Elders Silence : నాడు భీష్ముడి మౌనం కురువంశాన్ని ముంచింది.. నేడు పెద్దల మౌనం కుటుంబాలను కూల్చుతోంది..

Elders Silence : ద్రౌపదికి అన్యాయం జరుగుతున్నప్పుడు, అది తప్పు అని కౌరవులను నిలదీయాల్సిన ఆ పెద్దలందరూ తలదించుకుని మౌనంగా ఉండిపోయారు.

Elders Silence

మన కుటుంబ గొడవల్లోనూ లేదా బంధువుల మధ్య వచ్చే వివాదాల్లోనూ చిత్రమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అన్ని విషయాలు తెలిసిన పెద్దలు ఏది కరెక్టో ఏది రాంగో నిర్ణయం తీసుకునే జ్ఞానం ఉన్నవారు కూడా.. గొడవ జరుగుతున్నప్పుడు నోరు విప్పరు. మనకెందుకు వచ్చిన గొడవ అనో, మనం మాట్లాడి వేరొకరి దృష్టిలో ఎందుకు చెడ్డ అవ్వాలి అనో, మన మంచితనం ఎందుకు పాడు చేసుకోవాలనో  మౌనంగా ఉండిపోతారు.

తాత్కాలికంగా వారు తమ మంచితనాన్ని కాపాడుకున్నామని అనుకుంటారు. కానీ దీనివల్ల జరగాల్సిన న్యాయం జరగక, ఎలాంటి తప్పు చేయని అమాయకులు తీవ్రమైన మానసిక క్షోభకు, అన్యాయానికి గురవుతుంటారు.

దీనికి  అతిపెద్ద ఉదాహరణగా మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టాన్ని చెబుతారు. ఆరోజు కురుసభలో ధర్మశాస్త్రాలన్నీ వడబోసిన భీష్మ పితామహుడు, అస్త్రశస్త్రాల విద్యను నేర్పిన గురువు ద్రోణాచార్యుడు, ఆ సభకు అధిపతి అయిన ధృతరాష్ట్రుడు వంటి మహామహులంతా అక్కడే కూర్చుని ఉన్నారు.

కానీ  ద్రౌపదికి ఒక పక్క అన్యాయం జరుగుతున్నప్పుడు, అది తప్పు అని కౌరవులను నిలదీయాల్సిన ఆ పెద్దలందరూ తలదించుకుని మౌనంగా(Elders Silence) ఉండిపోయారు. ఆనాడు వారు తమ పదవులు, ప్రాణాలు లేదా రాజు దృష్టిలో తమకున్న స్థానాన్ని కాపాడుకోవడానికి వారంతా అప్పుడు ప్రదర్శించిన ఆ మౌనం.. తర్వాతి కాలంలో మహాభారత యుద్ధానికి దారితీసింది. ఆ ఒకే ఒక్క మౌనం వల్ల కౌరవ వంశం మొత్తం సర్వనాశనం అయింది.

సైకాలజీ (Psychology) చెబుతున్న దాని ప్రకారం.. తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడకుండా ఉండే ఈ ప్రవృత్తిని బైస్టాండర్ ఎఫెక్ట్ (Bystander Effect) లేదా నిశ్శబ్ద ఆమోదమని పిలుస్తారు. మనకెందుకులే అని తప్పుకునే ప్రతీ పెద్ద మనిషి, ఆ తప్పు చేస్తున్నవాళ్లకి పరోక్షంగా సపోర్ట్ ఇస్తున్నట్లే లెక్క. న్యాయం వైపు నిలబడకుండా మౌనంగా ఉండే పెద్దలున్న ఇళ్లలో లేదా సొసైటీలో కుటుంబ బంధాలు ఎప్పటికీ పచ్చగా ఉండవు.

Elders Silence

ఎందుకంటే, శత్రువు చేసిన గాయం కంటే కూడా.. మన అనుకున్న ఆ పెద్దలు అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడకుండా ఉన్న మౌనమే బాధితులను ఇంకా ఎక్కువ కాలం వేధిస్తుంది. కాబట్టి మంచితనం అంటే అందరి దృష్టిలో మంచి వ్యక్తి అనిపించుకోవడం కాదు. అన్యాయం జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడి ధైర్యంగా నిలదీయడమే నిజమైన మంచితనమని పెద్దలు గుర్తించాలి.

Sanju : సంజూ ఔట్.. ప్రభ్ సిమ్రన్ ఇన్..జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

Exit mobile version