Constructive Mind Game : బంధం విడిపోవడానికి బ్రేకప్.. మరి కన్స్ట్రక్టివ్ మైండ్ గేమ్ గురించి తెలుసా?
Constructive Mind Game : బంధంలోంచి జారుకోవడానికి రీసెంట్గా కన్స్ట్రక్టివ్ బ్రేక్ అప్ అనే మైండ్ గేమ్‌ను ఫాలో అవుతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు.
Constructive Mind Game
లవ్ స్టోరీలలో కలిసి హ్యాపీగా బతుకుదాం అని చెప్పడం చాలా రొటీన్. కానీ ఆ బంధం నచ్చనప్పుడు ఇక మన వల్ల కాదని ముఖం మీద చెప్పడం చాలా పెద్ద సాహసమే అవుతుంది. అయితే డైరెక్టుగా బై చెప్పే ధైర్యం లేనివాళ్లు, బంధంలోంచి జారుకోవడానికి రీసెంట్గా కన్స్ట్రక్టివ్ బ్రేక్ అప్ అనే మైండ్ గేమ్(Constructive Mind Game)ను ఫాలో అవుతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు.
నిజానికి బంధాన్ని తెంచుకునే పద్ధతి ఇది కాదని మానసిక నిపుణులు అంటున్నారు. నచ్చినన్ని రోజులు ఒకరికి ఒకరం అన్నట్లుగా బతికి సడన్‌గా వాళ్ల నోటి నుంచే అవతలివారు వద్దని చెప్పించే ఇలాంటి సైకలాజికల్ ట్రాప్‌ను వాడటం కరెక్ట్ కాదని చెబుతున్నారు.
ఈ మైండ్ గేమ్(Constructive Mind Game) ఎలా స్టార్ట్ అవుతుందనే విషయాలను ..బంధానికి ముగింపు పలకాలనుకున్న వ్యక్తి మొదట మీతో కావాలనే తేడాగా బిహేవ్ చేయడం మొదలుపెడతారు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువ రియాక్ట్ అవ్వడం, లేని అపార్థాలను క్రియేట్ చేయడం, ఊరికినే నోరు పారేసుకోవడం, పార్ట్నర్ సహనానికి మళ్లీ మళ్లీ పరీక్షపెట్టడం వంటివి చేస్తుంటారు.
తమ పార్ట్నర్ ఎన్నిసార్లు సర్దుకుపోదామన్నా.. తమ బిహేవియర్ మార్చుకోకుండా..వారిని తీవ్రమైన ఒత్తిడిలోకి, కోపంలోకి నెట్టి, వారి నోటి నుంచే ఏదొక మాట వచ్చేలా చేస్తారు. ఇక పార్ట్నర్ ఆ కోపంలో లేదా చిరాకులో ఏదైనా ఒక చిన్న మాట అనగానే.. చూసావా? నన్ను వద్దని అన్నావని అంటూ సీన్ పూర్తిగా రివర్స్ చేసేస్తారు.
ఇలాంటి బ్రేకప్ వెనుక ఉన్న మెయిన్ రీజన్ గిల్ట్ ఫీలింగ్ నుంచి తప్పించుకోవడమేనని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒకరి మనసు విరిచేశానన్న నింద తన మీద పడకుండా, విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం దీని ముఖ్య ఉద్దేశం. పార్ట్నర్ను నిందితులుగా నిలబెట్టి, తను మాత్రం సేఫ్‌గా బయటపడటానికి వీరు ఈ రూట్ ఎంచుకుంటారు.
సైకాలజీలో దీనిని పాసివ్ అగ్రెసివ్ బిహేవియర్ లేదా గ్యాస్‌లైటింగ్ యొక్క మరో రూపంగా పరిగణిస్తారు. దీనివల్ల అమాయకంగా మోసపోయిన పార్ట్నర్ తీవ్రమైన ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్లిపోయి, తప్పు తనదేమోనని ఏళ్ల తరబడి మానసికంగా కుంగిపోతుంటారు.

సోషల్ మీడియాల విపరీతంగా చర్చకు వస్తున్న ఈ టాక్సిక్ ట్రెండ్‌ను ముందే గుర్తుపట్టడం చాలా చాలా అవసరం. పార్ట్నర్ కావాలనే మిమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నారని, తమ మధ్యనున్న బంధం నుంచి తప్పుకోవడానికే మీపైనే నిందలు వేస్తున్నారని అనిపిస్తే.. ఆ గిల్ట్ ట్రాప్‌లో పడకుండా వెంటనే అలర్ట్ అవ్వాలి.
ఎవరికైతే బంధాన్ని నిజాయితీగా ఎండ్ చేసే ధైర్యం ఉండదో.. వాళ్లు ఆడే ఈ నాటకంలో మీరొక జోకర్‌గా మారకుండా చూసుకోవాలి. ఆ డ్రామాను అర్థం చేసుకుని మీరే ముందు దూరం జరిగితే మీ మానసిక ప్రశాంతత ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది.
Hangry : ఆకలేస్తే కోపం వస్తోందా.. ఆకలి కోపానికి బ్రేక్ వేసే సింపుల్ సైకాలజీ ట్రిక్స్..





