Just NationalJust PoliticalLatest News

Magic Figure : మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది..దళపతికి లైన్ క్లియర్

Magic Figure : తమిళనాడులో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు టీవీకే చీఫ్, నటుడు విజయ్ కు లైన్ క్లియర్ అయింది

Magic Figure

తమిళనాడులో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు టీవీకే చీఫ్, నటుడు విజయ్ కు లైన్ క్లియర్ అయింది. వామపక్షాలతో పాటు మరో మూడు చిన్న పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

కానీ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్(Magic Figure) 118. టీవీకే పార్టీకి సొంతంగా ఆ నెంబర్ రాకపోవడంతో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల మద్దతు కోరింది. కాంగ్రెస్ 5 సీట్లు గెలవగా విజయ్ కు మద్దతు ప్రకటించింది. అయితే వామపక్షాలు, వీసీకే , డీఎండీకే పార్టీలు మద్దతు ఇచ్చేది లేదని ప్రకిటించాయి. అటు విజయ్ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూనే గవర్నర్ ను కలిసారు. ప్రభుత్వ ఏర్పాటు అనుమతి కోరుతూ లేఖ ఇచ్చారు.

కానీ గవర్నర్ మాత్రం సంతృప్తి చెందలేదు. మ్యాజిక్ ఫిగర్ (Magic Figure) కు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో రావాలని సూచించారు. దీనిపై రెండోసారి కూడా కలిసినా గవర్నర్ మాత్రం మళ్లీ అదే సూచన చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు, ఇతర ప్రముఖులు గవర్నర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Magic Figure
Magic Figure

మరోవైపు విజయ్ మాత్రం ఎలాంటి విమర్శలు చేయకుండా మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. అటు విజయ్ కు మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గే సైతం రంగంలోకి దిగారు. తమిళనాడులోని చిన్న పార్టీలతో మాట్లాడారు. మరోవైపు డీఏంకే, అన్నాడీఏంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు కూడా వినిపించాయి.

దీంతో ఒక దశలో టీవీకే కు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడినట్టు ప్రచారం జరిగింది. అయితే టీవీకేలోని కొందరు సీనియర్ నేతలు మాత్రం చిన్నపార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు సాగించి సక్సెస్ అయ్యారు. దీంతో విజయ్ కు ఇప్పుడు 118 మంది ఎమ్మెల్యేల బలం దొరికింది. వెంటనే లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్న విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించనున్నారు.

IPL : ఐపీఎల్ లో హనీట్రాప్ కలకలం..ఆటగాళ్లు, ఫ్రాంచైజీలకు బీసీసీఐ వార్నింగ్

Related Articles

Back to top button