Ghee
మన భారతీయులకు వేడి అన్నంలో ఒక్క చెంచా నెయ్యి వేసుకుని తినడం అలవాటు. అలా తినడంలో వచ్చే ఆ తృప్తి ప్రపంచంలో దేనిలోనూ దొరకదంటూ లొట్టలేసుకుని మరీ లాగించేస్తారు.
నిజానికి మన భారతీయ ఆహార సంస్కృతిలోనే అన్నం, నెయ్యి కలయికకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఫ్యాట్ పెరిగిపోతుంది, లావైపోతాం అంటూ రకరకాల భయాలతో చాలామంది నెయ్యిని పక్కన పెట్టేస్తున్నారు.
కానీ న్యూట్రిషనిస్టులు మాత్రం ..చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు రోజూ నెయ్యిని ఏదొక రూపంలో పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ఉపయోగాలుంటాయని అంటున్నారు. ఇలా ఫేమస్ అయిందే ఘీ కాఫీ అని చెబుతున్నారు.
నెయ్యి(Ghee)లో ఉండే బ్యూటిరిక్ యాసిడ్ పేగుల హెల్త్‌కు ఒక బూస్టర్‌లా పనిచేస్తుంది. అన్నంతో నెయ్యి కలవడం వల్ల ఫుడ్ చాలా ఫాస్ట్‌గా, స్మూత్‌గా డైజెస్ట్ అయి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. అన్నంలోని కార్బోహైడ్రేట్లు, ఘీ లోని హెల్దీ ఫ్యాట్స్ కలిసి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసే వారికి కావలసిన ఎనర్జీని ఇస్తాయి.
అంతేకాదు, మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు అన్నీ కూడా బాడీలో సరిగా శోషించబడాలంటే కొంత ఫ్యాట్ అవసరం. అందుకే కూరలతో పాటు కొద్దిగా నెయ్యి తీసుకుంటే ఈ పోషకాలను బాడీ పర్ఫెక్ట్‌గా గ్రహిస్తుందని వైద్యులు అంటున్నారు.
ముఖ్యంగా రైస్‌తో పాటు కొద్దిగా నెయ్యి వేసుకుని తినడం వల్ల కార్బోహైడ్రేట్ల జీర్ణం నెమ్మదిస్తుంది. దీనివల్ల భోజనం చేశాక రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా స్పైక్ అవ్వకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. అలాగే నెయ్యిలో ఉండే ప్రయోజనకరమైన ఫ్యాటీ యాసిడ్లు, హెల్దీ ఫ్యాట్స్ మైండ్ పనితీరుకు ఎంతో మేలు చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే నెయ్యి(Ghee)లో సాచురేటెడ్ కొవ్వు కూడా ఉంటుంది కాబట్టి 30 ప్లస్ ఏజ్ ఉన్నవాళ్లు రోజుకు 1 లేదా 2 టీస్పూన్ల వరకు మాత్రమే తీసుకోవడమే మంచిది. ఇది ఫిజికల్ యాక్టివిటీని బట్టి, వయస్సును బట్టి నెయ్యి తీసుకోవడం బెటర్. మెయిన్‌గా ఎక్కువ కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, ఓవర్ వెయిట్ ఉన్నవారు అలాగే డైటింగ్‌లో ఉన్నవాళ్లు మాత్రం డాక్టర్లు లేదా న్యూటిషనిస్ట్‌ల సలహా తీసుకున్నాక మాత్రమే నెయ్యిని తీసుకోవాలి.
Transactional Relationship : కనుమరుగువుతున్న అనుబంధాలు.. ఖాళీ అవుతున్న కుటుంబ బంధాలు
