Hair Spray : హెయిర్ జెల్స్, స్ప్రేలు తెగ వాడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు మీకోసమే..

Hair Spray : బ్యూటీ కోసం వాడే హెయిర్ స్ప్రేల నుంచి వెలువడే మైక్రో పార్టికల్స్ గాలిలో కలిసి, మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు డైరెక్టుగా లంగ్స్‌లోకి దూసుకెళ్తున్నాయని తాజాగా కొన్ని పరిశోధనలు తేల్చి చెప్పాయి.

Hair Spray

జుట్టు స్టైలిష్‌గా, అట్రాక్ట్ చేసేలా కనిపించాలని చాలామంది బ్యూటీ ప్రొడక్ట్స్ వెనుక పరుగులు తీస్తుంటారు. అన్నట్లుగానే క్షణాల్లోనే లుక్ మార్చేస్తున్న .. ఆ హెయిర్ స్ప్రేలు(Hair Spray ), వ్యాక్స్‌లు, జెల్స్ చూసి మురిసిపోతుంటారు.

అయితే జుట్టు అందాన్ని పెంచడానికి వేలకు వేలు డబ్బులు తగలేస్తూ కొంటున్న ఆ కెమికల్ బాటిల్స్, నిజానికి వారి బాడీలోకి సైలెంట్ పాయిజన్‌ను పంపుతున్నాయన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారని నిపుణులు అంటున్నారు. అంతేకాదు రోజూ హెడ్ స్టైల్ చెక్కుచెదరకుండా ఉంచుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నం వారి ఊపిరితిత్తులను ప్రమాదంలోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే బ్యూటీ కోసం వాడే ఈ స్ప్రేల(Hair Spray )నుంచి వెలువడే మైక్రో పార్టికల్స్ గాలిలో కలిసి, మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు డైరెక్టుగా లంగ్స్‌లోకి దూసుకెళ్తున్నాయని తాజాగా కొన్ని పరిశోధనలు తేల్చి చెప్పాయి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) అండ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ జరిపిన రీసెర్చ్‌లో ఈ భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. ఈ సూక్ష్మ కణాలు శ్వాసకోశంలోకి చేరి మెల్లగా ఆస్తమా, తీవ్రమైన అలర్జీలు, స్కిన్ డిసీజెస్‌కు దారి తీస్తున్నట్లు తేలింది.

ఈ ప్రొడక్ట్స్‌లో హైడ్రో ఫ్లోరో కార్బన్స్, థాలేట్స్, లిమోనిన్, లినాలోల్, ప్యారాబెన్, సిలికాన్స్, ఆల్కహాల్, ఫార్మాల్డిహైడ్ రిలీజింగ్ ప్రిజర్వేటివ్స్ వంటి ఎన్నో డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ తలపై ఉండే చర్మాన్ని చాలా ఎక్కువగా దెబ్బతీస్తాయి.

దీనివల్ల స్కాల్ప్‌పై దురద, కురుపులు రావడం, కురుపులు నుంచి నీరు కారడం, జుట్టు విపరీతంగా ఊడిపోయి పల్చబడటం వంటి సైడ్ ఎఫెక్ట్స్‌ వస్తాయి. అంతేకాకుండా బ్లాక్ కలర్‌లో ఉండే జుట్టు కాస్తా.. గోధుమ లేదా ఎరుపు రంగులోకి మారిపోవడం, చుండ్రు పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ కెమికల్స్ ఎఫెక్ట్ ఎక్కువైతే దీర్ఘకాలంలో స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం కూడా ఉందని పరిశోధనలు తేల్చాయి.

పార్టీలు, ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు వీటిని వాడితే పర్వాలేదు అదికూడా ఆ రాత్రికే కెమికల్స్ ఏమీ లేకుండా క్లీన్‌గా హెడ్ బాత్ చేస్తే ఇవి వాడొచ్చు. కానీ అదే అలవాటుగా వాడితే మాత్రం కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్స్ ఏమైనా కొనే ముందు ఆల్కహాల్, పారాబెన్ ఫ్రీ అని చెక్ చేసుకోవాలి. అసలు డెర్మటాలజిస్ట్ సూచనలు లేకుండా, ఇన్‌స్టా రీల్స్‌లో చెప్పారని, యూ ట్యూబ్ షార్ట్స్‌లో చూశామని ఇష్టమొచ్చినట్లు ప్రొడక్ట్స్ కొని వాడకపోవడమే ఎప్పుడూ మంచిదని నిపుణులు అంటున్నారు.

ఒకవేళ ఇప్పటికే ఈ కెమికల్స్ వల్ల జుట్టు లేదా చర్మ సమస్యలను కానీ ఫేస్ చేస్తుంటే, ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

DP Change : మీరూ తరచూ వాట్సాప్, ఇన్‌స్టా డీపీలు మారుస్తున్నారా? అయితే ఇది మీ కోసమే..

↑
Exit mobile version