Perfect Tea
ఉదయం లేవగానే చాలామందికి వేడివేడిగా కప్పు టీ కడుపులో పడాల్సిందే. టెన్షన్ ఉన్నా, హ్యాపీ మూమెంట్ అయినా వెంటనే చాయ్ గుర్తుకువస్తుంది. ఎన్ని రకాల టీ పొడులు ట్రై చేసినా బయట దొరికే ఘుమఘుమలాడే టీ రుచి మాత్రం ఇంట్లో రాదని ఫీలవుతుంటారు.
అయితే అసలైన గుట్టు అంతా టీ మరిగించే పద్ధతిలోనే దాగి ఉందని నిపుణులు అంటున్నారు. ముందు నీళ్లు పోయాలా లేక పాలు పోయాలా అనే ఒక పాయింటే చాయ్ టేస్ట్‌ను మార్చేస్తుంది.
చాలామంది పాలు, నీళ్లు రెండింటినీ కూడా ఒకేసారి గిన్నెలో పోసి మరగబెడుతుంటారు. దీనివల్ల చాయ్ ఒరిజినల్ ఫ్లేవర్ పోతుందనే విషయం వారికి తెలీదు.
ఎప్పుడైనా సరే ముందుగా టీ గిన్నెలో ముందు నీళ్లు మాత్రమే పోసి.. ఆ నీటిలో టీ పొడి, కచ్చాపచ్చాగా దంచిన అల్లం, యాలకులు వేసి బాగా మరిగించాలి.
ఎందుకంటే టీ ఆకుల్లో ఉండే ఒరిజినల్ సువాసన, యాంటీఆక్సిడెంట్లు కేవలం నీటిలో మాత్రమే బయటకు వస్తాయి. మిల్క్‌లో ఉండే ఫ్యాట్.. టీ పొడి సారాన్ని సరిగ్గా బయటకు రానివ్వదు. నీళ్లలో రంగు, ఘాటు బాగా దిగిన తర్వాత పాలు, పంచదార కలిపితే సరిపోతుంది.
మిల్క్ పోసిన తర్వాత ఎక్కువ సేపు మరిగించకూడదు. అలా చేస్తే ఎసిడిటీ రావడం తప్ప టీ కి రుచి ఉండదు. పాలు పోసాక ఒక్కటి, రెండు పొంగులు రాగానే దించేయాలి.
ఇక పర్ఫెక్ట్ చాయ్(Perfect Tea) కొలతల విషయానికొస్తే రెండు కప్పుల చాయ్ కావాలంటే ఒకటిన్నర కప్పుల నీళ్లు, ఒకటిన్నర కప్పుల పాలు వాడితే చాలు. నీళ్లు మరిగిపోగా చివరకు సరైన చిక్కదనంతో మంచి చాయ్ రెడీ అవుతుంది.
అల్లాన్ని ముక్కలుగా వేయకుండా దంచి వేస్తేనే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. మసాలాలు మరీ ఎక్కువగా వేస్తే టీ పొడి టేస్ట్ డల్ అయిపోతుంది. పంచదార ఎప్పుడూ చివర్లోనే వేయాలి. అంతేకాకుండా మిల్క్ పోసిన తర్వాత ఒక కొంచెం ఉప్పు వేస్తే పాల తీపిని బ్యాలెన్స్ చేసి టీ(Perfect Tea) ఫ్లేవర్‌ను పెంచుతుంది.
Sugar : పంచదారకు బై చెప్పేశారా? సైంటిస్టులు చెబుతున్న ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి..
