Boredom
మనలో చాలామంది ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండటానికి ఇష్టపడరు. మరికొంతమంది అయితే ఆఫీస్ పని ముగిసినా, బస్సు కోసం వేచి చూస్తున్నా, చివరికి భోజనం చేస్తున్నా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. వాట్సాప్ మెసేజ్‌లు, ఇన్‌స్టా రీల్స్, వర్క్ ఈమెయిల్స్.. ఇలా ఒకదాని నుంచి మరొకదానికి కంటిన్యూగా షిఫ్ట్ అవ్వడం వల్ల బ్రెయిన్.. ఫుల్ ప్రెజర్‌కు గురవుతోందని సైకాలజిస్టులు వివరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల కొత్తగా ఆలోచించడానికి, గడిచిన రోజంతా ఏం జరిగిందో నెమరు వేసుకోవడానికి లేదంటే మనసును కూల్‌గా ఉంచడానికి కొంచెం కూడా టైమ్ దొరకడం లేదు.
చాలామంది బోర్ కొట్టడం, మెంటల్ ఫెటీగ్ రెండూ ఒకటే అని భావిస్తుంటారు. కానీ ఈ రెండింటికీ చాలా తేడా ఉందని సైకాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇంట్రస్టింగ్ పనులేవీ సరిపడా లేనప్పుడు లేదంటే వాతావరణం ఉత్సాహంగా లేనప్పుడు బోర్ కొడుతుంది. అదే సమయంలో ఎక్కువ కాలం ఒకే పనిపై ఫోకస్ చేయడం , మల్టీ టాస్కింగ్ చేయడం పదే పదే డిస్టర్బ్ అవ్వడం వల్ల వచ్చే దాన్ని మానసిక అలసట అంటారు. బోర్ కొట్టిన ప్రతిసారీ ఫోన్ చేతిలోకి తీసుకుంటే..అప్పటికే బాగా రెస్ట్ అవడంతో.. అది బ్రెయిన్‌ను మరింత అలసిపోయేలా చేస్తుంది తప్ప విశ్రాంతినివ్వదు.
మనం ఖాళీగా ఉన్నప్పుడు బ్రెయిన్ పని చేయడం ఆపేస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ సైకాలజిస్టులు చెబుతున్నదాని ప్రకారం.. మనం బయటి పనులపై దృష్టి పెట్టడం ఆపేసినంత మాత్రాన బ్రెయిన్ రెస్ట్ తీసుకోదు. ఆ టైమ్‌లో బ్రెయిన్‌లో డిఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్ అనే పవర్ ఫుల్ నెట్‌వర్క్ బాగా యాక్టివ్ అవుతుంది. ఇది మెమరీ పవర్‌ను పెంచడానికి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి , ఫ్యూచర్ గురించి సరైన నిర్ణయాలను తీసుకోవడానికి సహాయపడుతుంది. అంటే, మానసికంగా ఖాళీగా ఉన్నప్పుడే మెదడు కొత్త విషయాలను ప్రాసెస్ చేసి, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటుంది.
మెదడుకు రిలాక్సేషన్ ఇవ్వడం కోసం.. కొన్ని చిన్నచిన్న టెక్నిక్స్ పాటించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. క్యూలో నిలబడినప్పుడు లేదంటే ఒంటరిగా ఉన్నప్పుడు నోటిఫికేషన్లు వచ్చినపుడు వెంటనే చూడకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆఫీసులో ల్యాప్‌టాప్ స్క్రీన్ నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు వెంటనే ఫోన్ వైపు చూడకుండా, కొద్దిసేపు అటు ఇటు నడవడం అలవాటు చేసుకోవాలి.
మ్యూజిక్ లేదా పాడ్‌కాస్ట్‌లు వినకుండా ప్రశాంతమైన అట్మాస్పియర్‌లో వాకింగ్ చేస్తూ మైండ్‌ను ఫ్రీగా వదిలేయాలి. భోజనం చేసేటప్పుడు ఫోన్, టీవీ చూడకుండా, ఫుడ్‌ను ఆస్వాదిస్తూ తినాలి. నైట్ పడుకునే ముందు గంటల తరబడి రీల్స్ లేదా న్యూస్ స్క్రోల్ చేయడం ఆపేసి, మనసును ప్రశాంతంగా కూల్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.ఎప్పుడూ ఏదొక పనిలో నిమగ్నమై ఉండటమే ప్రొడక్టవిటీ అని అనుకోవడం పొరపాటని, మన బ్రెయిన్(Boredom)కు కూడా రోజువారీ అనుభవాలను అర్థం చేసుకోవడానికి తగినంత టైమ్ ఇవ్వాలని సైకాలజిస్టులు తేల్చి చెబుతున్నారు.
