Mahabharatham
మహాభారతం అనగానే మనందరికీ రాజ్యాల కోసం అయినవారి మధ్య యుద్ధాలు, ఆప్తుల మధ్య కుట్రలు, శపథాలు, అస్త్రశస్త్రాల ప్రయోగాలు గుర్తొస్తాయి. కానీ, జాగ్రత్తగా గమనిస్తే మహాభారతం అనేది కేవలం ఒక యుద్ధ కావ్యం కాదు.. అది మానసిక శాస్త్రానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
వేల ఏళ్ల క్రితం వ్యాస మహర్షి రాసిన ఆ పాత్రలన్నీ.. ఇప్పటి కార్పొరేట్ ఆఫీసుల్లో, మన ఇళ్లల్లో, సొసైటీలో రోజూ మన కళ్ల ముందు తిరుగుతున్న మనుషుల మైండ్ సెట్లకు కార్బన్ కాపీలు అనే అనొచ్చు.
అందుకే మహాభారతం(Mahabharatham)లో ఉన్న సైకాలజీని నేటి లైఫ్ స్టైల్‌లో ఉపయోగిస్తే ఏమవుతుందనే ప్రశ్న చాలా ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. ఈ మైండ్ గేమ్‌ను మనం సరిగ్గా అర్థం చేసుకుని నేటి జీవితాలకు అప్లై చేస్తే.. మన పర్సనల్, ప్రొఫెషనల్ జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి.
మహాభారత సైకాలజీని మన జీవితంలో ఉపయోగిస్తే జరిగే మొదటి మార్పు.. తీవ్రమైన ఒత్తిడి, అయోమయం (Confusion) నుంచి బయటపడటం. కురుక్షేత్ర యుద్ధభూమిలో సొంత బంధువులను చూసిన అర్జునుడు తల్లడిల్లి వీరిపైనా తాను యుద్ధం చేయవలసింది అని తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవుతాడు. అలాగే ఇప్పుడు మనం కూడా కెరీర్‌లోనో, పర్సనల్ లైఫ్‌లోనో సమస్యలు రాగానే నావల్ల కాదని చేతులెత్తేస్తుంటాం.
ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత ఒక పక్కా సైకలాజికల్ కౌన్సెలింగ్ అనే చెప్పొచ్చు. ఫలితం గురించి ఆలోచించకుండా చేయడం నీ బాధ్యత.. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి అని కృష్ణుడు చెప్పిన మైండ్ సెట్ మాటలను
మనం అన్వయించుకుంటే..సగం మానసిక ఒత్తిడి అక్కడే మాయమైపోతుంది. సమస్యలను చూసి పారిపోకుండా, వాటిని ఎలా ఎదుర్కోవాలో క్లారిటీ వచ్చేస్తుంది.
అలాగే, మన లైఫ్‌లో ఉండే ఈగో , జెలస్ వల్ల వచ్చే నష్టాలను ఈ సైకాలజీ క్లియర్‌గా చూపిస్తుంది. దుర్యోధనుడికి ఉన్న అసూయ, కర్ణుడికి ఉన్న ఈగో, ధృతరాష్ట్రుడికి ఉన్న మితిమీరిన పుత్రవ్యామోహం ఇదే బ్లైండ్ అటాచ్‌మెంట్.. ఇవన్నీ ఈ రోజు మన అందరిలో ఉండే నెగెటివ్ ఎమోషన్సే.
ఆ పాత్రల మైండ్ సెట్ వల్ల ఎలాంటి వినాశనం జరిగిందో మనందరికీ తెలుసు. ఈ సైకాలజీని లైఫ్‌లో ఉపయోగిస్తే.. మన ఈగోను ఎక్కడ పక్కన పెట్టాలో, బంధాలలో గుడ్డిగా కాకుండా ఎంతవరకు ప్రాక్టికల్‌గా ఉండాలో అర్థమవుతుంది. మనల్ని నాశనం చేసే నెగెటివ్ ఆలోచనలను కంట్రోల్ చేసుకునే సెల్ఫ్ కంట్రోల్ అలవాటు అవుతుంది.
మహాభారతం(Mahabharatham)లో మరో ముఖ్యమైన విషయం కమ్యూనికేషన్ అండ్ ఫ్రెండ్‌షిప్. కృష్ణుడి మార్గదర్శకత్వాన్ని నమ్మి పాండవులు విజయాన్ని సాధించారు. కానీ శకుని చెప్పే నక్కజిత్తుల మాటలు నమ్మి కౌరవులు సర్వనాశనమయ్యారు. అంటే మన చుట్టూ ఎలాంటి వారున్నారు? మనం ఎవరి మాటలు వింటున్నామనేది మన సక్సెస్‌ను డిసైడ్ చేస్తుంది. ఈ సైకాలజీని ఈ రోజుల్లో ఉపయోగిస్తే.. మన ఫ్రెండ్ సర్కిల్‌లో శకునులుగా ఉన్న టాక్సిక్ పీపుల్‌ను దూరం పెట్టి.. మనల్ని సరైన దారిలో నడిపించే కృష్ణుల వంటి మంచి మెంటార్లను, ఫ్రెండ్స్ ను ఎంచుకునే విచక్షణ మనకు లభిస్తుంది.
చివరగా, మహాభారత సైకాలజీ మనకు పేషెన్స్ అండ్ స్ట్రాటజీని (Strategy) నేర్పిస్తుంది. పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేసినప్పుడు.. ఎన్నో అవమానాలను భరిస్తూనే, తమ నైపుణ్యాలను పెంచుకున్నారు అలాగే బలమైన మిత్రులను సంపాదించుకున్నారు.
ఇప్పటి కాంపిటీటివ్ వరల్డ్‌లో ఏదైనా ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, ఆ సమయాన్ని మన స్కిల్స్ పెంచుకోవడానికి (Up-skilling) ఎలా వాడుకోవాలో ఈ సైకాలజీ చెబుతుంది. టైమ్ బ్యాడ్‌గా ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉంటూ, టైమ్ రాగానే పక్కా స్ట్రాటజీతో సక్సెస్ కొట్టడం ఎలాగో అర్థమవుతుంది .
సింపుల్‌గా చెప్పాలంటే, మహాభారత(Mahabharatham) సైకాలజీని ఇప్పటి లైఫ్‌కు ఉపయోగిస్తే మన మైండ్ ఒక పవర్‌ఫుల్ వెపన్‌గా మారుతుంది. బయట జరిగే కురుక్షేత్రం వంటి జీవిత యుద్ధంలో మనకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మెంటల్ స్ట్రెంగ్త్ లభిస్తాయి. మొత్తంగా జీవితాన్ని గెలవడానికి వేల ఏళ్ల క్రితమే లభించిన అద్భుతమైన గైడ్ మహాభారతంగా చెప్పొచ్చు.
Numerology : నెంబర్ 3 వారి మైండ్ సెట్..వీరితో పెట్టుకుంటే అంతే సంగతులు!
