HealthLatest News

Heart Attack : గుండెపోటు లక్షణాలు మగవారిలో, మహిళలలో వేరువేరుగా ఉంటాయని తెలుసా? ఆ సమయంలో ఏం చేయాలి?

Heart Attack : మహిళల్లో గుండెపోటు లక్షణాలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఛాతీ నొప్పితో పాటు విపరీతమైన అలసట, వాంతులు, వీపు లేదా భుజం నొప్పి ఎక్కువగా కనిపిస్తుంటుంది.

Heart Attack

గుండెపోటు అనేది వినడానికి చాలా చిన్న పదంలాగే అన్పించినా ..సెకన్ల వ్యవధిలో జీవితాలను అమాంతం తారుమారు చేసేంత అత్యంత అత్యవసర పరిస్థితిని కల్పిస్తుంది. చాలామంది ఛాతీలో నొప్పి రాగానే గ్యాస్ ప్రాబ్లెమ్ ఏమో అనుకుని లైట్ తీసుకుంటారు.

నొప్పి వచ్చినపుడు అదే తగ్గుతుందిలే అని వెయిట్ చేయడం లేదంటే సొంతంగా బండి నడుపుకొంటూ హాస్పిటల్‌కు వెళ్లడం వంటి ప్రాణాంతక తప్పులు చేస్తూ ఉంటారు. అయితే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

ముందుగా ఛాతీలో ఎప్పుడైనా తీవ్రమైన ఒత్తిడి, శ్వాస ఆడకపోవడం, చెమటలు పట్టడం, దవడ నొప్పి మెల్లగా చేతికి పాకడం వంటి లక్షణాలు కనిపించగానే ఏ మాత్రం వెయిట్ చేయకుండా .. వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్‌కు కాల్ చేయాలి.

ఇలాంటి సమయంలో పేషెంట్ సొంతంగా వాహనం నడపడం చాలా ప్రమాదకరం. అంబులెన్స్ వచ్చే వరకు ఎలాంటి శ్రమ పడకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. టైట్‌గా ఉన్న బట్టలు వేసుకున్నట్లు అయితే వెంటనే వాటిని వదులు చేయాలి. సొంత వైద్యంతో ఆస్పిరిన్ వంటి మాత్రలు వేసుకోకూడదు. మెడికల్ టీమ్ సూచిస్తేనే ఏ టాబ్లెట్ అయినా వాడాలి.

Heart Attack
Heart Attack

మహిళల్లో గుండెపోటు(Heart Attack) లక్షణాలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఛాతీ నొప్పితో పాటు విపరీతమైన అలసట, వాంతులు, వీపు లేదా భుజం నొప్పి ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే చాలామంది వీటిని కేవలం నీరసంగా భావించి లైట్ తీసుకుంటారు.

ఒకవేళ గుండెపోటు వచ్చిన వారు స్పృహ కోల్పోతే వెంటనే అక్కడున్నవారు ఎవరైనా సరే సీపీఆర్ (CPR) అందించే ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి నొప్పి తగ్గి మళ్లీ రావొచ్చు. నొప్పి తగ్గింది కదా అని రిలాక్స్ అవ్వకుండా కచ్చితంగా డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకోవాలి. గుండెపోటు విషయంలో ప్రతి ఒక్క సెకను చాలా విలువైనదని గుర్తుంచుకోవాలి.

Ego In Relationship : బంధంలో ఈగో అడ్డుగోడ వేస్తోందా? స్పందన లేని భాగస్వామితో ముందడుగు వేయొచ్చా?

Related Articles

Back to top button