Relatives : రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నారా? ఎంత ఆత్మీయులైనా సరే ఈ హద్దులు దాటకండి..

Relatives : బంధువుల ఇంట్లోని వస్తువులను మన సొంత ఆస్తిలా వారి అనుమతి లేకుండా వాడేయడం మర్యాద అనిపించుకోదు.

Relatives

అప్పుడప్పుడూ రిలేటివ్స్ ఇంటికి వెళ్లడం, వాళ్లతో సరదాగా గడిపి రావడం అందరికీ ఇష్టమే. కానీ కొన్నిసార్లు మనకు తెలీకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎలాంటి డీప్ అనుబంధాలైనా దెబ్బతినే అవకాశం ఉంటుంది.

బంధుత్వాలు ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలన్నా, సొసైటీలో మన గౌరవం తగ్గకుండా ఉండాలన్నా మనం ఎలా ప్రవర్తించాలనే విషయాలను ఆనాడే చాణక్యుడు కొన్ని అద్భుతమైన జీవన సూత్రాలలో అందించాడు.

ఏ పని మీద బంధువుల ఇంటికి వెళ్తామో ఆ పని పూర్తి కాగానే తిరిగి వచ్చేయడం మంచిది. ఎంత ప్రేమ ఉన్నా సరే గెస్ట్‌గా ఎక్కువ రోజులు ఉండిపోతే ఆతిథ్యం ఇచ్చేవారి డైలీ లైఫ్‌కు ఎంతో కొంత డిస్టర్బెన్స్ కలుగుతుంది. అది మెల్లగా గెస్ట్‌లపై విసుగు పుట్టేలా చేస్తుంది.

రిలేటివ్స్(Relatives) ఇంటికి వెళ్లాలని అనుకున్నప్పుడు ముందుగా వారి షెడ్యూల్‌ను అడిగి తెలుసుకోవాలి. ఎప్పుడు వెళతారు.. ఎన్నిరోజులు ఉంటారు అన్నది ముందే క్లియర్‌గా చెబితే దానికి తగ్గట్లుగా వారి ప్లాన్స్ చేసుకుంటారు.

అలాగే, వారి ఇంటికి వెళ్లినప్పుడు వారి ఫ్యామిలీ గొడవలు, ఫైనాన్సియల్ వ్యవహారాలలో అనవసరంగా తలదూర్చకూడదు. వాళ్లే వచ్చి సజెషన్ అడిగితే తప్ప ఏ విషయంలోనూ అభిప్రాయాలను చెప్పడం మంచిది కాదు.

అలాగే వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పుడూ విమర్శించకపోవడమనేది చాలా ఇంపార్టెంట్. మన కోసం వారు కష్టపడి చేసిన ఫుడ్ నచ్చకపోయినా, ఇంట్లోని వసతులు ఏమైనా తక్కువగా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలే తప్ప వారి ఇంట్లోని లోపాలను చెబుతూ చిన్నచూపు చూడకూడదు.

అంతేకాదు బంధువుల ఇంట్లోని వస్తువులను మన సొంత ఆస్తిలా వారి అనుమతి లేకుండా వాడేయడం మర్యాద అనిపించుకోదు. ఏ చిన్న వస్తువు కావాలన్నా కూడా వాళ్లను గౌరవంగా అడిగి తీసుకోవడం మంచిది. దీని వల్ల మీ ఇమేజ్ కూడా పెరుగుతుంది.

Relatives

రిలేటివ్స్(Relatives) ఇంటికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా పిల్లలకో, పెద్దలకో చిన్న పండ్లు, స్వీట్స్ లేదా గిఫ్ట్స్ తీసుకెళ్లడం ఇద్దరి మధ్య ఆప్యాయతను పెంచుతుంది. తిరిగి వచ్చేటప్పుడు మనసారా వారికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకూడదు.

అన్నింటికన్నా ముఖ్యమయినది.. వారింట్లో చూసిన వారి పర్సనల్ విషయాలను లేదా వారి బలహీనతలను, వారు ఆ సమయంలో గెస్టులతో పంచుకున్న మాటలను ఇతరుల దగ్గర ముచ్చట్లుగా చెప్పకూడదు. మొత్తంగా ఒకరి సీక్రెసీని మరొకరు గౌరవించినప్పుడే ఏ రిలేషన్స్ అయినా ఎక్కువ కాలం నిలుస్తాయి.

Relationship Secrets : ప్రేమ ఉంటే సరిపోదా? గోల్స్ డిఫరెంట్‌గా ఉంటే రిలేషన్‌షిప్ సక్సెస్ అవడం కష్టమా?

↑
Exit mobile version