Spectacle Marks
ఈ రోజుల్లో కళ్లద్దాలు సైట్ ఉన్నవాళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. కంప్యూటర్ స్క్రీన్ల నుంచి ప్రొటెక్షన్, సన్ గ్లాసెస్, లేదంటే ఫ్యాషన్ కోసం.. కారణ ఏదైనా సరే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువ మంది కళ్లజోడు వాడుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా, రెగ్యులర్‌గా గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల ముక్కు రెండుపక్కలా నల్లటి మచ్చలు పడిపోతుంటాయి. నలుగురిలో తిరిగేటప్పుడు ఈ నల్లమచ్చలు అందాన్ని దెబ్బతీస్తున్నాయన్న ఫీలింగ్‌తో చాలామంది ఉంటారు. అయితే ఎలాంటి కాస్మోటిక్ కెమికల్స్ వాడకుండానే, ఇంట్లో లభించే నేచురల్ ఐటమ్స్‌తో ఈ సమస్యకు శాశ్వత చెక్ పెట్టొచ్చని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
ముందుగా ఈజీగా దొరికే అలోవెరా జెల్ ఈ మచ్చలను తగ్గించడంలో సూపర్ కాంబోలా పనిచేస్తుంది. కలబందలో ఉండే స్కిన్ పోషకాలు స్కిన్‌ను రీఫ్రెష్ చేస్తాయి. కాబట్టి తాజా కలబంద జెల్‌ను మచ్చలున్న చోట రోజూ అప్లై చేస్తే మెల్లగా మచ్చలు తగ్గిపోతాయి. అలాగే చల్లదనాన్నిచ్చే కీరాదోస రసంలో బంగాళాదుంప, టమాటా రసం కూడా కలిపి ఆ మిశ్రమాన్ని ముక్కుపై రాయాలి. కాసేపయ్యాక చల్లటి నీటితో ఫేస్ కడుక్కోవాలి. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయి టమాటా పడకపోతే, దానిని స్కిప్ చేసి కేవలం కీరా, ఆలూ రసాలకు కొద్దిగా తేనె కలిపి వాడినా సరిపోతుంది.
అలాగే లెమన్ జ్యూస్‌లో కొద్దిగా రోజ్‌వాటర్ మిక్స్ చేసి మచ్చలపై రాసి 15-20 నిమిషాల తర్వాత కడిగితే నల్లమచ్చలు క్రమంగా తేలికపడతాయి. అంతేకాదు రోజ్‌వాటర్‌కి వెనిగర్ కలిపి రోజూ లైట్‌గా మసాజ్ చేసినా తక్కువ టైమ్‌లోనే ఫలితం ఉంటుంది. వీటితో పాటు విటమిన్-ఇ ఎక్కువగా ఉండే బాదం నూనెతో మచ్చల మీద మెల్లగా మర్దన చేసుకోవాలి.
ఓట్స్, పాలు, తేనె మిశ్రమంతో స్క్రబ్ చేయడం వల్ల కూడా కళ్లద్దాల వల్ల ఏర్పడిన మచ్చలు(Spectacle Marks) తగ్గడమే కాకుండా నోస్ భాగంలో చర్మం చాలా సాఫ్ట్‌గా మారుతుంది. అయితే ఈ సహజసిద్ధమైన చిట్కాలు పాటించే ముందు మన స్కిన్‌కు అవి సెట్ అవుతాయో లేదో తెలుసుకోవడానికి ఓసారి వాడి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే మిగిలిన రోజులు కూడా ఎంచక్కా ఫాలో అయిపోవచ్చు.
Blood Relation : రక్త సంబంధీకులు దూరమవుతున్నారు..బయటివాళ్లే మనవాళ్లలా మారుతున్నారు..
