Dussehra Holidays : దసరా పండగ సెలవులొచ్చేశాయ్.. రెండు రాష్ట్రాల్లో హాలిడేస్ క్యాలెండర్ ఇదే..

Dussehra Holidays : ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో దసరా పండుగ హడావుడి ఎప్పుడూ కూడా డబుల్ రేంజ్‌లోనే ఉంటుందన్న విషయం తెలిసిందే.

Dussehra Holidays

స్టూడెంట్స్‌తో పాటు టీచర్లు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఆ హ్యాపీ మూమెంట్ వచ్చేసింది. ఏదైనా పండుగ వస్తోందంటే చాలు..ఊరి ప్రయాణాలు, కొత్త బట్టలు, పిండి వంటల కంటే ముందు మైండ్‌లో ఈసారి హాలీడేస్ ఎన్ని రోజులు ఇస్తారనే ఆలోచనే ముందుగా అందరికీ వస్తుంది.

పరీక్షల టెన్షన్ నుంచి కాస్త రిలీఫ్ లభించే దసరా హాలీడేస్ కోసం చూస్తున్న స్టూడెంట్స్‌కి, అలాగే ముందుగా టూర్ ప్లాన్ చేసుకునే పేరెంట్స్‌కి, టీచర్లకు రెండు తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు తాజాగా క్లారిటీ ఇచ్చేసారు.

ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో దసరా పండుగ హడావుడి ఎప్పుడూ కూడా డబుల్ రేంజ్‌లోనే ఉంటుందన్న విషయం తెలిసిందే. దసరాకి తోడు బతుకమ్మ సంబురాలు కూడా ఉండటంతో.. ఏకంగా 13 రోజుల పాటు స్కూల్స్‌కు హాలీడేస్ ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి మొదలై అక్టోబర్ 22వ తేదీ వరకు బ్రేక్ తీసుకోవచ్చు. అక్టోబర్ 9న స్కూల్స్ క్లోజ్ అయి తిరిగి అక్టోబర్ 23వ తేదీన బడులు తెరుచుకుంటాయి.

ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ఇలా అన్ని రకాల స్కూల్స్‌కూ ఇదే క్యాలెండర్ వర్తిస్తుంది. అయితే ఈ లాంగ్ హాలిడే మూడ్‌లోకి వెళ్లే ముందే విద్యార్థులు సమ్మేటివ్ అసెస్‌మెంట్ ఎగ్జామ్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రైమరీ క్లాసుల వారికి అక్టోబర్ 5 వ తేదీ నుంచి 9వ తేదీ వరకు, అలాగే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అక్టోబర్ 1 వ తేదీ నుంచి 9వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. తెలంగాణలో అక్టోబర్ 11వ తేదీ నుంచి బతుకమ్మ వేడుకలు స్టార్ట్ అయి, 18న సద్దుల బతుకమ్మతో పీక్స్‌కి చేరుతాయి.

Dussehra Holidays

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్స్‌కు 10 రోజుల పాటు విద్యాశాఖ దసరా సెలవులను(Dussehra Holidays) ప్రకటించింది. అక్కడ అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు హాలిడేస్ ఇస్తున్నారు. అయితే క్రిస్టియన్, మైనారిటీ ఇన్సిస్టిట్యూషన్స్‌కు సంబంధించి ఈ హాలీడేస్(Dussehra Holidays) షెడ్యూల్‌లో చిన్న చిన్న చేంజెస్ ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన విజయదశమి కావడంతో, రెండు రాష్ట్రాల్లోనూ ఆ సమయానికి వేడుకలు గ్రాండ్‌గా జరగనున్నాయి.

Love And Attachment : ప్రేమ నిజంగా ప్రేమేనా..లేక కోల్పోతామనే భయమా? ఓషో చెప్పిన సత్యం..

Exit mobile version