Possessiveness : పెళ్లిలోనే కాదు.. ఫ్రెండ్‌షిప్, ప్రేమలోనూ పొసెసివ్‌నెస్ ఎందుకు?.. సైకాలజీ ఏం చెబుతోంది?

Possessiveness : మనం ఇష్టపడే వ్యక్తులతో సమయాన్ని గడిపినపుడు, వారితో మాట్లాడినపుడు మన మెదడులో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది.

Possessiveness

మనుషుల మధ్య ఉండే అనుబంధాలలో చాలా నేచురల్‌గా కనిపించే ఫీలింగ్స్‌లో పొసెసివ్‌నెస్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. నా వాళ్లు, వాళ్లు నాకే సొంతం అనే ఆరాటం కేవలం భార్యాభర్తలు, లవర్స్‌ మధ్యే కాదు.. చాలామందిలోనూ కనిపిస్తూ ఉంటుంది.

చిన్నతనంలో ఆటబొమ్మల దగ్గర మొదలయ్యే ఈ ఫీలింగ్.. పెరిగే కొద్దీ ఫ్రెండ్‌షిప్, ప్రేమ, పెళ్లి వంటి ప్రతి రిలేషన్‌లోనూ రకరకాలుగా కనిపిస్తుంది. అయితే ఈ భావనలకు మన బాడీలో విడుదలయ్యే కొన్ని హార్మోన్లే కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు.

మెయిన్‌గా మనిషిలోని పొసెసివ్‌నెస్(Possessiveness) పెరగడానికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మెయిన్ రీజన్. దీనిని లవ్ హార్మోన్ లేదా అనుబంధ హార్మోన్ అని పిలుస్తారు. మనం ఇష్టపడే వ్యక్తులతో సమయాన్ని గడిపినపుడు, వారితో మాట్లాడినపుడు మన మెదడులో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది.

నిజానికి ఆ ఆక్సిటోసిన్ ఎదుటివారిపై ప్రేమాభిమానాలను, నమ్మకాన్ని పెంచడంలో సాయపడుతుంది. అయితే అదే టైమ్‌లో, ఆ ఇష్టమైన వ్యక్తి మనకు దూరం అవుతారేమోననే భయం వచ్చినప్పుడు… ఈ ఆక్సిటోసిన్ వల్లే వారిని మన దగ్గరే ఉంచుకోవాలనే పొసెసివ్‌నెస్ కూడా పెరిగిపోతుంది.

దీంతో పాటు డోపమైన్, సెరోటోనిన్ అనే కెమికల్స్ కూడా ఇలాంటి ఫీలింగ్స్‌పై మరింత ఎఫెక్ట్ చూపిస్తాయి. మనకు నచ్చిన వారితో ఉన్నప్పుడు డోపమైన్ హార్మోన్ వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ సంతోషమే మళ్లీ మళ్లీ కావాలనే ఆరాటం పెరుగుతుంది.

అదే సమయంలో సెరోటోనిన్ తగ్గిపోతే… పదే పదే వారి గురించే ఆలోచించడం, వారి దగ్గర మన ఇంపార్టెన్స్ తగ్గితే తట్టుకోలేకపోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ హార్మోన్ల కలయిక వల్లే మనుషుల్లో నా వాళ్లు, నాకే సొంతం అనే ఫీలింగ్స్ కలుగుతాయి.

చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్లు తమ బొమ్మలను గానీ, తమ అమ్మనాన్నలను గానీ వేరే పిల్లలతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అలాగే ఫ్రెండ్స్ మధ్య కూడా ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నా ఫ్రెండ్ నాతోనే మాట్లాడాలి.. ఇంకొకరితో క్లోజ్‌గా ఉండకూడదు అనుకుంటారు. తమ స్నేహంలో తమకున్న ప్లేస్‌ను ఎక్కడ కోల్పోతామోననే ఒక చిన్న భయం వల్లే ఇలా బిహేవ్ చేస్తారు.

ఇక ప్రేమ, పెళ్లి బంధాలలో ఈ పొసెసివ్‌నెస్ ఇంకా కాస్త ఎక్కువగానే ఎఫెక్ట్ చూపిస్తుంది. పార్ట్‌నర్ పట్ల ప్రేమ, వారి టైమ్‌ తమకే దక్కాలనే ఆశ ఉండటం చాలా అందమైన విషయమే.

అయితే సైకాలజీ ప్రకారం చూస్తే.. వారి బంధంలో తన స్థానం సరిగ్గా ఉందో లేదోననే ఒక చిన్న డౌట్ వచ్చినప్పుడో, నచ్చిన వ్యక్తులు తమకు దూరం అవుతారేమో అనే భయం ఉన్నప్పుడో మనుషులు ఎక్కువ పొసెసివ్‌గా మారిపోతుంటారు.

అయితే ఎప్పుడూ కూడా లిమిట్స్‌లో ఉండే పొసెసివ్‌నెస్(Possessiveness) ఏ రిలేషన్‌షిప్‌కు అయినా ఇంకా అందాన్ని ఇస్తుంది. నువ్వు నాకు ఇంపార్టెంట్ అనే మాట పార్ట్‌నర్‌కు, ఫ్రెండ్స్‌కు ఒక రకమైన భరోసానే ఇస్తుంది.

Possessiveness

అయితే అది అవతలి వారి స్వేచ్ఛను తగ్గించేలా మారినప్పుడు కానీ, వారి ప్రతి చిన్న విషయాన్ని కూడా గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నపుడు కానీ ఆ బంధంలో కాస్త ఇబ్బంది మొదలవుతుంది. అది అవతలి వ్యక్తి అర్ధం చేసుకుని తన పార్ట్‌నర్‌కు తన ప్రేమను, ఇంపార్టెన్స్‌ను వివరించి చెబితే ఓకే కానీ.. తను కూడా అర్ధం చేసుకోకుండా ఓవర్‌గా రియాక్టయితే మాత్రం ఈ బంధం విడిపోయేవరకూ వెళుతుంది.

అందుకే ఏ రిలేషన్‌షిప్‌లో అయినా పొసెసివ్‌నెస్(Possessiveness) ఉండటం చాలా సహజం అని తెలుసుకోవాలి. అయితే ఆ తాపత్రయం తమ ఆప్యాయతను మరింతగా చూపించేలా ఉండాలి తప్ప, అవతలి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదన్న విషయాన్ని గుర్తించాలి.

Date Of Birth : ఈ నెంబర్ వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం..ఈ నెంబర్ వారికి ఆస్తి తగాదాలు సమసిపోతాయి..

Exit mobile version