Dating App : రూట్ మార్చిన ప్రేమికులు..డేటింగ్ యాప్ సర్వేలో షాకింగ్ నిజాలు

Dating App : డేటింగ్ యాప్స్‌లో అవతలివాళ్లను పడగొట్టేలా పంపే పెర్‌ఫెక్ట్ మెసేజ్‌లు, క్రేజీ బయోలు వారి సొంత తెలివితేటలు కాకపోవచ్చన్న మాట.

Dating App

ఇప్పటి జనరేషన్‌కు ప్రేమ పాఠాలు నేర్పించడానికి నయా లవ్ గురువు నెట్టింట్లోకి వచ్చేశాడు. ఐటీ ఆఫీసులు, కాలేజీ ప్రాజెక్ట్‌లను శాసిస్తున్న ఏఐ టూల్స్.. ఇప్పుడు మనుషుల మనసులలోకి, పర్సనల్ లవ్ మ్యాటర్స్‌లోకి ఎంటర్ అయిపోయాయి.

ఒకప్పుడు లవ్‌లో పడితే సలహాల కోసం ఫ్రెండ్స్ చుట్టూ తిరగడం, గూగుల్‌లో టిప్స్ వెతకడం చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఫేమస్ డేటింగ్ యాప్ గ్లీడెన్ అలాగే రీసెర్చ్ సంస్థ ఇప్సోస్ కలిసి నిర్వహించిన ఒక సర్వేలో క్రేజీ నిజాలు బయటపడ్డాయి.

భారతదేశంలో పార్ట్‌నర్స్‌ను మాటలతో బోల్తా కొట్టించడానికి, చాటింగ్‌లో బిల్డప్ ఇవ్వడానికి మెజారిటీ యూత్ తమ పక్కన ఒక ఏఐ వింగ్‌మ్యాన్‌ను పెట్టుకుని తెగ వాడేస్తున్నట్లు ఈ స్టడీ తేల్చేసింది.

ఈ ఇంట్రెస్టింగ్ సర్వే రిపోర్ట్స్ చూస్తే ఎవరికైనా మతులు పోవాల్సిందే. ఎందుకంటే ఏకంగా 63 శాతం మంది ఇండియన్స్ తమ లవ్ లైఫ్‌లో సలహాలు, సూచనల కోసం ఏఐని ఒక రోబోటిక్ కోచ్‌లా వాడేసుకుంటున్నారట.

అలాగే 66 శాతం మంది తమ డేటింగ్ ప్రొఫైల్స్ , సోషల్ మీడియా బయోలను అల్ట్రా స్టైలిష్‌గా మార్చుకోవడానికి కూడా దీనిపైనే డిపెండ్ అవుతున్నారు. అవతలి వారితో చాట్ చేసేటప్పుడు అప్పటికప్పుడు స్మార్ట్ రిప్లైలు ఇవ్వడానికి 61 శాతం మంది ఇండియన్స్ ఏఐ హెల్ప్‌ను తీసుకుంటున్నారు.

అంటే డేటింగ్ యాప్స్‌(Dating App)లో అవతలివాళ్లను పడగొట్టేలా పంపే పర్ఫెక్ట్ మెసేజ్‌లు, క్రేజీ బయోలు వారి సొంత తెలివితేటలు కాకపోవచ్చన్న మాట. ఎందుకంటే వాటి వెనుక ఏఐ మాయాజాలం ఉండే ఛాన్స్ పక్కాగా ఉంది.

గతంలో లవ్‌లో ఉంటే అవతలి వ్యక్తి మెసేజ్‌లకు ఏం రిప్లై ఇవ్వాలో తోచకపోతే బెస్ట్ ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి అడిగేవాళ్లు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ స్థానాన్ని ఏఐ భర్తీ చేసేసింది. అర్ధరాత్రి 2 గంటలకైనా సరే విసుగు లేకుండా రకరకాల ఐడియాలు ఇస్తుంది. పైగా హేళన చేయడం, తక్కువ చేసి మాట్లాడడం చేయదు.

అలాగే మన దగ్గర పెళ్లి, రిలేషన్స్ విషయంలో ఫ్యామిలీ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. పార్ట్‌నర్ ఎంపికలో ఎలాంటి తప్పులు జరగకూడదని ఏఐని నమ్ముకుంటున్నారు.

అయితే ఈ టెక్నాలజీ లవ్ ట్రెండ్ ఒక విచిత్రమైన ఒంటరితనానికి అంటే లోన్లీనెస్ పారడాక్స్‌కు దారితీస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టడీలో పాల్గొన్న వారిలో 92 శాతం మంది తాము పార్ట్‌నర్స్‌తో హ్యాపీగానే ఉన్నామని చెబుతున్నా.. వారిలో 57 శాతం మంది తాము ఒంటరితనంతో బాధపడుతున్నట్లు ఓపెన్‌గానే ఒప్పుకున్నారు.

Dating App

అయితే ఏఐ ఒక అద్భుతమైన మెసేజ్‌ను రాసివ్వగలదు కానీ, ఇద్దరి మధ్య ఉండే నేచురల్ కెమిస్ట్రీని, మనసు విప్పి మాట్లాడుకునే ప్యూర్ అనుభూతిని మాత్రం అస్సలు తీసుకురాలేదు.

అందుకే డిజిటల్ డేటింగ్ వరల్డ్‌లో ఏఐ ఎంతగా చొచ్చుకుపోతుందో, మనుషుల్లోని సహజత్వానికి కూడా అంతే డిమాండ్ పెరుగుతోంది.

అంతేకాదు 69 శాతం మంది తాము ఏఐతో చేసిన చాట్ హిస్టరీని వేరే ఎవరైనా చూస్తే చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీలవుతున్నట్లు కూడా చెప్పారు. అంటే ఏఐ దగ్గర అసలైన ఫేస్‌ను చూపిస్తున్న మనుషులు.. సొసైటీ లేదా డేటింగ్ యాప్స్(Dating App) ముందర మాత్రం అదే ఏఐ సాయంతో ఒక నకిలీ ముసుగు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Ram Charan Comments : రామ్‌చరణ్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్..రాజమౌళి,సుకుమార్‌ను అవమానించారంటూ రచ్చ

Exit mobile version