Obesity : తల్లుల నుంచే కూతుర్లకు ఒబెసిటీ..జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ షాకింగ్ రిపోర్ట్
Obesity : ఒబెసిటీ అనేది తల్లుల నుంచి కేవలం వారి కూతుర్లలో మాత్రమే ఎక్కువ కనిపించిందని..ఇది కొడుకులపై పెద్దగా ప్రభావం పడలేదని ఒక అంతర్జాతీయ పరిశోధనలో తాజాగా తేలింది
Obesity
సాధారణంగా వెయిట్ పెరగడానికి , ఒబెసిటీ బారిన పడటానికి కేవలం మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్‌స్టైల్ లేదా జెనెటిక్ ప్రాబ్లమ్స్ మాత్రమే మెయిన్ రీజన్స్ అని అంతా అనుకుంటూ ఉంటాం. కానీ ఈ విషయంలో మెడికల్ హిస్టరీలోనే ఒక సరికొత్త , మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ నిజం బయటపడింది .
ఒబెసిటీ(Obesity )అనేది తల్లుల నుంచి కేవలం వారి కూతుర్లలో మాత్రమే ఎక్కువ కనిపించిందని..ఇది కొడుకులపై పెద్దగా ప్రభావం పడలేదని ఒక అంతర్జాతీయ పరిశోధనలో తాజాగా తేలింది. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ & మెటబాలిజం అనే ఫేమస్ మెడికల్ మ్యాగజైన్‌లో పబ్లిష్ అయిన ఒక అధ్యయనంలో ఈ విచిత్రమైన విషయాలు వెల్లడయ్యాయి .
ప్రస్తుత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చిన్నా లేదు పెద్దా లేదు అన్నట్లుగా ఒబెసిటీ(Obesity) సమస్య విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో, ఈ కొత్త రీసెర్చ్ రిపోర్ట్ వైద్య రంగంలో సరికొత్త చర్చకు దారితీసింది.
ముఖ్యంగా సూపర్ పవర్ దేశమైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూసుకుంటే.. అక్కడ ఉన్న పెద్దవారిలో సగానికి సగం మంది అలాగే చిన్న పిల్లల్లో సుమారు 20 శాతం మంది ఈ ఊబకాయం సమస్యతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు.
ఇలాంటి టైమ్‌లో వచ్చిన ఈ ఆక్స్‌ఫర్డ్ లెవెల్ రీసెర్చ్ ఊబకాయంపై ఒక సరికొత్త కోణాన్ని ప్రపంచం ముందుకు తీసుకువచ్చి నయా చర్చకు దారి తీసేలా చేసింది.
మెడికల్ ఎక్స్‌పర్ట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మ కనుక ఊబకాయంతో బాధపడుతుంటే, ఆమె కడుపున పుట్టే ఆడపిల్లలకు కూడా భవిష్యత్తులో అదే బాడీ మాస్ ఇండెక్స్ (BMI) వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట. కానీ విచిత్రంగా అదే అమ్మకు పుట్టే మగపిల్లల్లో మాత్రం ఈ ఒబెసిటీ ఫ్యాక్టర్ చాలా అంటే చాలా తక్కువగా కనిపించిందని ఈ రీసెర్చ్ స్పష్టం చేస్తోంది.

తల్లీకూతుళ్ల మధ్య ఉండే ఈ శారీరక, హార్మోన్ల ప్రభావం అబ్బాయిలపై చూపించకపోవడం అనేది సైంటిస్టులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఈ అధ్యయనం వల్ల రాబోయే రోజుల్లో ఆడపిల్లల్లో వచ్చే ఊబకాయం సమస్యకు మంచి ట్రీట్మెంట్ చేయడానికి వీలుగా మారిందని నిపుణులు భావిస్తున్నారు.
తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితులు, గర్భధారణ సమయంలో ఉన్న మెటబాలిక్ ప్రభావాలు, కుటుంబ జీవనశైలి కలిసి అమ్మాయిలపై ఎక్కువ ప్రభావం చూపినట్టు తెలుస్తుందని నిపుణులు అంటున్నారు.
Ind VS Afg : ఆరంభం అదరాలి.. ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తొలి వన్డే




