DP Change : మీరూ తరచూ వాట్సాప్, ఇన్‌స్టా డీపీలు మారుస్తున్నారా? అయితే ఇది మీ కోసమే..
DP Change : సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతూ ఉన్న ఫోటోను, ఏదైనా డిప్రెషన్ మూడ్‌లో ఉన్నప్పుడు డీపీని పూర్తిగా తొలగించడం లేదా ఏదైనా రిలేటెడ్ కొటేషన్స్ పెట్టడం చేస్తుంటారు. అంటే వారికి
DP Change
మన వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ ఓపెన్ చేసినపుడు కొంతమంది రోజూకో కొత్త పిక్‌ను తమ డీపీగా పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇవాళ సెల్ఫీ పెడితే, రేపు ఏదో మంచి కొటేషన్, ఎల్లుండి నేచురల్ వ్యూ, ఆ తర్వాత రోజు మళ్లీ తర్వాత రోజు మరో పాత ఫోటోనో, స్టైలిష్ లుక్‌తో ఉన్న పిక్నో అప్డేట్ చేస్తుంటారు. ఎప్పుడూ ఇలా ప్రొఫైల్ పిక్చర్ మారుస్తూ(DP Change) ఉండేవాళ్ల సైకాలజీ ఎలా ఉంటుందనే విషయం చాలామందికి తెలీదు.
తరచూ డీపీ మార్చడం(DP Change) వెనుక ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ..ఇతరుల అటెన్షన్ అండ్ వాలిడేషన్ కోరుకోవడమే. చాలామంది తమ కొత్త ఫోటోకు వచ్చే కామెంట్లు, లైక్‌లు లేదా ఆ ఫోటోను చూసి ఎవరైనా మెసేజ్ చేస్తారా చేయరా అన్న క్యూరియాసిటీతో తరచుగా పిక్చర్స్ మారుస్తుంటారు.
తమ ప్రెజెన్స్ ను ఇతరులకు గుర్తు చేయడం అలాగే తమను నలుగురు గుర్తించాలనే తపన వీళ్లలో ఉంటుంది. సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాలని కోరుకోవడం వల్ల ..తమ డీపీలకు వచ్చిన చిన్న రెస్పాన్స్ కూడా వీళ్లకు ఒక రకమైన డిజిటల్ హ్యాపీనెస్‌ను ఇస్తుంది.
మరోవైపు కొంతమంది మెంటల్ స్టేటస్ అండ్ మూడ్ స్వింగ్స్కు అద్దం పడుతుంది. మనుషుల ఎమోషన్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకరోజు ఎంతో హ్యాపీగా ఉంటే, మరోరోజు ఒంటరిగా లేదా బాధగా ఫీలవుతారు. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే చాలామంది తమ లోపలి ఫీలింగ్స్‌ను మాటల్లో చెప్పలేక డీపీ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారు.
సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతూ ఉన్న ఫోటోను, ఏదైనా డిప్రెషన్, శాడ్ మూడ్‌లో ఉన్నప్పుడు డీపీని పూర్తిగా తొలగించడం లేదా ఏదైనా రిలేటెడ్ కొటేషన్స్ పెట్టడం చేస్తుంటారు. అంటే వారికి అదొక రకమైన నాన్-వెర్బల్ కమ్యూనికేషన్ అన్నమాట.
ఇక మూడో కోణంలో చూస్తే ఇది లోలోపల ఉండే ఇన్ఫిరియారిటీ లేదా సెల్ఫ్-ఇమేజ్ ఇష్యూస్‌ను కూడా సూచిస్తుంది. పర్ఫెక్ట్ ఫోటో కోసం రోజుకో ప్రొఫైల్ పిక్ పెడతారు. ఈరోజు పెట్టిన డీపీ రేపటికి నచ్చకపోవడం అలాగే దానికంటే అందంగా కనిపించే మరో ఫోటో దొరకగానే వెంటనే దానిని అప్డేట్ చేయడం చేస్తుంటారు.

తమను తాము సొసైటీకి ఏ విధంగా ప్రొజెక్ట్ చేసుకోవాలనే విషయంలో వీరు కాస్త ఎక్కువగానే టెన్షన్ పడుతుంటారనడానికి ఇదే ప్రూఫ్ అంటారు సైకాలజిస్టులు . అయితే అందరి విషయంలోనూ ఇవే రీజన్స్ ఉంటాయని ఏమీ ఉండదు.
కొంతమందికి ఎలాంటి లోతైన కారణాలు ఉండవు. కేవలం డిజిటల్ బోర్డమ్ లేదా ట్రెండ్‌కు తగ్గట్టు అప్డేట్ అవ్వాలనే చిన్న సరదాతో కూడా ఇలా చేస్తుంటారు. మొత్తానికి మనం రెగ్యులర్‌గా పెట్టే చిన్న ప్రొఫైల్ పిక్చర్ వెనుక మన సబ్కాన్షియస్ మైండ్ ఆడిస్తున్న పెద్ద గేమే నడుస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.
OpenAI : ఓపెన్ఏఐ సీక్రెట్ మీటింగ్‌పై కన్ను..ఏఐ టెక్నాలజీతోనే దొంగను పట్టిన ఎఫ్‌బీఐ..





