Anatomy
ఈ రోజుల్లో ప్రేమలో పడటం ఎంత ఈజీగా ఉందో.. ఆ తర్వాత ఆ బంధాన్ని నిలబెట్టుకోవడమే అంతకంటే కష్టంగా మారిపోతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, డేటింగ్ యాప్స్ కాలంలో రిలేషన్స్ చాలా త్వరగా బ్రేక్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే యూత్ మధ్య అనాటమీ(Anatomy) ఆఫ్ ఎ రిలేషన్‌షిప్ అనే టాపిక్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
సాధారణంగా మెడికల్ లాంగ్వేజ్‌లో అనాటమీ(Anatomy) అంటే మనిషి శరీర భాగాల నిర్మాణం, వాటి పనితీరును విడదీసి చదవడం అన్నమాట. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం, ఒక లవ్ ట్రాక్‌లో , పెళ్లి బంధంలో భాగస్వాముల మధ్య ఉండే నమ్మకం, స్వార్థం, ఈగో, కమ్యూనికేషన్ వంటి అంశాలను విడివిడిగా స్కానింగ్ చేసి చూడటాన్ని ఇలా పిలుస్తున్నారు. బంధం పైకి ఎలా ఉన్నా, లోపల ఎలాంటి ఎమోషన్స్‌తో బిల్డ్ అయిందో తెలుసుకోవడానికి దీనిని వాడుతున్నారు.
ఈ సరికొత్త ట్రెండ్ యూత్ మధ్య ఇంతగా ఫేమస్ అవడానికి కారణం వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌లో వచ్చే కన్ఫ్యూజన్లే. ఒకప్పుడు గొడవలు వస్తే సర్దుకుని పోయేవారు, కానీ ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్‌లో ఈగోలు, అనుమానాలు, అపనమ్మకాలు ఎక్కువై పోయాయి.
పార్టనర్ తనతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు, తమ మధ్య ఉన్నది నిజమైన ప్రేమేనా లేక కేవలం ఆకర్షణా అని తెలుసుకోవడానికి ఈ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. రిలేషన్ యొక్క అనాటమీని స్టడీ చేయడమంటే పార్ట్‌నర్ యొక్క ప్లస్ పాయింట్లను, మైనస్ పాయింట్లను, వారి ప్రవర్తనా తీరును పూర్తిగా పోస్టుమార్టం చేసి ఒక క్లారిటీకి రావడం అన్నమాట. దీనివల్ల తమ ఇద్దరి మధ్య ఉన్న బంధంలో ఎక్కడ లోపం ఉందో ఈజీగా తెలిసిపోతుందనేది నేటి జనరేషన్ నమ్మకం.
ఈ రకమైన ఓవర్ అనాలిసిస్ లేదా విశ్లేషణ సొసైటీకి, బంధాలకు మంచిదేనా అంటే దీనికి రెండు జవాబులు ఉన్నాయి. ఒక రకంగా చూస్తే ఈ అనాటమీ స్టడీ చాలా మంచిది. ఎందుకంటే గుడ్డిగా ప్రేమించి మోసపోవడం కానీ ఒక టాక్సిక్ రిలేషన్‌లో ఉండి నలిగిపోవడం కానీ చేయకుండా అసలు తామిద్దరి మధ్య ఉన్న బంధంలో ఏం జరుగుతుందో ముందే గ్రహించి జాగ్రత్త పడటానికి ఇది హెల్ప్ అవుతుంది.
పార్ట్‌నర్ యొక్క ప్రవర్తనను కరెక్టుగా అర్థం చేసుకుని, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటే సరిదిద్దుకోవడానికి ఈ అనాటమీ అనాలసిస్ ఉపయోగపడుతుంది. దీనివల్ల అనవసరమైన గొడవలు తగ్గి బంధం మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది.
అయితే దీనిని మరో కోణంలో చూస్తే, ప్రేమ అనేది ఎమోషన్స్ మీద నడిచేది మాత్రమే..ఇది లాజిక్స్ మీద నడిచేది కాదు. బంధాన్ని మరీ ఎక్కువగా ముక్కలు ముక్కలుగా చేసి చూస్తే ఆ రిలేషన్‌లోని ఫీలింగ్స్ చచ్చిపోయే ప్రమాదం ఉంది.
పార్ట్‌నర్ చేసే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ, తన భాగస్వామి చేసే ప్రతి పని వెనుక కూడా ఏదో స్వార్థం ఉందని అనుమానిస్తే ఆ బంధాలు నిలవడం కష్టం. అతిగా వారిని చదవడానికి ట్రై చేయడం వల్ల నమ్మకం తగ్గిపోయి, పార్ట్‌నర్స్ మధ్య ఒకరినొకరు టెస్ట్ చేసుకునే మెంటాలిటీ పెరిగిపోతుంది. ఇది లాంగ్ రన్‌లో వారిద్దరి మధ్య రిలేషన్‌ను మరింత బలహీనపరుస్తుంది.
మొత్తంగా ఒక రిలేషన్ హెల్దీగా సాగాలంటే అవతలి వ్యక్తి మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం. అయితే ఆ బంధాన్ని ఒక ల్యాబరేటరీలోని ప్రయోగంలా మార్చేసి, ఎప్పుడూ అందులోని లోపాలను వెతకడం కరెక్ట్ కాదు.
లిమిట్స్‌లో ఉన్నంతవరకు కూడా ఈ అనాటమీ(Anatomy) అనాలిసిస్ పార్ట్‌నర్స్ మధ్య బాండింగ్‌ను బాగానే పెంచుతుంది. కానీ గీత దాటితే మాత్రం అనుమానాలకు దారి తీసేలా చేస్తుంది. కాబట్టి బంధంలో లాజిక్స్ వెతకడం కంటే ఆ రిలేషన్‌లో ఉన్న మ్యాజిక్‌కు, నమ్మకానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే అది ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.
Samsung Galaxy Z Flip 8 : ట్రెండీ లుక్‌తో అదుర్స్..మార్కెట్‌లో క్రేజీగా శాంసంగ్ ఫ్లిప్ ఫోన్లు
