Decide On A Life Expectancy
మనం ఎన్నేళ్లు బతుకుతామనే ప్రశ్న ప్రతీ ఒక్కరి మైండ్‌లో ఏదొక సందర్భంలో మెదిలే ఉంటుంది. అయితే విచిత్రం ఏంటంటే.. మన బ్రెయిన్‌లో బలంగా అనుకునే ఆ మాటే.. మనం నిజంగా ఎంతకాలం బతుకుతామో చెప్పే ఒక సీక్రెట్ ఇండికేటర్‌లా వర్క్ చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
మనం ఎంత కాలం జీవించి ఉంటామని అనుకుంటున్నామో, సుమారు అంతకాలం లేదా అంతకంటే ఎక్కువే బతికే అవకాశం ఉందంటూ జపాన్‌లో వృద్ధులపై చేసిన ఒక లాంగ్ టర్మ్ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఈ సైకలాజికల్ అండ్ బయోలాజికల్ మిస్టరీకి సంబంధించి జపనీస్ సైంటిస్టులు తేల్చిన మైండ్ బ్లోయింగ్ విషయాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
జపాన్‌లోని ఫేమస్ యూనివర్సిటీ ఆఫ్ సుకుబా ఈ ఆసక్తికర రీసెర్చ్‌ను నిర్వహించారు. 1987లో స్టార్ట్ అయిన నేషనల్ సర్వే ఆఫ్ జపనీస్ ఎల్డర్లీ డేటాతో పాటు 2024 వరకు సేకరించిన ఇన్ఫర్మేషన్‌ను అనాలసిస్ చేస్తూ.. దాదాపు 2,000 మంది వృద్ధుల జీవితాలను ఏకంగా 28 సంవత్సరాల పాటు ట్రాక్ చేశారు.
దీనిలో పాల్గొన్న 2,054 మంది తమ జీవితకాలంపై వారు ఇచ్చిన అంచనాలతో పాటు మరణించిన తేదీలను అఫీషియల్ రికార్డులతో పోల్చి చూశారు. ఈ రీసెర్చ్‌లో పాల్గొన్న వారిలో ఇప్పటివరకు 1,514 మంది మరణించగా, ఈ డేటా అంతా (మెడ్‌ఆర్ఎక్స్ఐవి) medRxiv అనే ప్లాట్‌ఫామ్‌లో ప్రీప్రింట్‌గా అందరికీ అందుబాటులోకి వచ్చింది.
ఈ రీసెర్చ్ నుంచి బయటపడిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే.. తాము ఎక్కువ కాలం జీవిస్తామని(Decide On A Life Expectancy )పాజిటివ్‌గా భావించిన వ్యక్తులు, నిజంగానే వారు అనుకున్న కాలం జీవించినట్లు తేలింది. ఒక మనిషి ఏజ్, లింగం, హెల్త్ కండీషన్, ఫైనాన్సియల్ స్టేటస్ వంటి ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనా వేసిన తర్వాత ఈ కనెక్షన్ కూడా స్పష్టంగా కనిపించింది. అయితే దీనర్థం మనుషులు తమ డెత్ టైమ్‌ను పర్ఫెక్ట్‌గా ప్రెడిక్ట్ చేయగలరని మాత్రం కాదు.
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 59 శాతం మంది వరకూ తాము ఊహించిన వయసు కంటే కూడా ఎక్కువ కాలమే జీవించారు. ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలు, అలాగే బాగా చదువుకున్నవారు తాము అంచనా వేసుకున్న కాలం కంటే కూడా ఎక్కువగానే బతికినట్లు తేలింది.
అయితే హెల్త్ సమస్యలతో బాధపడుతున్న వారిలో మాత్రం ఈ ఛాన్స్ కాస్త తక్కువగా ఉంది. చాలామంది తమ వయస్సును అంచనా వేసేటప్పుడు 80 ఏళ్లను ఒక బెంచ్‌మార్క్‌గా ఎంచుకున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ ఆయుర్దాయం ఉన్న జపాన్‌లో 2024 లెక్కల ప్రకారం పురుషుల సగటు ఏజ్ 81.1 ఏళ్లు కాగా, మహిళలకు 87.1 ఏళ్లుగా ఉంది.
మనం ఎంతకాలం జీవిస్తామనే(Decide On A Life Expectancy )ఈ సైకలాజికల్ మైండ్ సెట్ కేవలం హెల్త్‌నే కాకుండా.. ఎప్పుడు రిటైర్ అవ్వాలి, ఎంత డబ్బు సేవింగ్స్ చేయాలి.. పెన్షన్ ప్లాన్స్ ఎలా డిజైన్ చేసుకోవాలనే ఫైనాన్షియల్ నిర్ణయాల పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అంటే మన ఆలోచనా ధోరణి స్ట్రాంగ్‌గా ఉంటే, ఏజ్ కూడా అంతే గ్యారంటీగా పొడిగించబడుతుందని అర్ధం చేసుకోవచ్చన్న మాట.
Weight Gain : వెయిట్ తగ్గడం ఓకే మళ్లీ పెరగడమే పెద్ద సమస్య.. కానీ ఆ తప్పు మీది కాదు మీ బ్రెయిన్‌ది..
