Just LifestyleLatest News

Sitting On Floor : నేలపై కూర్చొని తింటే బాడీలో జరిగే మ్యాజిక్ తెలుసా ? ఈ అలవాటుతో ఇక డాక్టర్‌తో పనే ఉండదు..

Sitting On Floor : కానీ, మన పూర్వీకులు నేలపై చాప వేసుకుని, ప్రశాంతంగా పద్మాసనంలో కూర్చుని తినేవారు. అయితే పాత పద్ధతి కాదని, దాని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగుందని డాక్టర్లు చెబుతున్నారు.

Sitting On Floor

ఇప్పుడంతా మోడరన్ లైఫ్‌స్టైల్‌కి, వెస్ట్రన్ కల్చర్‌కి బాగా అలవాటు పడిపోయారు. ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉండటాన్ని కూడా అదొక స్టేటస్ సింబల్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కొన్నికొన్నిసార్లు ప్లేట్ పట్టుకుని నిలబడే తినేయడం అలాగే కుర్చీలో కూర్చుని భోజనం కానిచ్చేయడం చేస్తున్నారు.

కానీ, మన పూర్వీకులు నేలపై చాప వేసుకుని, ప్రశాంతంగా పద్మాసనంలో కూర్చుని తినేవారు. అయితే పాత పద్ధతి కాదని, దాని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగుందని డాక్టర్లు చెబుతున్నారు. నేలపై పద్మాసనంలో కానీ అది వేయలేని వారు సుఖాసనంలో కానీ కూర్చున్నప్పుడు, బాడీ ఆటోమేటిక్‌గా ఒక రిలాక్స్డ్ స్టేట్‌లోకి వెళ్తుంది. దీన్నే సైంటిఫిక్ భాషలో రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ అంటారు.

అంటే మనం తిన్న ఆహారం కడుపులోకి వెళ్లగానే, అది చాలా స్మూత్‌గా , పర్ఫెక్ట్‌గా జీర్ణమవ్వడానికి మన బాడీ తనకు తానుగా రెడీ అవుతుందన్న మాట. అదే డైనింగ్ టేబుల్స్ మీద వంగి ఫుడ్ తినడం వల్ల వెన్నెముక దెబ్బతింటుంది. కింద నిటారుగా కూర్చోవడం వల్ల స్పైన్ తన నేచురల్ షేప్‌లోనే ఉండటం వల్ల పొట్ట భాగంలో ఉండే కోర్ కండరాలు నెక్స్ట్ లెవెల్‌లో యాక్టివ్ అవుతాయి.

అంతేకాదు, ప్రతీరోజూ నేలపై కూర్చోవడం(Sitting On Floor), మళ్లీ లేవడం వల్ల బాడీకి తెలీకుండానే ఒక బెస్ట్ వర్కవుట్ దొరికినట్లు అవుతుంది. తొడలు, మోకాళ్లు, చీలమండల కీళ్లకు మంచి వ్యాయామం జరిగి, వయసు పెరిగినా జాయింట్స్ మూమెంట్ బాగుంటుంది.

Sitting On Floor
Sitting On Floor

అంతేకాదు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని టీవీ లేదా ఫోన్ చూస్తూనో, కబుర్లు చెబుతూనో తినడం కంటే, కింద కూర్చుని ప్రశాంతంగా తింటే.. మైండ్ పూర్తిగా ఆహారం మీద ఫోకస్ చేస్తుంది.అపుడే కడుపు నిండినట్లు మైండ్ ఇచ్చే సిగ్నల్స్‌ను త్వరగా క్యాచ్ చేయగలుగుతారు. దీంతో ఓవర్ ఈటింగ్ అలవాటుకు చెక్ పడుతుంది.

సరైన భంగిమలో కింద కూర్చుని తినడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. మనసుకి కూడా ప్రశాంతత దక్కుతుంది. కాకపోతే మోకాళ్ల నొప్పులు, హిప్ సమస్య ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా తీసుకున్నాకే ఈ పద్ధతి ఫాలో అయితే మంచిది.

Megastar Chiranjeevi : ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి.. మెగాస్టార్ టీమ్ రియాక్షన్

Related Articles

Back to top button