Parallel Conversations
చాలా మంది పార్ట్నర్స్ చిన్న చిన్న కారణాలతోనో, పెద్ద రీజన్స్తోనో తరచూ గొడవ పడుతుంటారు. అలాంటపుడు వారిద్దరూ ఒకే చోట కూర్చుని ఆ విషయం గురించి మాట్లాడుకుంటారు కానీ, వారి మనస్సుల్లో మాత్రం దానిపై పూర్తిగా వేర్వేరు దిశల్లో వారి ఆలోచనలు నడుస్తుంటాయి.
ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో వారు చెప్పేది వంద శాతం కరెక్ట్ అనిపిస్తున్నా కూడా, ఎదుటి వ్యక్తి దాన్ని సరిగ్గా అదే కోణంలో రిసీవ్ చేసుకోలేరు. సైకాలజీ భాషలో దీనినే పారలల్ కాన్వర్సేషన్స్(Parallel Conversations) లేదా సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు. ఈ రకమైన ఆలోచనా విధానం వల్ల ఆ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా, చివరకు ఆ వారి మాటలు ఒక పెద్ద గొడవగా లేదా మనస్పర్థలుగా రూపాంతరం చెందుతాయి.
దీనిని కాస్త ఉదాహరణలతో చెప్పుకుంటే.. ఒక పార్ట్నర్ ఎమోషనల్ కోణంలో తను ఎంత బాధపడ్డానో, తన మనసు ఏ విధంగా గాయపడిందో చెప్పాలనుకుంటే, రెండో పర్సన్ మాత్రం ఆ ఎమోషన్స్‌ను పక్కనపెట్టి కేవలం లాజిక్ మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు.
అలాగే కొన్నిసార్లు ఒకరు తన పాత గాయాలు, అన్ రిసాల్వడ్ పాస్ట్ ట్రిగ్గర్స్ నుంచి మాట్లాడుతూ ఉంటే, మరొకరు కేవలం ప్రస్తుతం జరిగిన ఫ్యాక్ట్స్ ఆధారంగా రాంగ్ ఎవరిదో తేల్చడానికే అన్నట్లు డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోతారు. అలాగే ఒక పార్ట్నర్ చాలా సింపుల్‌గా ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నామని అనుకుంటే, రెండో వ్యక్తి మాత్రం దానిని తనపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శగా లేదా అటాక్‌గా భావించి బాధపడతారు.
ఇలా ఇద్దరి ఆలోచనా విధానాలు రెండు వేర్వేరు ట్రాకుల్లో పయనిస్తున్నప్పుడు, అక్కడ ఎవరు ఏం చెప్పినా అది చివరకు కంక్లూజన్ ఇవ్వదు. ఈ సైకలాజికల్ మైండ్ గేమ్‌కు చెక్ పెట్టాలంటే మాత్రం.. ఇద్దరిలో కనీసం ఒక్కరైనా కొద్దిసేపు ప్రశాంతంగా కామ్ అయి ఆగిపోవడమే ఏకైక సొల్యూషన్ అని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఒకరు కాసేపు ఆగి, ఎదుటి వ్యక్తి కేవలం తనకు ఆన్సర్ చెప్పడానికి మాట్లాడటం లేదని, తన లోపలి బాధను పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకుని శాంతంగా వింటే చాలు, ఆ కాన్వర్సేషన్(Parallel Conversations) మొత్తం ఒకే పాజిటివ్ డైరెక్షన్లో వెళ్లే ఛాన్స్ ఉంటుంది. చివరిగా ఒకటి గుర్తు పెట్టుకోవాలి.. మన బంధాలలో గెలిచేది పాయింట్లు, లాజిక్స్ కాదు, ఎదుటివారి ఎమోషన్లను గౌరవించడం మాత్రమేనని గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్.
DP Change : మీరూ తరచూ వాట్సాప్, ఇన్‌స్టా డీపీలు మారుస్తున్నారా? అయితే ఇది మీ కోసమే..
