Sugar
స్వీట్ తింటే వెయిట్ పెరిగిపోతాం, హెల్త్ పాడైపోతుందని చాలామంది తమ డైట్ నుంచి షుగర్‌ను పర్మినెంట్‌గా డిలీట్ చేసేస్తున్నారు. అయితే షుగర్‌ను కంప్లీట్‌గా మానేస్తే మన బాడీలో కొన్ని నెగిటివ్ విషయాలు జరుగుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇటీవల అమెరికాలోని చికాగోలో జరిగిన అంతర్జాతీయ సదస్సు ఎండో 2026 (ENDO 2026)లో సైంటిస్టులు ప్రజెంట్ చేసిన ఒక సెన్సేషన్ రీసెర్చ్ విస్తుపోయే నిజాలను వెలుగులోకి తీసుకువచ్చింది. మన ఫుడ్ నుంచి స్వీట్‌నెస్‌ను జీరో చేసేస్తే బాడీ దాన్ని ఒక పాజిటివ్ చేంజ్‌లా అస్సలు యాక్సెప్ట్ చేయదు. పైగా రివర్స్‌లో ఎదురు దాడి చేయడం మొదలుపెడుతుందట.
కువైట్‌కు చెందిన ఫేమస్ దాస్మాన్ డయాబెటిస్ ఇనిస్టిట్యూట్ రీసెర్చర్స్ ఈ సీక్రెట్‌ను ఛేదించడానికి ఎలుకలపై 16 వారాల పాటు ఒక క్రేజీ ప్రయోగాన్ని చేశారు. వాటిని 2 గ్రూపులుగా విభజించి, ఒక గ్రూప్‌కి ప్రతిరోజూ మనం తినేంత క్వాంటిటీలో పంచదార ఇస్తూ.. ఇంకో గ్రూప్‌కి మాత్రం కంప్లీట్‌గా షుగర్‌ను అవాయిడ్ చేస్తూ కఠినమైన డైట్ ఇచ్చారు. 16 వారాల తర్వాత వాటి బ్లడ్, లివర్, గట్ శాంపిల్స్‌ను పరీక్ష చేసి చూస్తే సైంటిస్టుల మైండ్ బ్లాక్ అయిపోయింది.
వేటికి అయితే పంచదార(Sugar)ను కంప్లీట్‌గా బంద్ చేశారో, ఆ గ్రూప్‌లోనే బ్లడ్ షుగర్ కంట్రోల్ తప్పినట్లు తేలింది. శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు తిన్న తిండిని అరిగించే మంచి బ్యాక్టీరియా వ్యవస్థ కడుపులో దారుణంగా పడిపోయింది. దీనికితోడు లివర్, పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్ కనిపించింది.
అంటే పంచదార(Sugar)ను జీరో చేయడం వల్ల బాడీ హెల్దీగా మారడానికి బదులు.. తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెటబాలిక్ సిస్టమ్‌ను డేంజర్ జోన్‌లోకి నెట్టేసిందని అర్థమైంది. అయితే ఈ ప్రయోగం ప్రస్తుతానికి ఎలుకల మీదే జరిగింది. మరి మనుషులపైన కూడా సేమ్ రియాక్షన్ ఉంటుందో లేదో తేలడానికి వారిపైన ఇంకొన్ని ప్రయోగాలు కావాలి.
దీంతో న్యూట్రిషన్ వరల్డ్‌లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఏ పదార్థాన్నైనా సరే కంప్లీట్‌గా మానేయడం లేదా దూరంగా ఉండటం కంటే.. సరిపడేంత మోతాదులో (Moderation) తీసుకోవడమే అసలైన లైఫ్‌స్టైల్ సీక్రెట్ అవుతుందని మెజార్జీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. షుగర్‌ను శత్రువులా చూడకుండా, లిమిట్‌గా తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఎనర్జీ, బ్యాలెన్స్ దక్కుతాయి. అందుకే కాబట్టి ఏదీ అతిగా వద్దు.. అలాగని పూర్తిగా మానొద్దనే పెద్దల సూత్రాన్ని ఫాలో అయిపోండి.
Appreciation : మనసులోని మెచ్చుకోలును దాచుకోకండి..ఎదుటివారిలో కాన్ఫిడెన్స్ నింపండి..
