Just LifestyleLatest News

Weight Gain : వెయిట్ తగ్గడం ఓకే మళ్లీ పెరగడమే పెద్ద సమస్య.. కానీ ఆ తప్పు మీది కాదు మీ బ్రెయిన్‌ది..

Weight Gain : వెయిట్ తగ్గిన తర్వాత కొంతకాలం పాటు ఆకలి బాగా పెరగడం, మళ్లీ పాత వెయిట్‌కు చేరుకోవడం కనిపించింది.

Weight Gain

కష్టపడి డైట్లు చేసి, జిమ్‌లో చెమటలు కక్కి కిలోలకు కిలోలు వెయిట్ తగ్గుతాము. కానీ కొద్ది రోజులయ్యాక చూస్తే తగ్గిన దాని కంటే వేగంగా వెయిట్ మళ్లీ పెరిగిపోతుంది. ఇలా జరగగానే నాలో క్రమశిక్షణ లేకపోవడం వల్లే, నా విల్‌పవర్ వీక్ కాబట్టే వెయిట్ పెరిగిపోయానని మనల్ని మనం నిందించేసుకుంటాం.

అయితే అసలు ప్రాబ్లమ్ మన విల్‌పవర్‌లో లేదని.. మన బ్రెయిన్ ప్లే చేసే సీక్రెట్ మైండ్ గేమ్‌లో ఉందంటున్నారు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం.. డైటింగ్ ముగిసాక వెయిట్ పెరగడమనేది మన కంట్రోల్‌లో లేని బయోలాజికల్ మెకానిజం అని తేలింది.

మనం డైట్ చేసి కేలరీలను తగ్గించినప్పుడు, బ్రెయిన్ దానిని ఒక సర్వైవల్ క్రైసిస్‌గా అంటే అత్యవసర పరిస్థితిగా భావిస్తుంది. తర్వాత వెయిట్ తగ్గాక మన శరీరం తన శక్తిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెటబాలిజం స్పీడ్‌ను స్లో చేస్తుంది. దీంతో పాటు ఆకలిని పెంచే హార్మోన్లను యాక్టివేట్ చేసి, ఫుడ్ పట్ల మనసు అట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది.

2026 లో పబ్లిష్ అయిన అధ్యయనంలో ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లోనూ ఇదే తేలింది. వెయిట్ తగ్గిన తర్వాత కొంతకాలం పాటు వాటిలో ఆకలి బాగా పెరగడం, మళ్లీ పాత వెయిట్‌కు చేరుకోవడం కనిపించింది. స్టార్టింగ్‌లో ఎంత వెయిట్ ఉందో, బాడీ మళ్లీ అదే బరువును చేరుకోవడానికి ట్రై చేస్తుందని రీసెర్చర్స్ తేల్చారు.

ఇక్కడ మరో విచిత్రమైన పాయింట్ ఏంటంటే..బ్రెయిన్ మన పాత వెయిట్‌ను సెట్ పాయింట్‌గా గుర్తుపెట్టుకుంటుంది. ఒక వ్యక్తి ఎక్కువ బరువున్న కండీషన్ నుంచి సడన్‌గా సన్నబడితే, బ్రెయిన్ ఆ కొత్త సన్నబడిన బాడీని నార్మల్ అని ఒప్పుకోదు. పాత వెయిట్‌నే నార్మల్ అనుకుని, మళ్లీ ఆ స్థితికి ఎలా అయినా తీసుకెళ్లడానికి ఆకలి సంకేతాలను, ఫుడ్ క్రేవింగ్స్‌ను మైండ్‌లోకి పంపుతుంది. అందుకే ఇది కేవలం విల్ పవర్ లోపం కాదు. హార్మోన్లు, జెనెటిక్స్, బ్రెయిన్‌లోని న్యూరల్ సర్క్యూట్లు, మెటబాలిజం అన్నీ కలిపి ఆడే ఒక కాంప్లెక్స్ బయోలాజికల్ గేమ్ అని రీసెర్చర్స్ కనుగొన్నారు.

మరి ఈ రివర్స్ గేమ్‌ నుంచి మనిషి తప్పించుకుని ..పర్ఫెక్ట్ వెయిట్‌ను మెయింటెన్ చేయడం కోసం.. దానికి ఒకేసారి తిండి బంద్ చేసే క్రాష్ డైటింగ్ పద్ధతిని పక్కన పెట్టడమే ఏకైక మార్గం. సడన్ మార్పు కాకుండా మెల్లమెల్లగా మారే లైఫ్ స్టైలే దీనికి సొల్యూషన్.

Weight Gain
Weight Gain

దీని కోసం రోజూ బ్యాలెన్స్‌డ్‌ డైట్ తీసుకోవడం, కంటిన్యూటీ ఉండేలా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం, డైలీ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం, క్రేవింగ్స్ వచ్చినప్పుడు వాటిని మేనేజ్ చేసే పద్ధతులు నేర్చుకోవడం,వెయిట్ మీదే కాకుండా ఓవరాల్ హెల్త్ అండ్ ఎనర్జీ లెవెల్స్‌పై ఫోకస్ పెట్టడం చేయాలి. అలాగే సొంత ప్రయోగాలు చేయకుండా డాక్టర్లు, డైటీషియన్ల సలహా తీసుకోవాలి.

అలాగని ప్రతీ ఒక్కరిలో కూడా డైట్ తర్వాత బరువు పెరగడం గ్యారెంటీ అని కాదు..ఎందుకంటే ప్రతీ ఒక్కరి బాడీ టైప్ ఒకేలా ఉండదు. ఏజ్, జెనెటిక్ స్ట్రక్చర్, హార్మోన్ల సమతుల్యత, డైలీ హాబిట్స్ బట్టి రిజల్ట్స్ మారుతుంటాయి. కానీ వెయిట్ తగ్గడాన్ని ఒక నెలకు లేదా రెండు నెలలకు చేసే టెంపరరీ వర్క్‌గా చూడకుండా, లైఫ్ లాంగ్ ఫాలో అయ్యే హెల్దీ లైఫ్‌స్టైల్‌గా మార్చుకున్నప్పుడే బ్రెయిన్ ఆ కొత్త వెయిట్‌ను తన సెట్ పాయింట్‌గా యాక్సెప్ట్ చేస్తుంది.

Forgetfulness : వయసుతో పాటు మతిమరుపు పెరుగుతుందా? అల్జీమర్స్ కారణం కాకపోవచ్చంటున్న రీసెర్చ్‌లు..

Related Articles

Back to top button