Nana Patekar : విలక్షణ నటనకి నిలువుటద్దం నానా పటేకర్.. గోవాలో హఠాన్మరణం..

Nana Patekar : యూనిక్ యాక్టింగ్ స్టైల్‌తో, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో దశాబ్దాల పాటు సిల్వర్‌ స్క్రీన్‌ను ఏలిన సీనియర్ యాక్టర్ నానా పటేకర్ (75) గురువారం కన్నుమూశారు.

Nana Patekar

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కోట్లాది మంది ఫ్యాన్స్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే విషాద వార్త ఇది. తన యూనిక్ యాక్టింగ్ స్టైల్‌తో, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో దశాబ్దాల పాటు సిల్వర్‌ స్క్రీన్‌ను ఏలిన సీనియర్ యాక్టర్ నానా పటేకర్ (75) గురువారం మార్నింగ్ కన్నుమూశారు. గోవాలోని డోనా పౌలా ఏరియాలో ఉన్న తన సొంత నివాసంలో నానా పటేకర్ స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్‌కు చేరుకునేసరికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

మణిపాల్ హాస్పిటల్‌కి తీసుకువచ్చిన తర్వాత నిపుణులైన డాక్టర్ల టీమ్ సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేస్తూ ఆయనను బ్రతికించడానికి విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. నానా పటేకర్(Nana Patekar) పేరు చెప్పగానే అందరికీ ఆయన పవర్‌ఫుల్ డైలాగ్స్, ఫేస్‌లో కనిపించే సీరియస్ యాక్టింగే ముందు గుర్తుకు వస్తుంది.

1978లో గమన్ అనే మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నానా పాటేకర్(Nana Patekar).. సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా జర్నీ మొదలుపెట్టి బాలీవుడ్, మరాఠీ సినిమాల్లో బెస్ట్ యాక్టర్‌గా ఎదిగారు. పరిందా, ప్రహార్, అంగార్, క్రాంతివీర్, తిరంగా, ఖామోషి, అబ్‌తక్ ఛప్పన్ వంటి క్లాసిక్ మూవీలలో.. ఆయన పోషించిన రోల్స్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే మైల్‌స్టోన్స్‌గా నిలిచాయి.

Nana Patekar

స్క్రీన్ పై హీరో పాత్రలోనైనా, నెగిటివ్ రోల్ అయినా, కామెడీ క్యారెక్టర్ అయినా సరే.. దానిలోకి పరకాయ ప్రవేశం చేసి ఆడియన్స్‌ను కట్టిపడేయడం నానా పటేకర్ స్టైల్. కేవలం డైలాగ్స్ చెప్పడమే కాకుండా సైలెన్స్‌తో కూడా ఫీలింగ్స్‌ను పండించగల చాలా కొద్దిమంది నటుల్లో ఈయన ఒకరు. అందుకే జాతీయ చలనచిత్ర పురస్కారాలతో పాటు ఎన్నో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా ఆయన ఖాతాలో వచ్చి చేరాయి.

ఇక 75 ఏళ్ల వయసులో కూడా నానా పటేకర్(Nana Patekar) సోషల్ సర్వీస్‌లో ముందుండేవారు. అంతేకాదు ఎంతో జోష్‌గా, ఫిట్‌గా ఉండేవారు. ఇటీవల కూడా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో 15 ట్రైసెప్ డిప్స్ చేస్తూ యంగ్ జనరేషన్‌కు ఛాలెంజ్ విసిరిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. అంత బాగా ఫిట్‌నెస్‌ ఉన్న వ్యక్తి ఇప్పుడు హార్ట్ అటాక్‌తో తుదిశ్వాస విడవడం సినీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

Trump On Iran Strike : ఇరాన్‌పై అటాక్‌కు ట్రంప్ మరో స్కెచ్.. ఎన్నికల ముందే ఆ 3 దేశాలలో యుద్ధ మేఘాలు

↑
Exit mobile version