External Validation Addiction
సొంత ఇంట్లో వాళ్లపై కన్సర్న్ ఉండదు..ఒక సాయం కూడా ఉండదు.. కానీ బయట ఉన్న ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి మాత్రం కొండంత అండగా నిలబడతారు. ఇలా ప్రతి పది కుటుంబాల్లో కనీసం ఐదిళ్లల్లో అయినా కనిపించే విచిత్రమైన, అత్యంత బాధాకరమైన సీన్ ఇది. పార్ట్‌నర్, పిల్లలు, తోడబుట్టిన వాళ్లు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరు. కానీ బయట సొసైటీలో మాత్రం ..అబ్బో ఎంత మంచివారో, ఎంత ఉదార స్వభావమో అని అందరితో మెచ్చుకోలు పొందుతారు.
ఈ రకమైన బిహేవియర్ వెనుక ఉన్న ప్రధానమైన సైకాలజీని ఎక్స్టర్నల్ వేలిడేషన్ అడిక్షన్ (External Validation Addiction) అంటే సొసైటీ నుంచి మెప్పు పొందే వ్యసనం అంటారు. వీళ్లకు తమ సొంతింట్లోని వాళ్ల ప్రేమ, గౌరవం కంటే కూడా బయట నలుగురు ఇచ్చే చప్పట్లు, పొగడ్తలే ఎక్కువ కిక్ ఇస్తాయి.
ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్లు ఒకలాంటి క్యాలిక్యులేషన్‌తో జీవిస్తారు. ఇంట్లో వాళ్లకు సర్వీస్ చేయాలన్నా, ఇంప్రెస్ చేయాలన్నా ఒకరోజుతో పోదు.. రోజూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కష్టపడాలి. కానీ బయట వాళ్లను ఇంప్రెస్ చేయడానికి చిన్న చిన్న సాయాలు, కన్నర్స్ చూపిస్తే చాలు.. వాళ్లు నెత్తి మీద పెట్టుకుని మోస్తారు.
అందుకే తక్కువ శ్రమతో ఎక్కువ మంచి పేరు (Social Status) వస్తుందనే సైకలాజికల్ షార్ట్‌కట్‌నే వీళ్లు ఎంచుకుంటారు. అందుకే కుటుంబ అవసరాలు, సొంత పిల్లల ఫీజుల వంటి ఇంట్లో ఇంపార్టెంట్ అయిన విషయాలను పక్కన పెట్టి మరీ బయట వాళ్లకు అప్పులు ఇవ్వడం, వారి కోసం ఖర్చు పెట్టడం వంటి పనులు చేస్తుంటారు.
అయితే వీళ్లు తమ జీవితాంతం తమని తాము హీరోలుగా, ఒక త్యాగమూర్తిగా ఫీల్ అవుతూ అదే భ్రమలో బతుకుతారు. అంతే తప్ప నేను నా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదనే సెల్ఫ్ రియలైజేషన్ వీళ్లకు అస్సలు రాదు. ఎవరైనా ఆ విషయాన్ని గుర్తుచేయడానికి ప్రయత్నించినా అది యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు. ఇంట్లో వాళ్లకే కృతజ్ఞత లేదని, తననే పట్టించుకోరని రివర్స్ డ్రామా స్టార్ట్ చేస్తారు.
చివరకు ఏజ్ దాటాక..ఎలాంటి సాయం చేయలేని పరిస్థితికి వచ్చాక.. ఆ బయటి ఫ్రెండ్స్, చుట్టాలు వీరిని కరివేపాకులా తీసి పడేసినప్పుడు మాత్రమే వీళ్లకు అసలు వాస్తవం అర్థమవుతుంది. కానీ అప్పటికే సమయం మించిపోతుంది. అప్పటికే సొంత కుటుంబం వీరికి ఎమోషనల్‌గా ఎప్పుడో పూర్తిగా దూరమైపోతుంది.
ఇలా ఇంట్లో వాళ్లను పట్టించుకోకుండా బయట మంచి అనిపించుకోవడం అనేది ఒక ఫేక్ అండ్ హెల్త్‌లెస్ లైఫ్ అని సైకాలజిస్టులు చెబుతున్నారు. బయట దండలు వేసి వారి అవసరాలు తీర్చుకునే వాళ్లు వారి కష్టంలో ఒక్క రోజు కూడా తోడు ఉండరు. ఈ సింపుల్ లాజిక్ మిస్ అవడంతోనే.. ఇమేజ్ బిల్డింగ్ కోసం సొంత వాళ్లను ఇబ్బందులు పెడుతున్నారు(External Validation Addiction).
ఇలా చేసేవారంతా ఆఖరి రోజుల్లో తీవ్రమైన ఒంటరితనాన్ని, పశ్చాత్తాపాన్ని అనుభవించక తప్పదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా లేదంటే సొసైటీలో ఎంత పేరు తెచ్చుకున్నా.. ఆఖరికి మనం పడిపోయినప్పుడు పట్టుకునేది, పక్కన నిలబడేది సొంత కుటుంబం మాత్రమే అని నిజాన్ని వాళ్లు ముందే గ్రహించాలి.
Homestay : ఖాళీ రూమ్ ఉంటే చాలు మనీ వర్షమే..హోమ్ స్టే తో లక్షల్లో ఆదాయం ఎలా అంటే..
