Transactional Relationship
జేబులో రూపాయి లేకపోతే సొంత కుటుంబసభ్యులే పలకరించడం మానేసే కాలంలో బతుకుతున్నాం. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన స్నేహితులైన సరే, బ్యాంక్ బ్యాలెన్స్ చూసే మనకిచ్చే ప్రయారిటీని డిసైడ్ చేస్తున్నారు.
ఒకప్పుడు ఆ మనిషి ఎలాంటోడని చూసే సొసైటీ.. ఇప్పుడు ఆ మనిషి వెనుక ఎంత ఆస్తి ఉందని మాత్రమే లెక్కలేస్తోంది. చేతిలో డబ్బుంటే చాలు ఎంత చెడ్డోడికైనా.. సొసైటీ వంగి వంగి దండాలు పెడుతోంది. ఎంత మంచివాడికైనా జేబు ఖాళీగా ఉంటే కనీస విలువ కూడా ఇవ్వడం లేదు.
ఇలాంటి పరిస్థితికి అసలు కారణం ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ తుడిచి పెట్టుకుపోవడమేనని సైకాలజిస్టులు అంటున్నారు. పూర్వం తాతయ్యలు, అమ్మమ్మలు, బాబాయిలు, అత్తలు, అన్నదమ్ములు అంతా కూడా ఒకే ఇంట్లో కలిసిమెలిసి బతికేవారు.
ఆ వాతావరణంలో డబ్బు కంటే కూడా మనుషుల మధ్య ఆప్యాయంగా పిలుచుకునే పలకరింపులు, కష్టసుఖాలు పంచుకోవడాలు, ఒకరి కోసం ఒకరు పడే త్యాగాలు.. వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే షేరింగ్, కేరింగ్, పక్కవారిని గౌరవించడం చూస్తూ పెరిగేవారు.
కానీ ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయింది. ఎవరికి వారే యమునా తీరే అనేలా చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోయాయి. దీంతో ఒకరి ఇంట్లో ఏం జరుగుతుందో పక్కంటి వారు కూడా పట్టించుకోని విధంగా పరిస్థితులు మారిపోయాయి.
ఇలా ఒంటరి లైఫ్ స్టైల్ వల్ల మనకేం లాభం, దీని వల్ల మనకు భవిష్యత్తులో ఉపయోగం ఉంటుందా అనే స్వార్థం అందరి మైండ్‌లోకి బలంగా ఎక్కిపోయింది. దీంతోనే ఇప్పుడు బంధాలు అంటే కేవలం ఎదుటివారితో అవసరం ఉన్నంతవరకే అన్నట్లు మారిపోయాయి.
సైకాలజీ భాషలో చెప్పాలంటే..రిలేషన్‌షిప్ నుంచి పూర్తిగా ట్రాన్సాక్షనల్ రిలేషన్‌షిప్.. అంటే లావాదేవీల బంధాల వైపు ఈ సొసైటీ వేగంగా మారిపోయింది. అంటే ఈ మనిషి వల్ల నాకేంటి ఉపయోగమని ఆలోచించడమే ట్రాన్సాక్షనల్ రిలేషన్‌షిప్ ముఖ్య లక్షణం అన్నమాట.
అంతేకాదు ఒక మనిషి దగ్గర డబ్బుంటే, అతడితో ఉంటే మనకేదొకరోజు పనికొస్తాడని అనుకునే ప్రాక్సిమిటీ బయాస్ (Proximity Bias) మనుషుల మైండ్‌లో బలంగా నాటుకుపోయింది.
చాలామంది తమ కంటే ఎక్కువ స్టేటస్ ఉన్నవాళ్లతో కనిపించడానికి కొంచెం ఇష్టపడతారు. దీనిని సైకాలజీలో సోషల్ ప్రూఫ్ అంటారు. అంటే డబ్బున్న మనిషితో మనకున్న సంబంధాన్ని సొసైటీకి చూపిస్తే, మన వాల్యూ కూడా పెరుగుతుందని అపోహపడతారు.
దీనిని నాడీ వ్యవస్థకు సంబంధించిన సోషల్ సెక్యూరిటీ అండ్ యాంగ్జైటీ విషయంగా కూడా చూడొచ్చు. ఇప్పుడు అందరిలో కూడా ఆర్థిక అభద్రతాభావం (Financial Insecurity) పీక్స్‌కు చేరిపోయింది. ఫ్యూచర్‌పై భయం పెరిగినప్పుడు మనిషి మెదడు సర్వైవల్ మోడ్‌లోకి వెళ్తుందన్న మాట.
అటువంటప్పుడు ఆప్యాయతలు, ప్రేమలు కేవలం మాటలకే పరిమితమనిపిస్తాయి. డబ్బు ప్రాక్టికల్ సమస్యలను తీరుస్తుందనే భ్రమ లేదా నమ్మకం వారిలో కలుగుతుంది. దీంతో మెదడు ఆటోమేటిక్‌గా ఎమోషనల్ కంటే ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉన్న వ్యక్తుల వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తుంది.
మొత్తంగా ఆప్యాయతలనేవి కేవలం అవసరమున్నంతవరకే నడిచే నాటకాలుగా మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాల నుంచి వచ్చి సంస్కారాన్ని మరిచి, ఎవరికి వారే అన్నట్లు బతికేస్తున్నంత కాలం ఇదిలా కొనసాగుతూనే ఉంటుంది. మనిషి ఇలాంటి భ్రమల నుంచి బయటపడి, సాటి మనుషులకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే మళ్లీ ఆ పాతరోజుల అనుబంధాలు మళ్లీ బతుకుతాయి.
