Emotions
ప్రపంచంలో మనం చాలామందిని ప్రేమిస్తాం.. చాలామంది అభిప్రాయాలకు ఇంపార్టెన్స్ ఇస్తాం అలాగే ఎదుటివారి ఎమోషన్స్‌కు(Emotions) రియాక్టయి వారిని ఓదారుస్తాం కూడా. అయితే మనలోని భావోద్వేగాలకు మనమెంత గౌరవం ఇస్తున్నామనేదే ఇక్కడ ప్రశ్న. లోపల సుడిగాలిలా బాధ లేదా కోపం ముంచుకొస్తున్నా నాకేం కాలేదు అంతా బాగానే ఉందని ఫేక్ స్మైల్ వెనుక దాక్కోవడం చాలామందికి అలవాటైపోయింది.
సైకాలజీ చెబుతున్న దాని ప్రకారం, మన ఎమోషన్స్‌కు(Emotions) మనం ఇచ్చుకునే రెస్పెక్ట్ మన మెంటల్ హెల్త్‌కు నాంది పలుకుతుంది. ఎందుకంటే, బయటి ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందనేది పక్కన పెడితే, మన ఫీలింగ్స్‌ను మనం ఎలా స్వీకరిస్తున్నామనేదే మన అసలైన ఆత్మగౌరవం (Self-Respect).
మన భావోద్వేగాలను గౌరవించడం అంటే .. మన మనసు చెప్పే ప్రతి మాటను మనమే కాస్త ఆగి వినడం అన్నమాట. సైకాలజీ ప్రకారం మన ఎమోషన్స్‌ను పర్ఫెక్ట్‌గా గౌరవించుకోవడానికి కొన్ని కీలకమైన మార్గాలను ఫాలో అయితే సరిపోతుంది. ముందుగా మన ఆలోచనలను, ఫీలింగ్స్‌ను తొక్కిపెట్టడం ఆపేయాలి.
మనకు కోపం వచ్చినా, ఏడుపు వచ్చినా లేదా బాగా భయమేసినా కూడా బలంగా ఉండాలి. .ఏడవకూడదని మనల్ని మనం అణచివేసుకోవడం అంటే మన ఎమోషన్స్‌ను మనం అవమానించుకోవడమే.
ఏడుపు వస్తే ఏడవడం, బాధగా ఉంటే దాన్ని అంగీకరించడం బేసిక్ ప్రిన్సిపల్. మనసులోని ఫీలింగ్స్‌ను ఇది నాలోని ఒక భాగమని ఓపెన్‌గా ఒప్పుకోవడమే మనకు మనం ఇచ్చుకునే మొదటి రెస్పెక్ట్.
చాలామంది ఒక చిన్న తప్పు జరగ్గానే ఇలా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? నాకేం పిచ్చి పట్టిందా అని తమ ఫీలింగ్స్‌పై తామే విరక్తి పెంచుకుంటారు. సైకాలజీ దీనిని సెల్ఫ్ జడ్జ్‌మెంట్ అంటుంది.
మీరు అనుభవిస్తున్న ప్రతి ఎమోషన్‌కు ఒక బలమైన కారణం ఉంటుంది. కోపం వస్తే మిమ్మల్ని ఎవరో గాయపరిచారని అర్థం, భయమేస్తే ఏదో ప్రమాదం ఉందేమో అని మీ మనసు హెచ్చరిస్తోందని అర్థం. కాబట్టి మీ ఎమోషన్‌ను ఒక శత్రువులా కాకుండా, మీకు ఏదో చెప్పడానికి వచ్చిన ఒక మెసెంజర్‌లా గౌరవించండి.
అయితే మీ ఎమోషన్స్‌కు(Emotions) మీరు ఇచ్చే అతిపెద్ద గౌరవం..బౌండరీస్ (Boundaries) గీసుకోవడమేనని తెలుసుకోవాలి. మీ శాంతిని, సంతోషాన్ని కిల్ చేసే మనుషులకు లేదా పరిస్థితులకు నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఎదుటివారు ఏమనుకుంటారో అని ఒప్పుకోవడమంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. ఈ ప్రవర్తన నన్ను బాధపెడుతోంది, కాబట్టి నేను దీనికి దూరంగా ఉంటానని వారికి చెప్పడమే మీ ఎమోషన్స్‌కు మీరిచ్చే నిజమైన రాయల్ రెస్పెక్ట్ అని గుర్తు పెట్టుకోవాలి.
ఎప్పుడైనా బాధగా ఉంటే ఒక మంచి కప్పు టీ తాగడం, కాసేపు ప్రశాంతమైన మ్యూజిక్ వినడం, లేదా ఒక పేపర్ మీద మీ మనసులోని భావాలను రాయడం (Journaling) చేయండి. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక్క 5 నిమిషాలు అయినా ప్రశాంతంగా కూర్చుని.. ఈ రోజు మీ మనసుకు ఎలా అనిపించిందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇలా మీ బాధను మీరే గుర్తించి, దానికి మీరే ఓదార్పునివ్వడం అంటే దాని కంటే కూడా గొప్ప గౌరవం మరొకటి ఉండదు.
సంతోషం మాత్రమే కాదు, కోపం, బాధ, అసూయ, నైరాశ్యం కూడా మనుషులకు కామన్ అని గుర్తు పెట్టుకోవాలి. వాటిని దాచుకోకుండా, అణచివేయకుండా, నలుగురి కోసం మార్చుకోకుండా ధైర్యంగా స్వీకరించడమే మీ ఎమోషన్స్‌కు మీరిచ్చే అసలైన లగ్జరీ రెస్పెక్ట్. ముందు మీ మనసుకు మీరు గౌరవమిస్తే, ప్రపంచం మొత్తం మిమ్మల్ని గౌరవించడం మొదలుపెడుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.
Expectations : రిలేషన్‌షిప్‌లో ఎక్స్‌పెక్టేషన్స్.. పార్ట్‌నర్ దగ్గర ఆశించడానికి హద్దులుండాలా.?
