Happiness
లగ్జరీ లైఫ్ తాలూకు విందు భోజనం కళ్ల ముందే ఉన్నా.. మనసు మాత్రం ఏదో తెలీని ఆకలితో అలమటిస్తోంది. అరచేతిలోనే ప్రపంచాన్ని ఇముడ్చుకున్నా.. గుండెల్లో మాత్రం ఒంటరితనం ఘోషిస్తోంది. విజ్ఞానం పెరిగింది అలాగే విలాసాలు పెరిగాయి. పల్లెటూళ్లలోనూ నింగిని తాకే భవనాలు వెలిశాయి.
కానీ, వాటన్నింటికీ మూలమైన శాంతి అనే పునాది మాత్రం కళ్ల ముందు నుంచి కదిలిపోయింది. ముఖంపై ఆర్టిఫిషియల్ నవ్వులను(Happiness )అతికించుకుని తిరుగుతున్న వారిని ఎవరినీ కదిలించినా వారి నోటి నుంచి శూన్యం తప్ప వేరే ఏదీ వినిపించడం లేదు. ఎంత సంపాదించినా తీరని వెలితి, ఎంత ఎదిగినా దొరకని తృప్తి. అసలు మనిషికి నిజంగానే ఆనందం దూరం అయిపోతోందా? లేక తన ముందే ఉన్న సంతోషాన్ని కూడా ఆస్వాదించలేనంతగా మనిషి అంతరాత్మ మొద్దుబారిపోయిందా అన్న ప్రశ్న అంతుచిక్కని విధంగా మారిపోయింది.
నిజానికి మనం ఆనందాన్ని(Happiness )ఒక గోల్‌లా మార్చేశాం.. అక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది. ఈ పొజిషన్‌కు వెళ్తేనే హ్యాపీగా ఉన్నట్లు.. అలాంటి ఇల్లు కొంటేనే లైఫ్ సెటిల్ అయినట్టు అంటూ కొన్ని కొన్ని లక్ష్యాలను టార్గెట్ చేసుకుని మన సంతోషానికి మనమే కండిషన్స్ పెడుతున్నాం.
దాంతో ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా విపరీతమైన స్ట్రెస్, యాంగ్జైటీతో టెన్షన్ టెన్షన్‌గా బతుకుతున్నాం. తీరా అంత కష్టపడి అది సాధించాక సంతోషంగా ఉంటున్నామా అంటే అదీ లేదు. నిజానికి సైకాలజీలో హెడోనిక్ అడాప్టేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం మన బ్రెయిన్ ఆ సక్సెస్‌కు కానీ కొత్త వస్తువుకు కానీ చాలా స్పీడ్‌గా అలవాటు పడిపోతుంది.
తాను ప్రాణంగా ఇష్టపడిన వ్యక్తి తన సొంతం అయినపుడో, డ్రీమ్ హౌస్‌ను దక్కించుకున్నప్పుడో , అలాగే కాస్ట్‌లీ ఫోన్ కొన్నపుడో.. ఆ మనిషిలో మొదటి రోజు ఉన్న కిక్ వారం, పది రోజుల తర్వాత అస్సలు ఉండదు. మనిషి మైండ్ మళ్లీ ఇంకో పెద్ద టార్గెట్ కోసం పరుగులు మొదలుపెడుతుంది. ఈ ప్రాసెస్‌లోనే మనిషి ఎప్పుడూ కూడా ఫ్యూచర్‌లోనే బతుకుతున్నాడు తప్ప, చేతిలో ఉన్న ప్రెజెంట్‌ని మాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నాడు.
నిజానికి సంతోషం అనేది ఒక మిరాకిల్ వంటి పెద్ద ఈవెంట్ ఏమీ కాదు. సంతోషం మన డైలీ లైఫ్‌లో చాలా చిన్న విషయాల్లో ఒక మైక్రో-డోస్ లా దాగి ఉంటుంది. పొద్దున్న తాగే ఒక కప్పు వేడి కాఫీ నుంచి మనసుకు నచ్చిన ఒక మంచి సాంగ్, ఆకలిగా ఉన్నప్పుడు తినే టేస్టీ ఫుడ్, క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి కాసేపు నవ్వుకోవడం ఇలా ఇవన్నీ కూడా సంతోషాన్ని ఇచ్చేవే.
కానీ ఇప్పుడు జనాల ఫోకస్ అంతా ఇతరుల లైఫ్ పైనే ఉంది. సోషల్ మీడియా స్క్రీన్లపై పక్కవాడి లైఫ్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తుండటంతో, తన లైఫ్‌లోని చిన్న చిన్న ఆనందాలు చాలా తేలికగా, తక్కువగా కనిపిస్తున్నాయి. మనకు సంతోషించడం తెలీదు అనడం కంటే. పక్కవాడితో కంపేర్ చేసుకుని మన సంతోషాన్ని మనమే తక్కువ చేసి చూసుకుంటున్నామనేదే వంద శాతం కరెక్ట్.
కళ్ల ముందున్న ఆనందం మనసులో కూడా కలగాలంటే ముందు గ్రాటిట్యూడ్ అనే చిన్న లాజిక్‌ను మనం మర్చిపోకూడదు. మన దగ్గర లేనిది ఏంటి అని వెతకడం ఆపేసి, మన దగ్గర ఉన్న బెస్ట్ థింగ్స్ ఏంటని గుర్తించడం మొదలుపెడితేనే మన సంతోషం మనకు కనిపిస్తుంది.
లైఫ్‌ను ఎప్పుడూ కూడా ఒక కాంపిటీషన్‌లా కాకుండా, ఒక అందమైన ప్రయాణంలా చూడాలి. కాసేపు పరిగెత్తడం ఆపి, మన చుట్టూ ఉన్న నేచర్‌ను, మనుషులను అబ్జర్వ్ చేయాలి. ఆనందమనేది బయట దొరికే వస్తువు కాదు.. అది మన లోపల మనం క్రియేట్ చేసుకునే ఒక ఫీలింగ్ అని మనమంతా ఎప్పుడు రియలైజ్ అవుతామో..అప్పుడే లైఫ్ ప్రశాంతంగా, ఆనందంగా(Happiness )మారుతుంది.
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ప్రయోగం ఫ్లాప్.. మ్యూజ్ ఇమేజ్ టూల్ క్లోజ్
