట్టుకుంటారు.
అంతేకాదు ఈ బ్రహ్మరంధ్రం ఉండే ప్రాంతాన్ని కుడిచేతి మధ్యవేలితో క్లాక్‌వైజ్ , యాంటీ-క్లాక్‌వైజ్ దిశలో రోజూ తేలికగా పదిసార్లు తిప్పుతూ మసాజ్ చేయడం వల్ల నరాల వ్యవస్థ రిలాక్స్ అయి ఇన్సోమ్నియా, యాంగ్జైటీ వంటి సమస్యలు చిటికెలో మాయమవుతాయి. ఆధ్యాత్మికంగా డీప్ మెడిటేషన్‌లోకి వెళ్లడానికి ఈ పాయింట్ అద్భుతంగా తోడ్పడుతుందని అంటారు.
మొత్తంగా చూస్తే నుదుటిపై పెట్టే బొట్టు మనిషి ఆజ్ఞా చక్రాన్ని ఉత్తేజపరిచి ఏకాగ్రతను, ప్రశాంతతను ఇస్తే.. తలపైన ఉండే బ్రహ్మరంధ్రం వద్ద పెట్టుకునే బొట్టు మనిషి సహస్రార చక్రాన్ని మేల్కొలిపి విశ్వశక్తిని, ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది.
Cortisol : అర్థరాత్రులు మెలకువ వస్తుందా? మీ బాడీని శాసిస్తున్న ఆ ఒక్క హార్మోన్ సీక్రెట్ అదే..
