Bloating On The Flight : ఫ్లైట్ ఎక్కగానే పొట్ట ఉబ్బుతోందా? జర్నీలో కడుపు తేలికగా ఉండాలంటే ఇవి ఫాలో అవ్వండి..

Bloating On The Flight : జర్నీకి ముందు లైట్‌గా తిన్నా కూడా కడుపు ఉబ్బరం సమస్య సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి ఇబ్బంది పెడుతుంది.

Bloating On The Flight

కొంతమందికి ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే పొట్టంతా భారంగా, కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. జర్నీకి ముందు లైట్‌గా తిన్నా కూడా ఈ ప్రాబ్లెమ్ సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి ఇబ్బంది పెడుతుంది. అసలేమీ తిననప్పుడు కూడా ఫ్లైట్‌లో పొట్ట ఎందుకింత హెవీగా అనిపిస్తుందనే(Bloating On The Flight) డౌట్ వారిలో వస్తుంటుంది. అయితే ఈ విచిత్రమైన సమస్యకు అసలు కారణం వారు తిన్న తిండి కాదని.. విమానం కేబిన్ ప్రెజర్‌లో వచ్చే మార్పులేనని డాక్టర్లు చెబుతున్నారు.

మనం ప్రశాంతంగా ఉన్నా కూడా మన జీర్ణవ్యవస్థలో ఎప్పుడూ కూడా కొంత గ్యాస్ దాగి ఉంటుంది. మనం ఫ్లైట్‌లో ఆకాశంలోకి వెళ్తున్నప్పుడు చుట్టూ ఉండే గాలి పీడనం స్పీడ్‌గా తగ్గుతుంది. సైన్స్ సూత్రం ప్రకారం చూస్తే.. అలా చుట్టూ ఉన్న పీడనం తగ్గినప్పుడు, పొట్టలో దాగి ఉన్న గ్యాస్ వ్యాకోచించి (Expand) ఎక్కువ స్పేస్‌ను ఆక్రమించడం స్టార్ట్ చేస్తుంది. అందుకే ఫ్లైట్‌లో ఏమీ తినకపోయినా, లైట్‌గా తిన్నా కూడా కడుపు ఉబ్బరంగా మారడం, కొంచెం వికారంగా అనిపించడం, గ్యాస్ రిలీజ్ చేయాలనే ఫీలింగ్ రావడం జరుగుతుంది.

దీనికి తోడు విమానం ఎక్కేటప్పుడు ..కలిగే కంగారులో ఫుడ్ వేగంగా తినడం గాలి కూడా కడుపులోకి వెళ్లిపోతుంది. అలాగే స్ట్రాతో కూల్ డ్రింక్స్ తాగడం, చూయింగ్ గమ్ నమలడం వంటివి ఈ సమస్యను ఇంకాస్త పెంచుతాయి. పైగా విమానంలో ఒకేచోట కదలకుండా అలా కూర్చోవడం వల్ల ప్రేగుల మూవ్‌మెంట్ తగ్గడంతో.. ఆ గ్యాస్ బయటకు పోలేక పొట్టంతా టైట్‌గా మారిపోతుంది.

Bloating On The Flight

అందుకే దీనికి చెక్ పెట్టాలంటే ఫ్లైట్ జర్నీకి ముందు ఉల్లిపాయలు, శనగలు, పప్పులు, ఆల్కహాల్, మిల్క్ ప్రొడెక్ట్స్ తినకుండా ఉంటేనే మంచిది. జర్నీకి ముందు లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఫ్లైట్‌లో సోడాలు, ఆల్కహాల్‌కు దూరంగా ఉంటూ, మంచి నీళ్లు బాగా తాగాలి. ఫుడ్ తిన్నప్పుడు కంగారు పడకుండా నిదానంగా నమిలి తినాలి. లాంగ్ జర్నీలు చేస్తున్నపుడు కుదిరినప్పుడు సీటు నుంచి లేచి కాసేపు అటు ఇటు కాస్తీ నడిస్తే గ్యాస్ ఈజీగా రిలీజ్ అయిపోయి కడుపు తేలికపడుతుంది.

Ego In Relationship : బంధంలో ఈగో అడ్డుగోడ వేస్తోందా? స్పందన లేని భాగస్వామితో ముందడుగు వేయొచ్చా?

Exit mobile version