Abhishek Sharma : జోరుమీదున్న అభిషేక్ శర్మ..మళ్లీ నెంబర్ 1 పీఠం కైవసం

Abhishek Sharma : టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకున్నాడు.

Abhishek Sharma

ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో చోటు చేసుకున్న కీలక మార్పులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి . టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకున్నాడు.

తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో కేవలం 35 బాల్స్‌లోన శతకాన్ని పూర్తి చేసి, మొత్తంగా 38 బంతుల్లో 113 రన్స్‌తో చెలరేగాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇషాన్ కిషన్‌ను వెనక్కి నెట్టేసి.. మళ్లీ నెంబర్ 1 ర్యాంకును దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో సంజూ శాంసన్ 20వ ప్లేస్‌కు చేరగా, బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 15వ ర్యాంకు సాధించాడు.

మరోవైపు దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ టెస్టుల్లో ఒకే సమయంలో నెంబర్ 1 బౌలర్‌గా అలాగే నెంబర్ 1 ఆల్‌రౌండర్‌గా నిలిచి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 85 రన్స్ చేయడమే కాకుండా 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌ను అధిగమించడంతో పాటు, ఆల్‌రౌండర్ల లిస్టులో నాలుగేళ్లుగా టాప్ ప్లేస్‌లో ఉన్న రవీంద్ర జడేజాను వెనక్కి నెట్టాడు.

టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాపై 179 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఏకంగా 4 స్థానాలు ఎగబాకి సెకండ్ ర్యాంకుకు చేరుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాత్రమే టెంబా బవుమా కంటే ముందున్నాడు.

KTR : కేటీఆర్‌కు రిలీఫ్.. పాస్‌పోర్ట్ జప్తు వ్యవహారంలో ఏసీబీ చర్యలపై హైకోర్ట్ క్లాస్

↑
Exit mobile version