Marriage
పెళ్లి అనగానే డిజైనర్ డ్రెస్సులు, లావిష్ డెస్టినేషన్ వెడ్డింగ్స్.. ఆపై కెమెరా కంటికి చిక్కిన పిక్చర్ పర్ఫెక్ట్ మూమెంట్స్ గుర్తు కొస్తాయి. కానీ అసలు సినిమా అంతా ఆ హడావుడి అంతా అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాతే అసలైన స్క్రిప్ట్ మొదలవుతుంది.
పెళ్లి(Marriage)కి ముందు ఏ షాపింగ్ చేసినా, ఎవరికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నా.. అసలు ఒక బంధాన్ని ఎలా నిర్మించుకోవాలనే దానిపై మాత్రం ఎవరూ పెద్దగా ప్రిపేర్ అవ్వరు. నిజానికి ఎమోషనల్ ఇంటెమసీ అనేది మ్యారేజ్(Marriage) అవగానే అలా ఆటోమేటిక్‌గా వచ్చేసేది కాదు.
అలా అని ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికొకరు బాధ్యతలను పంచుకున్నంత మాత్రాన పార్ట్నర్ మనసులో ఏముందో అర్థం అయిపోతుందని అనుకోవడం కూడా పొరపాటే. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడొచ్చు.. ప్రేమించుకోవచ్చు.. కానీ ఒకరి ఎమోషనల్ వరల్డ్ ఏంటో మరొకరు అర్థం చేసుకోవడానికి చాలా టైమ్ పడుతుంది.
అందుకే ఏళ్లు గడిచినా సరే పార్ట్నర్ గురించి తెలీని విషయాలు చాలా ఉంటాయి. అందుకే వాటిని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ, ఒకరి ముందు ఒకరు ఓపెన్ అయ్యే ఫ్రీడమ్ ఉంటేనే ఆ బంధం స్ట్రాంగ్ అవుతుంది.
ప్రతీ మనిషికి తన వెనుక ఒక డిఫరెంట్ ఎమోషనల్ హిస్టరీ ఉంటుంది. భార్యాభర్తలలో ప్రేమ, గొడవలు, డబ్బులు, ఫ్యామిలీ, బాధ్యతలపై ఇద్దరి ఆలోచనా విధానాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకరికి నార్మల్‌గా అనిపించే ఈ విషయం, మరొకరికి చాలా హర్టింగ్ అనిపించొచ్చు. చాలా వరకు గొడవలు అసలు ప్రాబ్లెమ్ వల్ల రావు.. ఆ పరిస్థితిని ఇద్దరూ ఏ యాంగిల్లో అర్థం చేసుకున్నారనే దానిని బట్టే పెద్దవి అవుతుంటాయి.
బంధంలో రకరకాల ఫేజ్‌లు ఉంటాయి. కొన్ని రోజులు ఎలాంటి ఎఫర్ట్స్ లేకుండా చాలా కనెక్టెడ్‌గా అనిపిస్తే, మరి కొద్ది రోజులు చాలా ఓపికతో, కాన్షియస్గా డీల్ చేయాల్సి వస్తుంది. అయితే చిన్న చిన్న ప్రాబ్లెమ్స్‌ని సాల్వ్ చేసుకోవడానికి.. పదే పదే అవమానపడటం, ఎమోషనల్ నెగ్లెక్ట్, అబ్యూస్ వంటివి భరించాల్సి రావడం కష్టంగా ఉంటుంది. ప్రతి సమస్యను సర్దుకుపోవాలనే మైండ్‌సెట్‌తో అవతలి వారు లైట్ తీసుకుంటుంటే.. అక్కడే అసలు రిస్క్ మొదలవుతుందన్న విషయం వారికి తెలీదు .
కపుల్స్ అయినంత మాత్రాన ఇద్దరి ఇష్టాలు, అభిప్రాయాలు అవసరాలు ఒకేలా ఉండాలని రూల్ ఏమీ లేదు. కలిసికట్టుగా ఉండటానికి, ఇండివిడ్యువాలిటీకి మధ్య కంటిన్యూగా ఒక సాఫ్ట్ నెగోషియేషన్ నడుస్తూ ఉండాలి. ఆరోగ్యకరమైన రిలేషన్ అంటే ఇద్దరూ కలిసి లైఫ్‌లో జర్నీ చేయడం మాత్రమే కాదు.. ఇద్దరికీ ఎవరి స్పేస్ వాళ్లకు దక్కడం కూడా అంతే ఇంపార్టెంట్.
పెద్ద పెద్ద సర్ప్రైజ్లు, గ్రాండ్ గెస్టర్లు ఎప్పుడో ఒకసారి బాగుంటాయి. కానీ రోజూవారీ జీవితాన్ని శాసించేది మాత్రం చిన్న చిన్న విషయాలే. మీరు అప్సెట్గా ఉన్నప్పుడు పార్ట్నర్ సైలెంట్‌గా మీ మాట వినడం, మీరు ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నారో గమనించడం, మీ ఎఫర్ట్స్‌ని అప్రిషియేట్ చేయడం వంటి చిన్న చిన్న మూమెంట్సే రిలేషన్‌షిప్‌కి అసలైన బలాన్ని ఇస్తాయి.
లవ్ ఒక్కటే ఉంటే చాలు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండొచ్చని అనుకోవడం అతి పెద్ద తప్పు. ప్రేమ ఎంత ఇంపార్టెంటో.. ఎమోషనల్ మెచ్యూరిటీ, ఒకరికొకరు అకౌంటబుల్గా ఉండటం, మ్యూచువల్ రెస్పెక్ట్ అలాగే గొడవ తర్వాత మళ్లీ నార్మల్ అవ్వగలగడం కూడా అంతే ఇంపార్టెంట్. అంతేకాదు తప్పు చేసినప్పుడు సారీ చెప్పి మళ్లీ అదే తప్పు రిపీట్ చేస్తే మాత్రం ఆ బంధానికి ఎలాంటి వాల్యూ ఉండదు.
ఫైనల్‌గా ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్(Marriage) గురించి చెప్పాలంటే ఇద్దరూ కలిసి ఒకే గొడుగు కింద లైఫ్ లాంగ్ ఏదోలా ఉండిపోవడం కాదు. ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలు, అలకలు, వచ్చినా సరే.. ఎవరూ కూడా తమ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా, పార్ట్నర్ దగ్గర సేఫ్‌గా ఫీల్ అయ్యే వాతావరణాన్ని క్రియేట్ చేయడమే అసలైన బంధం అని తెలుసుకోవాలి.
Heart Attack : గుండెపోటు లక్షణాలు మగవారిలో, మహిళలలో వేరువేరుగా ఉంటాయని తెలుసా? ఆ సమయంలో ఏం చేయాలి?
