Emotional Attrition
మనం లైఫ్‌లో రకరకాల మనుషులను, వాళ్లలో ఉండే వెరైటీ మైండ్ సెట్‌లను చూస్తుంటాం. అయితే తమ మాటే నెగ్గాలనే పంతం ఉన్నవాళ్లను కూడా చూస్తాం. వీరిలో కొందరు గట్టిగా అరిచి కేకలు వేసి తమ పంతం నెగ్గించుకుంటే, మరికొందరు సైలెంట్‌గా ఉండి తాము అనుకున్నది సాధిస్తారు.
కానీ వీటన్నింటికంటే అత్యంత డిఫరెంట్ అయిన ఇంకో టైప్ పంతం ఉంది. అదేంటంటే వీళ్లు మీతో అస్సలు గొడవ పడరు, కోపంగా ఉండరు.. కనీసం ఆర్గ్యుమెంట్ కూడా చేయరు. కానీ ఈ ఒక్కసారికి ఒప్పుకో.. నువ్వు కాదనకు.. అంటూ ఒకసారి, పదిసార్లు కాదు ఒప్పుకునే వరకూ వంద సార్లు కూడా అడుగుతూనే ఉంటారు.
మనం ఎంత గట్టిగా నో చెప్పినా, అసలు వినకుండా సేమ్ విషయాన్ని రిపీటెడ్‌గా మళ్లీ మళ్లీ అడుగుతూ మన మైండ్‌ని కంప్లీట్‌గా వాష్ చేస్తారు. చివరికి మనకే విసుగొచ్చో, భరించలేకో.. సర్లే నీ ఇష్టం అని మనం లొంగిపోయేలా చేస్తారు.
సైకాలజీ పరిభాషలో ఇలాంటి బిహేవియర్ ని ఎమోషనల్ అట్రిషన్(Emotional Attrition) లేదా చాలా సెన్సిటివ్ అయిన వేధింపు అంటారు. అంటే, ఎదుటివారి సహనం, ఓపిక పూర్తిగా నశించేంత వరకు ప్రశాంతంగా, స్మూత్‌గా దాడి చేయడం వీళ్లకు తమ మాటే నెగ్గించుకోవాలనే పంతం, తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటాయి.
గొడవపడితే పని జరగదని, అదే గనుక బ్రతిమాలుతూ విసిగిస్తే తప్పకుండా ఒప్పుకుంటారని వీళ్లకు బాగా తెలుసు. ఒకసారి నో అని చెప్పినా సరే.. రకరకాల ఎమోషనల్ డైలాగులతో ప్రతిరోజూ అదే టాపిక్ తెచ్చి మెంటల్‌గా తమ వినే పరిస్థితికి తెచ్చుకుంటారు. ఇక్కడ గొడవ జరగదు కానీ వాళ్లు అనుకున్న పంతం మాత్రం నెగ్గుతుంది.
అయితే వాళ్లు బ్రతిమాలుతున్నారని నిర్ణయాలను పదే పదే మార్చుకుంటే, ఫ్యూచర్‌లో ప్రతీ చిన్న విషయంలో కూడా ఇలాగే లొంగదీసుకుంటారు. అందుకే వీళ్లు ఎలా ప్లీజ్ చేస్తుంటారో అలాగే అవతలి వాళ్లు కూడా అలాగే మెట్టు దిగకుండా ఉండటం నేర్చుకోవాలి. ఎదుటివారి బౌండరీస్ మీద ఫుల్ క్లారిటీ ఉందని వాళ్లకు అర్థమైతే, పదే పదే అడిగే స్ట్రాటజీని మెల్లగా పక్కన పెట్టేస్తారు.
