Food Safety Raids
షాపింగ్ మాల్స్‌లో కళ్లు చెదిరే కలర్‌ఫుల్ లైటింగ్స్, చూడగానే వావ్ అనిపించే గ్రాండ్ ఇంటీరియర్స్ చూసి బ్రాండెడ్ ఫాస్ట్ ఫుడ్ అని ఫిక్స్ అయిపోతాం. కానీ వేలకు వేలు తగలేసి మనం తింటున్న కాస్ట్లీ ఫుడ్ వెనుక ఎంత డేంజరస్ కథ నడుస్తోందో తెలిస్తే మాత్రం మనందరి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బర్గర్లు, పిజ్జాల తయారీ వెనుక జరుగుతున్న సీన్లు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. లోకల్ షాపుల్లో అపరిశుభ్రంగా ఉంది అంటే ఓకే అనుకోవచ్చు.. కానీ గ్లోబల్ వైడ్‌గా ఓ రేంజ్లో క్రేజ్ ఉన్న కేఎఫ్‌సీ, డొమినోస్ వంటి కల్ట్ బ్రాండ్లు కూడా జనాల హెల్త్‌తో ఇలా ఆటలాడుతుండటం ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్ అయింది.
తెలంగాణ స్టేట్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు నవంబర్ 12 గురువారం సిటీలోని ఈ ఫేమస్ ఫాస్ట్ ఫుడ్ హబ్‌లపై ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. 13 ఫుడ్ సేఫ్టీ టీమ్స్ పోలీసులతో కలిసి హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 26 కేఎఫ్‌సీ, డొమినోస్ ఔట్లెట్లలో ఒకేసారి చెకింగ్‌లకు దిగారు.
అయితే ఈ స్పాట్ రైడ్స్‌లో బయటపడిన షాకింగ్ దృశ్యాలు చూసి అధికారులు కూడా అవాక్కయ్యారు. హైజీన్ రూల్స్ అన్నిటిని పక్కన పెట్టేసి నాసిరకం ఫుడ్ సర్వ్ చేస్తుండటంతో 7 కేఎఫ్‌సీ ఔట్లెట్లను, 2 డొమినోస్ పిజ్జా ఔట్లెట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను స్పాట్లోనే క్యాన్సిల్ చేసేసి అక్కడికక్కడే షట్టర్లు వేయించారు.
అసలు ఈ పెద్ద బ్రాండ్ల కిచెన్స్ లోపల స్టోరేజ్ ఏరియాల్లో ఈగలు, బొద్దింకలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. ఎలుకల వ్యర్థాలు, గోడల నిండా బూజుతో పాటు జిడ్డు పట్టిన గిన్నెలు, భరించలేని బ్యాడ్ స్మెల్ మధ్య ఈ కాస్ట్లీ ఫుడ్‌ను ఇష్టం వచ్చినట్లుగా ప్రిపేర్ చేస్తున్నారు. ఎక్స్పైరీ అయిపోయిన ఐటెమ్స్ కూడా ఏ మాత్రం భయం లేకుండా వాడేస్తున్నారు.
అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే, ఆల్రెడీ వాడేసిన వంట నూనెను మళ్లీ రీ యూజ్ చేయడం కోసం.. దాని రంగు మార్చి కొత్త దానిలా మెరిపించడం కోసం సింథటిక్ మెగ్నీషియం సిలికేట్ అనే డేంజరస్ కెమికల్‌ను అక్రమంగా మిక్స్ చేస్తున్నట్లు దొరికిపోయింది. ఈ చెకింగ్స్‌లో ఏకంగా 52 కిలోల కెమికల్‌ను సీజ్ చేశారంటేనే ఏ రేంజ్లో కల్తీ జరుగుతోందో అంతా అర్థం చేసుకోవచ్చు.దీంతో అనుమానం ఉన్న 20 ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు.
లైసెన్స్ రద్దయి వెంటనే తాళాలు పడిన ఆ 9 మెయిన్ ఔట్లెట్స్ లిస్ట్ చూస్తే.. కేఎఫ్‌సీకి చెందిన మదీనాగూడ-మియాపూర్, బంజారాహిల్స్, హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక , మాదాపూర్‌లో ఉన్న ఇనార్బిట్ మాల్,సింధి కాలనీ, చార్మినార్, మూసారాంబాగ్ బ్రాంచ్‌లు ఉన్నాయి. అలాగే వీటితో పాటు కొండాపూర్‌లోని శరత్ సిటీ మాల్, మాదాపూర్ ఇనార్బిట్ మాల్లోని డొమినోస్ ఔట్లెట్ల లైసెన్సులు కూడా కట్ అయ్యాయి.
అంతేకాకుండా ఈ ఆర్డర్స్ అమల్లో ఉన్నంత వరకు.. ఆన్లైన్ డెలివరీ యాప్స్ నుంచి కూడా జొమాటో, స్విగ్గీ వంటి వాటిలో ఈ ఔట్లెట్లను వెంటనే రిమూవ్ చేయాలని ఫుడ్ సేఫ్టీ(Food Safety Raids) అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇవి కాక మరో ఎనిమిది ఔట్లెట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు, తీవ్రమైన వయోలేషన్స్ ఉన్న ఇంకో ఐదు ఔట్లెట్లకు షోకాజ్ నోటీసులతో పాటు భారీ జరీమానాలు వేస్తున్నారు.
చిన్న చిన్న స్ట్రీట్ షాపులలో నీట్నెస్ ఉండదని అనుకుంటే ..వందల కోట్ల బిజినెస్ చేసే బ్రాండెడ్ కంపెనీలు కూడా కేవలం ప్రాఫిట్స్ కోసం కస్టమర్ల ప్రాణాలతో బెట్టింగ్ కాస్తున్నాయని హైదరాబాద్ వాసులు షాక్ అవుతున్నారు. వీకెండ్ వస్తే చాలు పిల్లలను తీసుకుని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు పరిగెత్తే భాగ్యనగరవాసులు ఇకనైనా మేల్కోవాలి. బయట మెరిసే డెకరేషన్ చూసి మోసపోకుండా, మనం తినే ఆహారంలో క్వాలిటీ ఉందో లేదా అని వారిని క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోవాలి. అధికారులు ఎంత యాక్షన్ తీసుకున్నా, జనాల్లో కూడా అవేర్నెస్ వచ్చినప్పుడే ఇలాంటివారి నిర్లక్ష్యానికి ఫుల్స్టాప్ పడుతుంది.
