Chanakya Niti
జీవితంలో విజయం సాధించాలన్నా, సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలన్నా కొన్ని లక్షణాలు ఉండాలి. వాటిలో మొదటిది వినయం. అంటే పెద్దలను గౌరవించడం, అందరితో మర్యాదగా ప్రవర్తించడం మన సంస్కారంగా మసలుకోవాలి.
అయితే ఇక్కడే వినయానికి, అతి వినయానికి మధ్య తేడాను తెలుసుకోవాలి. వీటి రెండింటి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. ఆ గీత దాటితే వచ్చే నష్టాలెలా ఉంటాయో ఆచార్య చాణక్యుడు తన నీతి(Chanakya Niti) శాస్త్రంలో చాలా క్లియర్‌గా వివరించారు.
మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత సంపద ఉన్నా అహంకారం చూపించకుండా ఇతరులను గౌరవించడమే వినయం. నిజమైన వినయమనేది ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని, సంస్కారాన్ని చూపిస్తుంది.
వినయం ఉన్నవాడు ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవిస్తాడు. తన తప్పులను నిజాయితీగా ఒప్పుకుంటాడు. ఇది మనిషి తాలూకా వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. సొసైటీలో వారికి రెస్పెక్ట్ తెచ్చిపెడుతుంది. అందుకే వినయాన్ని ఒక గొప్ప ఆభరణంగా చెప్తారు.
కానీ అతి వినయమనేది పూర్తిగా వేరు. ఆచార్య చాణక్యుని నీతి(Chanakya Niti) ప్రకారం..అవసరం లేకపోయినా ఇతరుల ముందు ఎక్కువగా వినయాన్ని చూపించడం, వారి స్వార్థం కోసమో, ఏదో లాభం ఆశించో అవతలి వారిని ప్రసన్నం చేసుకోవడానికి అతిగా నటించడాన్ని అతి వినయం అంటారు. అందుకే మన పెద్దలు అతి వినయం ధూర్త లక్షణం అన్నారు.
అంటే ఎదుటివారిని మోసగించే బుద్ధి ఉన్నవాడు, లోపల ద్వేషం, అసూయ పెట్టుకుని పైకి అమాయకుడిగా నటిస్తాడని అర్థం. అతివినయం చూపే వ్యక్తిలో ఆత్మవిశ్వాసం ఉండదు. వీళ్లు అవతలి వారి మెప్పు కోసమే వంగి వంగి దండాలు పెడుతుంటారు. దీనివల్ల వారి సొంత గుర్తింపు దెబ్బతింటుందన్న విషయాన్ని తెలుసుకోలేరు.
చాణక్యుడు ఎప్పుడూ ప్రాక్టికల్‌గా ఆలోచించమని, సొసైటీలో బ్రతకడానికి వినయం ఎంత ముఖ్యమో, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని చెబుతాడు.
ఎక్కడైనా స్ట్రెయిట్‌గా, నిటారుగా ఉన్న చెట్లను మొదట నరుకుతారు కానీ వంకరగా ఉన్న చెట్లను అలాగే వదిలేస్తారని చాణక్యుడు తన నీతిలో(Chanakya Niti) ఒక చక్కని ఉదాహరణ ఇస్తాడు. అంటే సమాజంలో మరీ అమాయకంగా, అతివినయంగా ఉంటే లోకం మనల్ని తొక్కేయడానికి చూస్తుందని దాని అర్ధం.
చాణక్యుడు చెబుతున్నదాని ప్రకారం, ఎవరైనా ఒక వ్యక్తి మీతో అవసరానికి మించి వినయాన్ని ప్రదర్శిస్తున్నాడంటే.. దాని వెనుక ఏదో ఒక స్వార్థం లేదా మిమ్మల్ని మోసం చేసే ప్లాన్ ఉందని గ్రహించాలి.
పాము పడగ విప్పకపోయినా, అది కాటు వేయగలదనే భయం ఎప్పుడూ కూడా శత్రువుకు ఉండాలి. అలాగే మనం మంచి వాళ్లమే కావచ్చు, కానీ మన వినయం అవతలి వాళ్లకు ఎప్పుడూ బలహీనతగా మారకూడదు.
ఎక్కడ వంగాలో, ఎక్కడ నిలబడాలో తెలిసిన వాళ్లే సమాజంలో రాణించగలరు. కాబట్టి ఆత్మగౌరవంతో కూడిన వినయం మనిషికి అందాన్ని ఇస్తే, స్వార్థంతో కూడిన అతివినయం మనిషి పతనానికి దారితీస్తుంది.
Obesity : తల్లుల నుంచే కూతుర్లకు ఒబెసిటీ..జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ షాకింగ్ రిపోర్ట్
