Expectations : రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్స్.. పార్ట్నర్ దగ్గర ఆశించడానికి హద్దులుండాలా.?
Expectations : చాలామంది తమ పార్ట్నర్ నుంచి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. కానీ, తమలాగే అవతలి వ్యక్తికి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్, ఆలోచనలు ఉంటాయని గుర్తించలేకపోతుంటారు.
Expectations
ఒక బంధంలో ఉన్నప్పుడు పార్ట్‌నర్‌పై ఎక్స్పెక్టేషన్స్ ఉండటం సహజం. అయితే కొంతమంది భాగస్వామిపై ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదని అలా పెట్టుకుంటే ఎక్కువగా డిజప్పాయింట్మెంట్ అవుతామని అంటారు. నిజమే ఈ మాటల్లో చాలా నిజం ఉంది. కానీ ఇదే విషయంపై మరికొందరు తమ పార్ట్నర్ దగ్గర కాకపోతే తమ ఆశలు, తమ మనసులోని కోరికలు ఇంకెవరి దగ్గర చెప్పుకోవాలని అడిగేవాళ్ల మాటల్లోనూ కూడా అంతే నిజం ఉంది.
సైకాలజీ ప్రకారం చూస్తే.. రిలేషన్షిప్లో ఎక్స్పెక్టేషన్స్(Expectations) ఉండటంలో అసలు తప్పు లేదు. కానీ, ఆ ఆశలు ఎలాంటివి? వాటిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామనే దానిపైనే ఆ రిలేషన్ ఎంత హ్యాపీగా సాగుతుందనేది ఆధారపడి ఉంటుంది. ఈ విషయంపై మనస్తత్వశాస్త్రం చెప్పే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
ప్రేమ, బంధాల సైకాలజీ ప్రకారం ఎక్స్‌పెక్టేషన్స్‌ను మెయిన్‌గా రెండు రకాలుగా చూడొచ్చు. మొదటిది చాలా ఆరోగ్యకరమైన ఎక్స్పెక్టేషన్స్(Expectations). పార్ట్నర్ నుంచి గౌరవం, నమ్మకం, మానసిక మద్దతు, నాణ్యమైన సమయాన్ని ఆశించడం ఏమాత్రం తప్పు కాదు. ఇవి రిలేషన్‌ను మరింత బలోపేతం చేస్తాయి.
అయితే రెండోది అన్‌రియలిస్టిక్ లేదా అపరిమితమైన ఎక్స్పెక్టేషన్స్. అంటే నా పార్ట్నర్ నేను అడగకుండానే నా ప్రతి అవసరాన్ని గుర్తించాలి లేదా నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచే బాధ్యత వారిదేనని అనుకోవడం. ఎందుకంటే ఇలాంటివి ఒక్కోసారి నిరాశకు దారితీస్తాయి.
ఇక్కడ గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. చాలామంది తమ పార్ట్నర్ నుంచి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. కానీ, తమలాగే అవతలి వ్యక్తికి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్, ఆలోచనలు ఉంటాయని గుర్తించలేకపోతుంటారు. అంటే తాము ఎలా కోరుకుంటున్నారో అవే ఆశించడాలు ఎదుటివారికి కూడా ఉంటాయి కదా అని అనుకోరు.
మనం ఒకరి నుంచి ఆశిస్తున్నప్పుడు వారి స్థానంలో నిలబడి ఆలోచించడం కూడా అంతే ముఖ్యం. పార్ట్నర్కి కూడా మనపై అలాంటి ఆశలే ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవడం రిలేషన్లో ఎంతో హుందాతనాన్ని, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే క్షణాలను ఇస్తుంది.

చాలామంది తమ బంధాలలో ఎదుర్కొనే ఇంకో చిన్న సమస్య ఏంటంటే… తమకేం కావాలో పార్ట్నర్కి స్పష్టంగా చెప్పరు. తాను చెప్పకుండానే తన మనసులోని మాట గ్రహిస్తే బాగుండునని అనుకోవడం వల్ల అనవసరమైన కన్ఫ్యూజన్స్ వస్తుంటాయి.
సైకాలజీ ప్రకారం ప్రతిసారీ అవతలి వారి మనసును ఊహించడం, తెలుసుకోవడం ఎవరికీ కూడా సాధ్యం కాదు. అందుకే మన మనసులోని ఆశలను, కోరికలను పార్ట్నర్తో ప్రశాంతంగా, ప్రేమగా పంచుకోవాలి. పార్ట్‌నర్‌పై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పు కాదు. కాకపోతే ఆ ఆశలతో పాటు వారి వ్యక్తిత్వాన్ని కూడా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించడం (Acceptance) నేర్చుకోవాలి.





