Liking Gap : మాట్లాడాక అయ్యో తప్పు మాట్లాడేసానా అని ఫీలవుతున్నారా? ఇది మీ మైండ్ చేసే మైండ్ గేమ్‌

Liking Gap : మనం అవతలి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనలో ఉండే నెర్వస్‌నెస్, టెన్షన్, సెల్ఫ్ డౌట్స్ మనకు మాత్రమే ఫుల్ హెచ్‌డీలో కనిపిస్తుంటాయి.

Liking Gap

ఎవరితో అయిన ఇంపార్టెంట్ మేటర్ మాట్లాడి బయటపడగానే మన బ్రెయిన్‌లో ఒక్కసారిగా పాత మూవీలు రీ రిలీజ్ అయినట్లు ఆ కాన్వర్షేషన్ అంతా మళ్లీ తిరగడం స్టార్ట్ అవుతుంది. ఛా.. ఆ టైమ్‌లో అలా ఎందుకు నోరు జారాను, అక్కడ అలా కామ్‌ అవ్వకుండా ఉండాల్సింది, వాళ్లకు నా బిహేవియర్ నచ్చిందో లేదోనంటూ చిన్న గ్యాప్‌ని కూడా భూతద్దంలో పెట్టి మరీ పోస్ట్‌మార్టం చేస్తుంటాం.

అవతలి వ్యక్తి ఏమీ అనకుండానే.. నామీద మంచి ఇంప్రెషన్ రాలేదు, నన్ను అస్సలు భరించలేకపోయారని మనకు మనమే ఓ జడ్జిమెంట్ పాస్ చేసేసుకుంటాం. కానీ ఇదంతా మన బ్రెయిన్ మనతో ఆడే జస్ట్ ఒక గిమిక్ మాత్రమేనని మానసిక నిపుణులు చెబుతున్నారు.

సైకాలజీలో ఈ మెంటల్ స్టేట్‌ని లైకింగ్ గ్యాప్” (Liking Gap) అని పిలుస్తారు. కొత్త వ్యక్తులను కలిసినప్పుడు కానీ, మనకు నచ్చిన వాళ్లతో మాట్లాడినప్పుడు కానీ.. మన పట్ల వాళ్ల ఒపీనియన్ ఏంటనేది అంచనా వేయడంలో మన మైండ్ ఘోరంగా ఫెయిల్ అవుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ఈ గ్యాప్ రావడానికి మన బ్రెయిన్‌లో రన్ అయ్యే బ్యాక్‌గ్రౌండ్ రేడియోనే మెయిన్ రీజన్. మనం అవతలి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనలో ఉండే నెర్వస్‌నెస్, టెన్షన్, సెల్ఫ్ డౌట్స్ మనకు మాత్రమే ఫుల్ హెచ్‌డీలో కనిపిస్తుంటాయి. ఇవేమీ అవతలి వ్యక్తికి అస్సలు తెలీవు. ఎప్పుడైతే అవతలి వాళ్ల మనసులో ఏముందో మనకు క్లారిటీ ఉండదో, వెంటనే మనలో ఉన్న ఓవర్ థింకింగ్ నెగిటివ్ వైపుకి రూట్ మార్చేస్తుంది.

ఎవరితోనైనా మాట్లాడి వచ్చిన తర్వాత వాళ్లకు నేను నచ్చలేదనే ఆలోచన రాగానే.. మిమ్మల్ని మీరు అలర్ట్ చేసుకోండి. ఎలాంటి ఆధారాలు లేకుండానే మీ మైండ్ మిమ్మల్ని భయపెడుతోందని గుర్తించండి. మీ గురించి వాళ్లు ఏమనుకుంటున్నారోనని తెలుసుకోవడానికి కాస్త టైమ్ ఇచ్చుకోండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్.. వాళ్లు మీతో గడిపిన టైమ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అడ్వాంటేజ్ తీసుకోలేక ఆగిపోతుంటారు. ఒక్కోసారి వాళ్లు కూడా మీలాగే నేను వాళ్లకు నచ్చానా లేదా అంటూ వాళ్లు కూడా కంగారుపడుతూ మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండే అవకాశం కూడా ఉంటుంది.

Liking Gap

ఈ చెత్త అలవాటు వల్ల మన పర్సనల్ లైఫ్‌, ఫ్రెండ్‌షిప్స్‌ దారుణంగా దెబ్బతింటాయి. నేనంటే వాళ్లకు ఇష్టం లేదని మనకు మనమే ముందు ఫిక్స్ అయిపోతాం. అవతలి వ్యక్తికి మనతో టచ్‌లో ఉండాలని ఉన్నా, మనకున్న ఈ సిల్లీ భయం వల్ల మనం మెసేజ్, కాల్ చేయడానికి ఆలోచిస్తాం. దీనివల్ల ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్‌షిప్‌గా మారాల్సిన ఆ బాండింగ్ మొగ్గలోనే కట్ అయిపోతుంది. దీనివల్ల మన చుట్టూ ఉన్న జనాలు తగ్గిపోయి ఒంటరితనం చుట్టు ముడుతుంది.

Sugar : పంచదారకు బై చెప్పేశారా? సైంటిస్టులు చెబుతున్న ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి..

↑
Exit mobile version