Victory
జీవితంలో ఎవరిదైనా ఒక పెద్ద డ్రీమ్ నెరవేరినప్పుడు, ఒక అద్భుతమైన విజయాన్ని(Victory)సాధించినప్పుడు, అలాగే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెళ్లి వంటి పెద్ద వేడుక ముగిసినప్పుడు చాలామంది సంతోషంగా ఉంటారు. కానీ విచిత్రంగా కొంత మంది మాత్రం ఆ సమయంలో ఒక రకమైన నిరాశలోకి వెళ్లి.. చెప్పలేనంత వెలితిలోకి జారుకుంటారు. ఎంతో కష్టపడి శిఖరాన్ని చేరుకున్నాక, అక్కడ సంతోషానికి బదులు ఒక తెలియని శూన్యం పలకరిస్తే.. దానిని సైకాలజీలో పోస్ట్-ఈవెంట్ బ్లూస్ లేదా అరైవల్ ఫాలసీ అని పిలుస్తారు.
దీని వెనుక ముఖ్యంగా మనిషి మెదడులోని కెమికల్ ఛేంజెస్ ఉంటాయి. ఒక పెద్ద లక్ష్యం కోసం మనం కష్టపడినప్పుడు మనిషి మెదడు కంటిన్యూస్‌గా డోపమైన్, అడ్రినలిన్ వంటి ఉత్సాహాన్నిచ్చే హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఆ లక్ష్యం కోసం పడే తాపత్రయం వారిని హైపర్ యాక్టివ్‌గా ఉంచుతుంది.
కానీ ఆ పని పూర్తయిన వెంటనే మెదడులో ఈ హార్మోన్ల స్థాయి ఒక్కసారిగా పడిపోతుంది. ఒకప్పుడు పరుగు తీసిన మెదడు, ఒక్కసారిగా ఆగిపోవడంతో ఒక రకమైన విత్‌డ్రాయల్ సింప్టమ్స్ అంటే అలవాటైనది దూరమైనప్పుడు వచ్చే బాధ లక్షణాలు కనిపిస్తాయి. అందుకే పెళ్లి వేడుక ముగిసిన మర్నాడు లేదా పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత మనసు భారంగా అనిపిస్తూ ఉంటుంది.
మరొక కారణం ఏంటంటే..ఎవరైనా ఒక టార్గెట్‌ను ఎంచుకున్నప్పుడు.. ఆ లక్ష్యం నెరవేరితే వారి జీవితంలోని సమస్యలన్నీ తీరిపోవడంతో.. అద్భుతమైన సంతోషాన్ని పొందుతామని భ్రమపడతారు. కానీ తీరా ఆ లక్ష్యం చేరాక, జీవితం మళ్లీ మామూలుగానే ఉందని అర్ధం అవుతుంది. అలాగే సమస్యలు ఇంకా ఉన్నాయని తెలిసినప్పుడు మెదడు ఆ నిజాన్ని తట్టుకోలేక నిరాశలోకి వెళ్తుంది. లక్ష్యం కంటే ఆ టార్గెట్ వైపు సాగే ప్రయాణమే ఎక్కువ కిక్ ఇస్తుంది. తర్వాత ప్రయాణం ముగిసి గమ్యం చేరగానే ఆ కిక్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది.
దీనిని ఓవర్‌కమ్ చేయాలంటే ముందుగా ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలి. విజయం అనేది ఒక ముగింపు కాదని.. అది కేవలం ఒక మైలురాయి మాత్రమేనని గుర్తించాలి. ఏదైనా పెద్ద ఈవెంట్ ముగిసిన వెంటనే ఖాళీగా, స్తబ్ధుగా ఉండకుండా, మళ్లీ చిన్న చిన్న పనుల్లో నిమగ్నమవ్వాలి. నెక్ట్స్ ఏం చేయాలనే దానిపై క్లారిటీ ఉండాలి.
అలాగే, విజయం సాధించినప్పుడు వచ్చే రిజల్ట్ కంటే, ఆ ప్రయాణంలో నేర్చుకున్న ప్రతీ విషయాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. మన సంతోషం కేవలం ఒక్క లక్ష్యం మీదే ఆధారపడి ఉండకూడదన్న విషయాన్ని(Victory) అర్దం చేసుకోవాలి.
జీవితంలో శూన్యం ఏర్పడిందంటే దానర్థం విఫలమయినట్లు కాదు. మెదడు కొత్త లక్ష్యం కోసం సిద్ధమవుతోందని అర్థం చేసుకోవాలి. ప్రతీ నిమిషం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడం, మనకు నచ్చిన వారితో సమయాన్ని పంచుకోవడం ద్వారా ఈ మెంటల్ స్టేటస్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. సంతోషం అనేది గమ్యంలోనే లేదు, అది మనం నడిచే ప్రతి అడుగులో కూడా ఉంటుంది.
Magic Figure : మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది..దళపతికి లైన్ క్లియర్
