Kattu Pongal – Pachi Pulusu : శ్రావణ మాసంలో తినే కట్టు పొంగలి, పచ్చి పులుసు కాంబినేషన్.. ఆచారంతో పాటు ఆరోగ్యం దాగుందా?

Kattu Pongal - Pachi Pulusu : ఆధ్యాత్మికపరంగానే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా కట్టు పొంగలి, పచ్చి పులుసు కాంబినేషన్ చాలా గొప్పదని పెద్దలు చెబుతారు.

Kattu Pongal – Pachi Pulusu

దేవాలయాల్లో నైవేద్యంగా ఇచ్చే ప్రసాదాలకు ఉండే రుచి ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా శ్రావణ మాసంలో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రముఖ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో కట్టు పొంగలి, పచ్చి పులుసును(Kattu Pongal – Pachi Pulusu )అమ్మవారికి ప్రసాదంగా సమర్పించే అద్భుతమైన ఆచారం ఉంది.

కేవలం ఆధ్యాత్మికపరంగానే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా ఈ కట్టు పొంగలి, పచ్చి పులుసు కాంబినేషన్ చాలా గొప్పది. శ్రావణ మాసంలో వర్షాలు పడే సీజన్ కాబట్టి.. మన శరీరం సాత్విక ఆహారాన్ని కోరుకుంటుంది. జీర్ణవ్యవస్థకు మేలు చేసే, ఈజీగా జీర్ణమయ్యే ఈ రెండు వంటకాలను ఎలా తయారు చేయాలో, వీటి వెనుక ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

ముందుగా కట్టు పొంగలి తయారీ కోసం.. బియ్యం, పెసరపప్పు, కొంచెం నెయ్యి, కొద్దిగా జీలకర్ర, మిరియాలు, అల్లం ముక్కలు, జీడిపప్పు, కరివేపాకు, ఉప్పు తీసుకోవాలి. పెసరపప్పును దోరగా వేయించి బియ్యంతో కలిపి మెత్తగా ఉడికించాలి.

ఆ తర్వాత ప్యూర్ నెయ్యిలో జీలకర్ర, మిరియాలు, అల్లం, కరివేపాకు, జీడిపప్పుతో తాలింపు వేసి ఉడికిన పొంగలిలో కలిపితే ఘుమఘుమలాడే కట్టు పొంగలి సిద్ధమవుతుంది.

ఇక పొంగలికి కాంబినేషన్ అయిన పచ్చి పులుసు కోసం చింతపండు రసం, పచ్చిమిర్చి, కొత్తిమీర, బెల్లం, ఉప్పు, తాలింపు కోసం పోపు గింజలు కావాలి. ఈ పచ్చి పులుసును ప్రసాదం కోసం చేస్తారు కాబట్టి ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే చేస్తారు. చింతపండు రసంలో బెల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి ఆవాలు, కరివేపాకుతో తాలింపు వేస్తారు. కొంతమంది తాలింపు పెట్టకుండానే పచ్చి పులుసును ప్రసాదంగా సమర్పిస్తారు.

Kattu Pongal – Pachi Pulusu

ఈ రెండు వంటకాల కలయిక ఒక పర్ఫెక్ట్ న్యూట్రిషన్ కాంబినేషన్ అంటారు ఆరోగ్య నిపుణులు. కట్టు పొంగలిలోని పెసరపప్పు, నెయ్యి శరీరానికి ఇనిస్టెంట్‌ ఎనర్జీని , బలాన్ని అందిస్తాయి. జీలకర్ర, మిరియాలు, అల్లం వేయడం వల్ల అరుగుదలకు తోడ్పడతాయి.

మరోవైపు పొంగలితో పాటు తీసుకునే పచ్చి పులుసు తేలికగా ఉండి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. శ్రావణ మాసంలో మానసిక ప్రశాంతతే కాదు.. శారీరక ప్రశాంతత కూడా అవసరమే కాబట్టి.. అలాంటి సాత్విక జీవన విధానానికి ఈ సాంప్రదాయ వంటకాలు మంచివని పెద్దలు చెబుతారు.

Speaking Without Thinking : ఆలోచించకుండా మాట్లాడే అలవాటు ఉందా? జాగ్రత్త ..నోరు కంట్రోల్ లేకపోతే రిలేషన్స్ కొట్టుకుపోతాయ్..

Exit mobile version